Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

నేను చాలా రొమాంటిక్‌: ఇలియానా

i am romantic- ileyana

గోవా భామ ఇలియానా వెండితెరపై ఎన్నో సినిమాల్లో రొమాంటిక్‌గా కన్పించింది. రొమాంటిక్‌ సన్నివేశాల్లో తనకు ఎవరూ సాటి లేరనిపించింది. ‘దేవదాసు’ నుంచి ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా వరకు తెలుగులో చాలామంది స్టార్‌ హీరోలతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ని పండిరచిన ఇలియానా, తాను రొమాంటిక్‌ బ్యూటీనని చెప్పుకుంది.

‘అందం అనేది చూసేవారిని బట్టి ఉంటుంది. ప్రేక్షకులు నన్ను రొమాంటిక్‌ యాంగిల్‌లో చూశారు, రొమాంటిక్‌ అనుకుంటున్నారు. అది నిజం కూడా..’ అని చెప్పే ఇలియానా, హిందీ సినిమాలే ఎక్కువగా చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉందిప్పుడు. చాలా రోజుల తరువాత ఓ తెలుగు సినిమా ఫంక్షన్‌లో ఇలియానా ప్రత్యక్షమయ్యేసరికి సినిమా పీపుల్‌ ఆశ్చర్యపోయారు.

తమిళ, హిందీ సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న తాను, హిందీ సినిమాల్లో రాణిస్తున్నానని అంటూ, హిందీ మాట్లాడగలను గనుక హిందీ సినిమాల్లో నటించడం కూడా తేలికవుతోందని చెప్పింది ఇలియానా. హీరోతో సమానంగా సినిమా ప్రమోషన్‌లో హీరోయిన్‌కి హిందీలో గుర్తింపు ఇస్తారని అది తనకు బాలీవుడ్‌లో బాగా నచ్చిన అంశమని ఇలియానా అభిప్రాయం వెలిబుచ్చింది.

మరిన్ని సినిమా కబుర్లు
super star is back