Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

సురభికి సూపర్‌ ఛాన్స్‌

Super Chance of Surabhi

‘బీరువా’ సినిమా ప్రమోషన్‌లో సందడి సందడిగా కనిపించిన ఆ సినిమా హీరోయిన్‌ సురభి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సినిమా ‘ఎటాక్‌’లో ఛాన్స్‌ కొట్టేసింది. ఆమెకు ఇది సూపర్‌ ఛాన్సే. రామ్‌గోపాల్‌ వర్మ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తే తద్వారా వచ్చే గుర్తింపు ప్రత్యేకం. ‘ఎటాక్‌’ సినిమాలో ఛాన్స్‌ రావడం పట్ల ఆనందంగా ఉన్నానంటుంది సురభి. డాన్స్‌తోపాటు యాక్టింగ్‌లోనూ తొలి సినిమా ‘బీరువా’తో సురభి మంచి మార్కులేయించుకుంది. తెరపై ఎనర్జీలెవల్స్‌తో కనిపించడమే సురభికి ప్లస్‌ అయ్యింది. అదే ఆమెను వర్మ దృష్టిలో పడేలా చేసి ఉండొచ్చు. ‘ఎటాక్‌’ మూవీలో మనోజ్‌, జగపతిబాబు, వడ్డే నవీన్‌, ప్రకాష్‌రాజ్‌, మంజు భార్గవి ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. రామ్‌గోపాల్‌ వర్మ ఈ మధ్య తెరకెక్కించిన కొన్ని చిన్న సినిమాల్లా కాకుండా ‘ఎటాక్‌’లో భారీతనం కనిపించనుంది. భారీ స్టార్‌ కాస్టింగ్‌, భారీ బడ్జెట్‌తోపాటు వర్మ మార్క్‌ టేకింగ్‌ ఈ సినిమాని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మార్చేశాయి. వర్మ ఈజ్‌ బ్యాక్‌ అనేలా ‘ఎటాక్‌’ సినిమా ఉండబోతుందట. సినిమా సక్సెస్‌ అవుతుందనే పూర్తి నమ్మకం తనకుందని సురభి అంటుంది. ఆమె నమ్మకం నిజమై సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుందాం.

మరిన్ని సినిమా కబుర్లు
dasari, pavan prestigious movie