Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Rakul intelligent answer to Liplock

ఈ సంచికలో >> సినిమా >>

శ్రీదేవి అలాంటివి చేస్తుందా?

Sridevi like it?

సీనియర్‌ నటి శ్రీదేవి ఓ సినిమాలో లిప్‌ లాక్‌ సీన్‌లో నటించనుందంటూ వార్తలు వచ్చేశాయి. కానీ ఇవి నిజం కాదని తేలింది. కన్నడ హీరో సుదీప్‌తో శ్రీదేవి లిప్‌ లాక్‌ సీన్‌లో నటిస్తుందనే వార్త రాగా, ఆ వార్తను సుదీప్‌ ఖండిరచాడు. గాసిప్స్‌లో చెప్పబడుతున్న సినిమాలో తనకే ఆఫర్‌ రాలేదని, శ్రీదేవితో లిప్‌ లాక్‌ అన్నది కూడా పూర్తిగా గాలి వార్త అని కొట్టిపారేశాడు సుదీప్‌.తెలుగు ‘ఈగ’ సినిమాలో విలన్‌గా నటించిన సుదీప్‌, కన్నడలో బిగ్‌ స్టార్‌. సీనియర్‌ నటుడు. ‘ఈగ’ తర్వాత వివిధ భాషల్లో సుదీప్‌కి ఆఫర్స్‌ వస్తున్నాయి. సీనియర్‌ నటి శ్రీదేవి కూడా తిరిగి సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ తర్వాత శ్రీదేవి ఇంకే సినిమాకీ ఒప్పుకోలేదు. లిప్‌ లాక్‌ వార్తలు శ్రీదేవి వరకూ వెళ్ళగా, ఆమె వాటిని చూసి నవ్వుకున్నారట.‘నా వయసుకు తగ్గ పాత్రలు చేస్తాను తప్పించి, మితిమీరిన పాత్రలు చేయను’ అని శ్రీదేవి అంటూ, లిప్‌ లాక్‌ సీన్స్‌లో నటించే వయసు కాదు కదా నాది.. అనేశారట. శ్రీదేవికి ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా వెలిగారు శ్రీదేవి. వైవాహిక జీవితం ఆరంభించాక సినిమాలు కాదనుకుని, పూర్తిగా కుటుంబ బాధ్యతలు స్వీకరించిన శ్రీదేవి, తిరిగి సినిమాల్లో నటించాలనుకున్నా హుందాతనం కలిగిన పాత్రల్నే ఇష్టపడతారు. ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ సినిమా ఆమె టేస్ట్‌ని చెబుతుంది.

మరిన్ని సినిమా కబుర్లు
Rekha by the most learned: Katrina Kaif