Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: రౌడీ ఫెలో
తారాగణం: నారారోహిత్‌, విశాఖ సింగ్‌, రావు రమేష్‌, ప్రవీణ్‌, అజయ్‌, బంటీ, పోసాని కృష్ణమురళి, సుప్రీత్‌, గొల్లపూడి మారుతీరావు, తాళ్ళూరి రామేశ్వరి తదితరులు.
చాయాగ్రహణం: అరవింద్‌
సంగీతం: సన్నీ
నిర్మాణం: మూవీ మిల్స్‌, సినిమా 5
దర్శకత్వం: కృష్ణ చైతన్య
నిర్మాత: టి. ప్రకాష్‌రెడ్డి
విడుదల తేదీ: 21 నవంబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే
అమెరికా నుంచి స్వదేశానికి తిరిగొస్తాడు రానా (నారా రోహిత్‌). కాస్త ‘ఇగో’ ఎక్కువ అతనికి. తన ఇగో ఎవరైనా దెబ్బ తీస్తే, తిరిగి తన ఇగో శాటిస్‌ఫై అయ్యేంతవరకు ఎంతకైనా తెగించడానికి సిద్ధపడే క్యారెక్టర్‌ రానాది. అలాంటి రానా ఇగో హర్ట్‌ అవుతుంది ఓ సందర్భంలో. ఆ కారణంతోనే, అతను పోలీస్‌ శాఖలో ఉద్యోగం సంపాదిస్తాడు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించినా, ఇగో శాటిస్‌ఫై అయ్యేందుకు సాధారణ పోలీస్‌లా మారే రానా, అనుకోని పరిస్థితుల్లో అవినీతిపరుడైన ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్‌ (రావు రమేష్‌)తో కయ్యం పెట్టుకుంటాడు.  తన ఇగో శాటిస్‌ఫై చేసుకునే క్రమంలో రానా తనకు తారసపడ్డ అవినీతి పరుడైన ఎమ్మెల్యే ఆటకట్టించాడా? రానా ఇగో ఎలా శాటిస్‌ఫై అయ్యింది? అనేవి తెరపై చూడాల్సిన అంశాలు.

మొత్తంగా చెప్పాలంటే
తన ప్రతి సినిమాతోనూ డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్స్‌ని ఎంచుకుంటోన్న నారా రోహిత్‌, ఈ సినిమాలోనూ అలా డిఫరెంట్‌ క్యారెక్టర్‌నే ఎంచుకున్నాడు. పాత్రకు తగ్గ అభినయం ప్రదర్శించాడు. డైలాగ్‌ డెలివరీలోనూ, బాడీ లాంగ్వేజ్‌ విషయంలోనూ సినిమా సినిమాకీ పరిణతి సాధిస్తున్నాడు. అయితే ఫిజిక్‌ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది నారా రోహిత్‌.

హీరోయిన్‌ విశాఖ సింగ్‌కి తెరపై దక్కింది తక్కువ నిడివి వున్న పాత్రే. వున్నంతలో బాగానే చేసింది. రావు రమేష్‌ అద్భుతంగా నటించాడు. ప్రవీణ్‌ ఓకే. సుప్రీత్‌ మామూలే. బంటీ ఫన్నీగా కనిపించాడు. గొల్లపూడి మారుతీరావు తన విలక్షణతను మరోసారి చాటుకున్నారు. అజయ్‌ తదితరులంతా తమ పాత్రలకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు.

కథ సాధారణంగా వున్నా స్క్రీన్‌ప్లే సినిమాకి ప్లస్‌ అయ్యింది. డైలాగ్స్‌ బావున్నాయి. నెరేషన్‌ కొన్ని సీన్స్‌లో చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌గా వుంది. పాటలు తెరపై చూడ్డానికీ అందంగా వున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు ఆకర్షణ. బ్యాక్‌డ్రాప్‌కి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్‌ వున్నాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి నేచురల్‌ లుక్‌ ఇవ్వడంలో ఉపకరించింది. ఎడిటింగ్‌ విభాగం ఇంకాస్త జాగ్రత్తగా పనిచేసి వుంటే బావుండేది.

ఫస్టాఫ్‌ అంతా సరదా సరదాగా సాగిపోతూనే, అవసరమైన మేర రొమాన్స్‌, యాక్షన్‌ సన్నివేశాలతో ముందుకు వెళుతుంది. ఇంటర్వెల్‌ పార్ట్‌ ప్రామిసింగ్‌గా అనిపిస్తుంది. సెకెండాఫ్‌ ఆసక్తి రేపుతూనే, ఎమోషనల్‌ సీన్స్‌ని కలిగి వుంది. ఓవరాల్‌గా సినిమా ఓకే అనిపిస్తుంది. అర్బన్‌, మల్టిప్లెక్స్‌ ఆడియన్స్‌ని మెప్పించగలదు. బి, సి సెంటర్స్‌ ఆడియన్స్‌కు కూడా సినిమా రీచ్‌ అయ్యే అవకాశాలున్నాయి. విడుదలకు ముందు చేసిన పబ్లిసిటీ, విడుదల తర్వాత కూడా కొనసాగిస్తే సినిమాకి మంచి విజయం దక్కే అవకాశం వుంది. బాక్సాఫీస్‌ వద్ద ఓ మోస్తరు విజయం సాధించేందుకు అవకాశాలెక్కువ.
ఒక్క మాటలో చెప్పాలంటే
స్టైలిష్‌ రౌడీ ఫెలో ఒకసారికి ఆకట్టుకుంటాడు
అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with sai dharm tej