Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
the most senior artist naresh!!

ఈ సంచికలో >> సినిమా >>

ఉపేంద్ర 'స్విస్ బ్యాంకాక్ కి దారేది' విడుదల

upendra swisbank ki daaredi release

పేంద్ర, భావన జంటగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ మూవీస్ పతాకంపై రమేష్ అవులారి నిర్మించిన వెరైటీ ఎంటర్ టైనర్ 'స్విస్ బ్యాంకాక్ కి దారేది'. 'మినిమం గ్యారంటీ' శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 2న విడుదలకు సిద్ధమయ్యింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రమేష్ ఆవులూరి మాట్లాడుతూ - ''ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై  సెటైరికల్ చిత్రం ఇది. ఈ అంశాన్ని వినోదాత్మకంగా చెప్పడం జరిగింది. బొమ్మాళి రవిశంకర్ ఈ చిత్రంలో విలన్ గా అద్భుతంగా నటించారు. కమర్షియల్ హంగులతో కూడుకున్న ఈ చిత్రంలో పాటలు అత్యద్భుతంగా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండే ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఈ చిత్రానికి పాటలు, మాటలు - బండారు హనుమయ్య, సంగీతం - హరికృష్ణ, నిర్మాత - అవులూరి రమేష్, దర్శకత్వం - యం.జి.శ్రీనివాస్

మరిన్ని సినిమా కబుర్లు
hindi  paruguku prakaash raj dabbing