పేకేటి శివరాం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

పేకేటి శివరాం.
పేకేటి శివరాం.
ఈయన అక్టోబరు 8, 1918 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పేకేరు గ్రామంలో జన్మించాడు. 1937లో మద్రాస్ వెళ్లి కొంతకాలం కెమెరా డిపార్ట్‌మెంటులో, 1945లో హెచ్‌ఎంవి గ్రామ్‌ఫోన్ రికార్డు సంస్థలో ఇన్‌ఛార్జిగా పనిచేశాడు. ఆ సమయంలో ఘంటసాలతో లలిత గీతాలు పాడించి ప్రైవేట్ రికార్డు చేశాడు. శ్రమజీవి అనే పత్రికకు కొంతకాలం ఆపద్ధర్మ సంపాదకుడిగా పనిచేశాడు. చిత్ర అనే సినిమా పత్రిక భాద్యతలు నిర్వహించాడు. బెంగళూరు నుండి వెలువడే సినిమా ఫ్లేమ్‌ అనే పత్రికకు మద్రాసు ప్రతినిధిగా పనిచేశాడు. భగవాన్ పేరుతో పద్దెనిమిది డిటెక్టివ్ నవలలురాసారు. ప్రతిభా, వినోద నిర్మాణ సంస్థల్లో ప్రొడక్షన్ వ్యవహారాలు నిర్వహించే రోజుల్లో ‘శాంతి’ (1952) చిత్రంలో నటి సావిత్రి సరసన హాస్య నటుడిగా చిత్రరంగంలో ప్రవేశించి, 1953లో దేవదాసులో భగవాన్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అప్పటినుంచి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో హాస్య నటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 100కు పైగా చిత్రాల్లో నటించాడు. మద్రాసులో ఒకవిందులో మిత్రునితో సాగించిన సినీరంగం, నిర్మాణ కార్యక్రమాల విశే్లషణ వీరిని కన్నడ చిత్ర రంగానికి దర్శకునిగా, ‘చక్రతీర్థ’ కన్నడ నవల చిత్రరూపానికి సారథిని చేసింది. ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. తరువాత ఇతడు 1971 కన్నడంలో రూపొందించిన ‘కుల గౌరవం’ చిత్రం (రాజ్‌కుమార్, భారతి, జయంతిలతో), దాన్ని తెలుగులో యన్‌టిఆర్‌తో 1972లో నిర్మించిన కులగౌరవం చిత్రానికి ఇతడే దర్శకుడు కావటం విశేషం. శ్రీదేవి కంబైన్స్ 1968లో నిర్మించిన 'చుట్టరికాలు' తరువాత, 1969లో అదే సంస్థ నిర్మించిన ‘భలే అబ్బాయిలు’కు దర్శకత్వం వహించారు.
ఇతనికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. కళా దర్శకుడు పేకేటి రంగా వీరి కుమారుడే. తమిళ నటుడు ప్రశాంత్ ఇతని మనుమడు.
ఇతడు నటించిన చిత్రాల పాక్షిక జాబితా:
సంవత్సరం సినిమా భాష ధరించిన పాత్ర
1953
కన్నతల్లి
తెలుగు నటుడు
దేవదాసు
తెలుగు భగవాన్ పాత్రధారి
గుమస్తా
తెలుగు నటుడు
1954
రేచుక్క
తెలుగు నటుడు
వద్దంటే డబ్బు
తెలుగు నటుడు
1955
కన్యాశుల్కం
తెలుగు పోలీసు పాత్రధారి
అనార్కలి
తెలుగు నటుడు
1956 చిరంజీవులు
తెలుగు నటుడు/రత్నం
ఏది నిజం
తెలుగు నటుడు/అతిథి
1957 సువర్ణ సుందరి
తెలుగు వసంతుడు పాత్రధారి
భాగ్యరేఖ
తెలుగు నటుడు
పాండురంగ మహత్యం
తెలుగు నటుడు
వీర కంకణం
తెలుగు నటుడు
1958 పెళ్ళినాటి ప్రమాణాలు
తెలుగు తేజం పాత్రధారి
1959 ఇల్లరికం
తెలుగు నటుడు
జయభేరి
తెలుగు నటుడు
1960 శ్రీ వెంకటేశ్వర మహత్యం
తెలుగు నటుడు
1962 గులేబకావళి కథ
తెలుగు నటుడు
1961 ఉషా పరిణయం
తెలుగు నటుడు
1962 గాలిమేడలు
తెలుగు అతిథి నటుడు
1964 బభ్రువాహన
తెలుగు నటుడు
మురళీకృష్ణ
తెలుగు నటుడు
వెలుగు నీడలు
తెలుగు నటుడు
1967 చక్ర తీర్థ
కన్నడం దర్శకుడు
1968 చుట్టరికాలు
తెలుగు దర్శకత్వం
1969 పునర్జన్మ
కన్నడం దర్శకుడు
భలే అబ్బాయిలు
తెలుగు దర్శకత్వం
1971 కులగౌరవ
కన్నడం దర్శకుడు
Bala Bandhana
కన్నడం దర్శకుడు
1974 అల్లూరి సీతారామరాజు
తెలుగు నటుడు- బ్రేకన్
1975 Dari Tappida Maga
కన్నడం దర్శకుడు
1976 Sutrada Bombe
కన్నడం దర్శకుడు
1978 Maathu Thappadha Maga
కన్నడం దర్శకుడు

మరిన్ని వ్యాసాలు