దీపావళి పద్యం - సిరాశ్రీ

ప్రమిదెల కాంతి శ్రీ కి చిహ్నం..
కాకరపువ్వుత్తుల కాంతి సుఖానికి చిహ్నం..
స్వేచ్ఛగా దూసుకుపోయే జువ్వలు శాంతికి చిహ్నం..
శబ్దాలతో పేలే టపాసులు పౌరుషానికి చిహ్నం...

ఇవన్నీ మన జీవితంలో భాగం కావాలని ఆశిస్తూ ఈ దీపావళి పద్యం.


వాకిలి నిండుగన్ ప్రమిదె పంచెడు చక్కని కాంతిరేఖలున్,
కాకరపువ్వొతుల్, వెలిగి గాలిన రివ్వున పోవు జువ్వలున్,
భీకర శబ్దభేరులుగ పేలెడు మెండగు లక్ష్మి బాంబులున్,
శ్రీకరమై సదా నిలుచు శ్రీ-సుఖ-శాంతియు-పౌరుషమ్ములై