శకుని - మన పురాణ పాత్రలు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

శకుని - మన పురాణ పాత్రలు .


శకుని .
మహాభారతంలో గాంధారికి తమ్ముడు. దుర్యోధనుని మేనమామ.
మహాభారతయుధ్ధంలో శకుని పాత్ర వెన్నుముక వంటిది. గాంధార దేశరాజు సుబలుడు ఇతనికి గాంధారి,తేజశ్రవ, దశార్ణ,నికృతి, శుభ ,సంహిత, సంభవ,సత్యసేన, సత్యవ్రత,సుదేష్ణ అనే పెర్లు కలిగిన కుమార్తేలు,శకుని, గవాక్షుడు,గజుడు,వృషకుడు,వంటి పలువురు కుమారులుఉన్నారు.ధృతరాష్టృ నికి వివాహం చేయదలచిన భీష్ముడు గాంధారి భక్తి, గుణసంపన్నురాలని తెలుసు కుని ధృతరాష్టృని తో వివాహంజరి పించాడు.శివుని వరాన తనకు పెక్కు సంతతి కలిగేలా వరంపొందిన ఆమొ,తనభర్తగుడ్డి వాడని తెలిసి,తనభర్తకు లేని చూపు తనకూ వద్దని కళ్లకు గంటలు కట్టుకుని జీవించసాగింది.దుర్యోధనునిచే పరాభవింపడి చెరసాలలో తనసోదరులతో ఉన్న శకుని,తన మాయమాటలతొ దుర్యోధనునికి చేరువైనాడు.ధర్మరాజు చేసిన రాజసూయ యాగానికి వెళ్లాడు.తన పాచికల ఆటతో పాండవులను అరణ్యాలకు పంపి దుర్యోధనుడికి మరింత చేరువైనాడు.పాండవులను లక్కఇంటిలో హతమార్చేందుకు వ్యూహంరచించాడు.ద్వైత వనంలో పాండవులు ఉన్నారన తెలిసి,ఘోషయాత్ర చేయించాడు.కురుక్షేత్ర సంగ్రామంలో మొదటి రోజు ప్రతివింధ్యునితోనూ,అలా అభిమన్యునితో నూ, సహదేవుని తో తలపడి రణభూమి లో మరణించాడు. ద్వాపరాంశనజన్మించినవాడు శకుని.ఇతనికి గాంధార,గాంధారపతి, గాంధారరాజా, గాంధారరాజపుత్ర,గాంధారరాజసుత,కితప,పర్వతీయ,సౌబల,సౌబలక,సౌబలేయ,సుబలజ,సుబలపుత్ర,సుబలసుత,సుబలాత్మజా వంటి పలు పేర్లతొ పిలవ బడ్డాడు.
శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు తమ భాగం ఆహారాన్ని కూడా శకునికి ఇచ్చి, తమ పగ తీర్చమని ప్రమాణం చేయించుకుంటారు. తదుపరి ఒక్కొక్కరుగా మరణిస్తారు.
శిక్ష అనంతరం బయటపడిన శకుని దుర్యోధనుని పొగుడుతూ, అతనికి అండగా మంత్రి స్థాయిలో ఉంటూ అతడి దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు. ఇతడే ధర్మరాజుని మాయా జూదంలో ఓడించింది.వనవాసము చేయుచున్న పాండవులను ఏదో విధంగా చంపమని దుర్యోధనునుకి బోధించినది కూడా ఇతడే.
శకుని పాచికల ఆట లేదా చౌసర్ అని పిలిచే ఆటలో నిపుణుడు. శకుని ఒక పాచిక ఆటను ఏర్పాటు చేశాడు. అందులో యుధిష్ఠిరుని రాజ్యాన్ని, అతని సోదరులు-భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు, యుధిష్ఠిర కూడా గెలిచారు. తరువాత ద్రౌపదిని కూడా గెలిపించాడు. దుర్యోధనుని ఆజ్ఞలపై దుశ్శాసనుడు ద్రౌపదిని బట్టలు విప్పడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణుడు ఆమెను రక్షించాడు. ఈ ఆట యుద్ధానికి దారితీసింది.కురుక్షేత్ర సంగ్రామంలో ఇతన్ని నకుల సహదేవులు సంహరించాడు.