Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
super star is back

ఈ సంచికలో >> సినిమా >>

వస్త్రాలంకరణలో వాళ్ళిద్దరూ స్పెషల్‌

both are special in dress appearence

తెలుగులో సమంత నెంబర్‌ వన్‌ హీరోయిన్‌. రెజినా నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అవడానికి దూసుకెళ్తోంది. స్టార్‌ హీరోల సరసన హీరోయిన్‌ అంటే ఠక్కున సమంత పేరే గుర్తుకొస్తోంది సినీ జనాలకి. కొత్త హీరోలకు రెజినా గోల్డెన్‌ బ్యూటీలా కనిపిస్తోంది. అలా ఈ ఇద్దరూ టాలీవుడ్‌లో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు.

రెజినా, సమంతలకు మరో స్పెషాలిటీ వుంది. సినిమా ఫంక్షన్లకు హాజరయ్యేటప్పుడు డ్రెస్సింగ్‌లో ఇద్దరూ డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. రెజినాకి పోటీగా సమంత, సమంతకి పోటీగా రెజినా డ్రెస్సింగ్‌ విషయంలో జాగ్రత్త పడుతూ, ‘వీరిద్దరికీ మంచి టేస్ట్‌’ వుంది అని సినీ జనాలతో పొగిడిరచుకోవడం గొప్ప విషయంగానే పరిగణించాలి.

హైదరాబాద్‌ వేదికగా డిజైనర్స్‌ పెద్ద సంఖ్యలో వున్నారు. వారిచ్చే సూచనలకు తోడు, తమ శరీరాకృతికి తగిన విధంగా డిఫరెంట్‌ డ్రెసెస్‌ని సెలక్ట్‌చేసుకోవడంలో తారలకూ అభిరుచి వుండాలి. ఆ అభిరుచి వుండబట్టే, సమంతతోపాటుగా రెజినా డిజైనర్‌ బ్యూటీస్‌ అనే గుర్తింపు తెచ్చుకోగలుగుతున్నారు. ఈ పోటీలో సమంతకన్నా రెజినాకే ఎక్కువ మార్కులు పడ్తాయేమో కూడా.

మరిన్ని సినిమా కబుర్లు
memu saitam with great thought