మొన్నటిదాకా బొద్దుగా ఉన్న బచ్చన్ బహు అకస్మాత్తుగా సన్నబడి మెరుపుతీగలా మెరిసింది. కేన్స్ చిత్రోత్సవాల్లో సన్నబడి సొగసులొలికించిన ఐశ్వర్య రాయి ని చూసి చుట్టూ ఉన్న ప్రకృతి అంతా పరవశించిపోయింది. భారతీయ మీడియా అయిటె గంగవెర్రులెత్తిపోయింది. ఎక్కడ చూసినా ఐశ్వర్య కొత్త ఫోటోలు దర్శనమిస్తున్నాయి మొన్నటినుంచి. అసలు ఇంట్లో అంతలా ఎలా సన్నబడింది? అని సర్వత్రా ఒకటే ప్రశ్న.
నిజంగా ఈ ఫొటోలో చూడండి. అసలు పిల్ల తల్లిలా ఉందా? హాలీవుడ్ నటీమణులకి తీసిపోని అందం, హుందా తనం ఈమె సొంతం. అందుకే నల్ల కోటులేసుకున్న కేన్స్ ఫోటొగ్రాఫర్లంతా ఈమె స్టిల్ కోసం ఎగబడ్డారు.
మళ్లీ ఐష్ తెరమీద హీరోయిన్ గా తళుకులీనినా ఆశ్చర్యం లేదు. షీ ఈజ్ బ్యాక్ అన్నమాట!
|