భారతీయ సినీ జగత్తులో వయసు పెరుగుతున్నకొద్దీ ఇమేజ్ పెంచుకుంటున్న ఏకైక నటుడు రజనీకాంత్. రజనీ అంటే పడి చచ్చే మాస్ ఫ్యాన్స్, రజనీ తదుపరి చిత్రం ఏమయ్యుంటుందా అని వేచి చూసే సినీ జనం కోకొల్లలు. ఈయన ఖ్యాతి జపాన్ వంటి దేశాల్లో కూడా విస్తృతంగా ఉంది.
త్వరలో "విక్రమ సింహ" గా వస్తున్న రజనీ తదుపరి చిత్రం టైటిల్ "లింగ" అని సమాచారం. కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతోందని.. ఇందులో సోనాక్షి, అనుష్కలు హీరోయిన్స్ గా నటిస్తారని వార్త. రజనీ సినిమా అంటేనే అదొక భారీ బడ్జెత్ వ్యవహారం. పైగా రెహ్మాన్ లాంటి దిగ్గజం స్వరపరిచే సంగీతం. వెరసి దేశం మొత్తం బాక్సాఫీసు పండుగ జరుపుకొనే వాతావరణం. ఇక ఈ టైటిల్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు- ఇందులో శివతత్వాన్ని రజనీ తన స్టైల్లో జనానికి చెప్తాడని.
చూద్దాం, ఎంత త్వరగా ఈ చిత్రం సెట్స్ మీదకు వస్తుందో!
|