హిట్లొచ్చినా... ఛాన్సులు తగ్గాయెందుకో అర్థం కావడం లేదు! - నందిత
తెలుగమ్మాయిలకు ఛాన్స్ దక్కడం ఈ పరిశ్రమలో ఎంత కష్టమో... వాటిని సద్వినియోగం చేసుకొని, హిట్లుగా మలచుకోవడం కూడా అంతేకష్టం. ఈ గ్లామర్ ఫీల్డ్‌లో తెలుగమ్మాయి నిలబడలేదని, తెలుగులో ఓ తెలుగమ్మాయి హిట్లు కొట్టడం చూళ్లేమని బాధపడుతున్న తరుణంలో... నందిత ఓ మెరుపులా మెరిసింది. ప్రేమకథాచిత్రమ్, లవర్స్‌లలో మెప్పించింది. వరుసగా రెండు విజయాలతో నందిత పరిశ్రమని ఆకట్టుకొంది. ఇప్పుడామె చేతిలో మరో రెండు సినిమాలున్నాయి. రామ్ లీలా ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నందితతో చిట్ చాట్
* వరుసగా రెండు సినిమాలు వస్తున్నాయ్... మళ్లీ బిజీ బిజీ అన్నమాట.
- రామ్‌లీల, కృష్ఱమ్మ కలిపింది ఇద్దరినీ ఒకేసారి షూటింగ్ జరుపుకొన్నాయ్. ఇప్పుడు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. రెండు వేర్వేరు కథలు. వేర్వేరు పాత్రలు... వేర్వేరు అనుభూతులు. మొత్తానికి ఇదో మంచి ప్రయాణం..
* రామ్ లీల - కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ రెండింటిలో మీ మనసుకు బాగా నచ్చిన సినిమా?
- అలా చెప్పడం కష్టం. రెండు కథలూ కొత్తవే. కానీ ఒక్క సినిమా పేరే చెప్పాలంటే.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అంటా. సుధీర్ బాబుతో ఇది వరకు ప్రేమకథా చిత్రమ్ చేశా. మాది హిట్ పెయిర్.. తనతో చాలా సౌకర్యంగా ఉంటుంది..
* ఇంతకీ రామ్‌లీలా ఎలాంటి కథ?
- రామ్ అని పేరు పెట్టుకొని కృష్ణుడిలా లీలలు చేసే ఓ వ్యక్తి కథ. ఇదో ప్రయాణం అని చెప్పొచ్చు. కథలో చాలా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దర్శకుడు కథ చెప్పగానే ఓకే చేసేశా. అంత బాగా నచ్చిందీ సినిమా.
* ఇది ముక్కోణపు ప్రేమకథా చిత్రమా?
- అలా అనిపిస్తుంది కానీ.. కాదు. కథలో కొన్ని విచిత్రమైన మలుపులుంటాయ్. వాటిని తెరపై చూసి ఆస్వాదించాల్సిందే.
* వరుసగా రెండు హిట్లు కొట్టినా... అవకాశాలు అంతగా అందిపుచ్చుకోలేదు కారణం ఏమిటి?
- అదే నాకూ అర్థం కావడం లేదు. హిట్లు కొట్టినా ఛాన్సులు తగ్గడం ఆశ్చర్యానికి గురి చేసింది. నా రెండు సినిమాల్లోనూ నటిగా నిరూపించుకొన్నాను. అవి కమర్షియల్‌గానూ ఆడాయి. అయినా అంతగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు ఈ రెండు సినిమాలూ బాగా ఆడి... బిజీ అవుతానేమో చూడాలి.
* పారితోషికం విషయంలో ఇబ్బంది పెడతారని కొన్ని విమర్శలున్నాయి?
- నేను మరీ పెద్ద హీరోయిన్ కాదండీ... నాకు ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి అంటూ గొంతెమ్మ కోరికలు కోరను. ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు..
* మీరు మమ్మీ కూచీ అట... మీ వ్యవహారాల్లో ఆమె జోక్యం ఎక్కువ ఉంటుందట..?
- అమ్మ నా వ్యవహారాలన్నీ చూసుకొంటుంది. నాకు మేనేజర్‌లా పనిచేస్తుంది. అయితే మరీ నిర్మాతల్ని, దర్శకుల్ని ఇబ్బంది పెట్టేంత జోక్యం చేసుకోదు.
* షూటింగ్ ఉండగా సడన్‌గా మాయమైపోతారట..
- ఇది కూడా రూమరే. రామ్‌లీలా షూటింగ్ మలేసియాలో జరిగింది. నా సీన్ లేకపోయినా సెట్లో ఉండేదాన్ని. షూటింగ్ అయిపోయిన తరవాత మాత్రం అమ్మతో కలసి షాపింగ్‌కి వెళ్లేదాన్ని. నాకు షాపింగ్ అంటే పిచ్చి..
* ఏం కొన్నారేంటి మలేసియాలో?
- దుస్తులు, చెప్పులు, కాస్మొటిక్స్.. ఇలా లిస్ట్ చాలా ఉంది లెండి..
* మీ స్థాయి హీరోయిన్లకు తెలుగులో చాలా పోటీ ఉంది కదూ..
- ఔను. పోటీ మామూలుగా లేదు. సినిమా సినిమాకీ పెరుగుతోంది. రోజురోజూ ఓ కొత్త హీరోయిన్ వస్తుంటుంది. అయినా ఇది ఆరోగ్యకరమైన పోటీనే. అందుకే ఆస్వాదిస్తున్నా.
* సినిమాల విషయంలో మీరు మరీ చూజీగా ఉంటారా?
- అదేం లేదు. ఫలానా కథలే చేస్తా అని పట్టుపట్టుకొని కూర్చోను. నాకు కంఫర్ట్ అనుకొంటే సరిపోతుంది.. చేసేస్తా.
* కథ - హీరో - పాత్ర.. మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసే విషయం?
- కచ్చితంగా కథే. కథ బాగుంటే ఆ సినిమాలోని అన్ని పాత్రలూ బాగుంటాయని నమ్ముతా. ఇప్పటి వరకూ చేసిన సినిమాల్నీ కథని నమ్మి చేసినవే.
* ఇంతకీ కృష్ణమ్మ ఎలా ఉండబోతోంది?
- అదే ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ. నా మనసుకు దగ్గరైన సినిమా. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. రామ్ లీలా కూడా చూడండి. ఓ మంచి పాయింట్ చుట్టూఅల్లిన కథ. ఇంట్రవెల్‌లోనూ, క్లైమాక్స్‌లోనూ వచ్చే ట్విస్టులు, ఇచ్చే థ్రిల్స్ అందరికీ నచ్చుతాయ్. రెండు సినిమాల్లోనూ పాటలూ, ఫొటోగ్రఫీ ఎక్స్ లెంట్. అంతేకాదు.. మీ ఫ్యామిలీతో కలసి చూడదగ్గ సినిమాలవి. డోన్ట్ మిస్ ఇట్..
* ఓకే.. ఆల్ ది బెస్ట్ నందిత..
- థ్యాంక్యూ వెరీ మచ్.
|