Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

గర్భవతి కావడం నాకు కొత్తకాదు

garbhavathi kavatam naaku kotta kaadu

శేఖర్ కమ్ముల "అనామిక" చిత్ర కథానాయిక నయనతార ఆ చిత్రం లో తన పాత్ర గురించి అడిగినప్పుడు ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. హిందీ చిత్రం "కహానీ" కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో నయనతార గర్భవతి పాత్ర వేయాల్సి ఉంది. అయితే నయన్ వద్దంటే శేఖర్ సరే అని గర్భవతి కాకుండానే కథని నడిపాడని ప్రచారం జరిగింది. అయితే నయనతార ఈ విషయంలో నిజం లేదంది.

నయన్ గర్భవతిగా నటించడానికి సిధ్ధమయ్యే ఈ రీమేక్ కి ఒప్పుకుందట. కానీ శేఖర్ తన సినిమాలో హీరోయిన్ గర్భవతి కాదంటే, కథలో కథానాయిక గర్భవతిగా ఉండడమే కీలకమైన అంశం అయినప్పుడు అది తీసేస్తే ఎలా అని అడిగిందట నయన్. దానికి శేఖర్ "మనం డిఫెరెంట్ గా చేస్తున్నాం" అనడంతో ఇంకేమీ అనలేదట.

ఇదంతా చెప్తూ, "నేను నటించిన శ్రీరామరాజ్యంలో చాలా సేపు గర్భవతిగానే కనిపిస్తాను. గతంలో తులసి లో కూడా అటువంటి సీన్స్ నటించాను. కనుక గర్భవతి పాత్రలు చేయడం నాకు కొత్త కాదు. నటనన్నాక అన్ని రకాలు చెయ్యాలి. అప్పుడే వైవిధ్యం ఉంటుంది. నటికి కూడా పేరొస్తుంది" అని చెప్పింది.

మరిన్ని సినిమా కబుర్లు
rajanikanth new movie lingaa