Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
seemandra chinnodu,telangaana anna

ఈ సంచికలో >> సినిమా >>

ది మోస్ట్ హ్యాపినింగ్ సీనియర్ ఆర్టిస్ట్ సీనియర్ నరేష్ ..!!

the most senior artist naresh!!

ఆయన కథానాయకుడిగా రంగ ప్రవేశం చేసినా.. కథకు అవసరమైతే నెగిటివ్ రోల్స్ చేయడానికి ఏనాడు అడ్డుచెప్పలేదు. ఇప్పుడు కూడా అదే విధమైన పద్దతిని పాటిస్తూ... ఆర్టిస్ట్ గా సూపర్ బిజీ అయిపోయారు సీనియర్ నరేష్. ఇటీవల విడుదలైన "చందమామ కథలు" చిత్రంలో ఓ ముఖ్య భూమిక పోషించి అందరి మన్ననలు అందుకున్న నరేష్.. త్వరలో విడుదల కాబోతున్న "అనామిక" చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనువిందు చేయనున్నారు. అలాగే... రేయ్ చిత్రంలో నవ్వులు పండించనున్నారు.

ఇక విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా రూపొందుతున్న మలయాళ చిత్రం "దృశ్యం" రీమేక్ లో నరేశ్ పోషిస్తున్న పాత్ర ఆయన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయిందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో ఓ హీరో టర్నడ్ ఆర్టిస్ట్ వరుసబెట్టి వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తుండడం ఎంతైనా అభినందనీయం. నటనలో వైవిధ్యాన్ని మాత్రమే కాకుండా... నిర్మాతలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ... సినిమా ప్రమోషన్ లో పాలుపంచుకుంటూ దర్షకనిర్మాతలకు చేదోడుగా నిలుస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు సినిమాలోని ముఖ్యమైన లేదా కీలక పాత్రల కోసం ఎక్కడెక్కడినుంచో నటులను ఇంపోర్ట్ చేసుకోవాల్సిన బెడద నరేష్ ద్వారా తీరినందుకు దర్శకులు, నిర్మాతలు సీనియర్ నరేష్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు!

మరిన్ని సినిమా కబుర్లు
upendra swisbank ki daaredi release