Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
srungara vidya

ఈ సంచికలో >> సినిమా >>

సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌

superstar kidnap

సూపర్‌ స్టార్‌ మహేష్‌ని కిడ్నాప్‌ చేయబోతున్నారు. నిజమే ఇది. అయితే సినిమాలో నిజం. కిడ్నాప్‌ జరిగిందో లేదో సినిమాలో చూడాలి. కొత్త దర్శకుడు ఎ.సుషాంత్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

సినిమా టైటిల్‌ ‘సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌’. లక్కీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై చందు పెన్మత్స నిర్మించనున్నారు ఈ సినిమాని. అనుకోని పరిస్థితుల్లో ముగ్గురు యువకులు హీరో మహేష్‌బాబుని కిడ్నాప్‌ చేయాలనుకుంటారనీ, ఆ క్రమంలో ఆ ముగ్గురికీ ఎదురైన అనుభవాలేమిటి? అన్నదాన్ని హాస్యభరితంగా తెరకెక్కించబోతున్నామని చిత్ర దర్శకుడు, నిర్మాత చెప్పారు.

నందు, భూపాల్‌, ఆదర్శ్‌, వెన్నెల కిషోర్‌, శ్రద్ధాదాస్‌, తేజస్విని, పూనమ్‌కౌర్‌, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్‌, ఫిష్‌ వెంకట్‌ ఈ చిత్రంలో నటీనటులు. సాయికార్తీక్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఎ.సతీష్‌రెడ్డి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌ ప్రవీణ్‌పూడి, సినిమాటోగ్రఫీ ఈశ్వర్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ నేపథ్యంలో వస్తోన్న సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటోంది. కొత్త తరం దర్శకులు విభిన్నమైన ఆలోచనలతో సినిమాలు రూపొందిస్తున్నారు. ఆ కోవలో ఈ సినిమా కూడా రూపొందుతుందేమో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
kalamandir beauties