శకుంతల . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

శకుంతల .

శకుంతల .
మేనక, విశ్వామిత్రుల సంతానము. దుష్యంతుని భార్య, భరతుని తల్లి.
విశ్వామిత్రుడు వసిష్ఠమహర్షితో వచ్చిన వైరంతో,మాలిని నదీతీరంలో, ఆయనవలే బ్రహ్మర్షి కావాలని తీవ్రనియమాలతో మొదటిమాసం ఆకులనే ఆహారంగా,రొండోమాసం నీటినే ఆహారంగా,అనంతరంగాలినే స్వీకరిస్తూ, తపోదీక్షసాగించాడు. ఇంద్రుడు విశ్వామిత్రుని తపోదీక్షఎలాగైనా, భగ్నపరచాలని మేనకను పిలిచి విశ్వామిత్రుని తపోభంగంకావించమని ఆజ్ఞాపించాడు.'ప్రభూ ఆయనకోపం గురించిమీకుతెలియనిదికాదు.బ్రహ్మర్షి వసిష్టులవారి సంతతినే భస్మంచేసారు.తన తపోశక్తిచే త్రిశంకు స్వర్గం నిర్మింపచేసాడు.తను సుఖస్నానంచేయడానికి కౌశకి నదినే తన ఆశ్రమానికి రప్పించుకున్న తపోధనుడు.అటువంటిమహనీయుని తపోభంగంకలిగించాలి అంటే వాయుదేముడు,మన్మధుడు, సందర్బోచితంగా నాకుసహకరించాలి'అంది మేనక ఆమెకోరిన విధంగా వరుణదేవుని,మన్మధుని ఆమెకు సహకరించమని ఆజ్ఞాపించాడు ఇంద్రుడు.వసంతఋతువు మల్లే,బంతి,చామంతి ,పారిజాత,అశోక, చంపక,మోదుగ పూలు విరియడంతో మాలిని నదీతీరం నందనవనంలా తయారైనది.కోయిలల కుహు కుహు రావాలతో,పూలలోని తేనకై తుమ్మెదల ఝుంకారాలు ,మలయమారుత శీతలపవనాలను వీచసాగాడు వరుణుడు. అదేఅదనుగా తను నయనమనోహరంగా సుమధురగానంతో నృత్యంచేయసాగింది మేనక.ఏకాగ్రత చెదరి కన్నులు తెరచి ఆమెనృత్య గానానికి పరవసించి మైమరచి పోయాడు విశ్వామిత్రుడు అదేసమయంలో మన్మధుడు తన చెరకుగడ విల్లునుగా చేసుకుని తన అయిదు బాణాలు.అరవిందం, అశోకం,ఆమ్రమంజరి, నవమల్లిక,నీలోత్పలం లను విశ్వామిత్రునిపై ద్రవణ,శోషణ,తాపన, మోహన,ఉన్మాద,విలాసాలకు లోనయ్యేలా ప్రయోగించాడు మన్మధుడు. ఆబాణాలశక్తికి లోనైనవిశ్వామిత్రునికంటికి మేనక భువనైక సుందరిలా కనిపించింది.మోహంతో ఆమెను కౌగిలించుకున్నాడు. కాలంగడచిపోతుంది. మేనకకు ఆడపిల్లజన్మించింది.అప్పటికి తెలిసింది తనతప్పు విశ్వామిత్రునికి.మేనకనువిడిచి ఉత్తరదిశగా బయలుదేరి వెళ్లిపోయాడు.ఆశిశువును మాలినినదీతీరాన చెట్టుకింద వదలి దేవలోకం వెళ్లిపోయింది మేనక.శకుంతలములచే పోషించబడిన ఆశిశువు 'శకుంతల'గాపిలవబడింది.ఆదారిన వెళుతున్న కణ్వమహర్షి తనఆశ్రమానికి తెచ్చి పెంచాడు
దుష్యంతుడు ఒక రోజున జింకను వేటాడుతూ, కణ్వ మహర్షి ఆశ్రమము వైపు వస్తాడు. అక్కడ శకుంతలను చూసి మోహితుడై పరిచయం అడుగుతాడు. శకుంతల తన తండ్రి తనకు చెప్పిన జన్మ వృత్తాంతం చెబుతుంది. అప్పుడు దుష్యంతుడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకొని గర్భ దానం చేస్తాడు. తన రాజ్యానికి వెళ్ళి సకల సంభారాలతో, రాచ మర్యాదలతో తాను ఆహ్వానిస్తానని చెప్పి వెళ్లిన దుష్యంతుడు ఎంతకూ రాడు. శకుంతల గర్భవతి అన్న విషయం కణ్వ మహర్షికి తెలుస్తుంది. కణ్వ మహర్షి దివ్యదృష్టితో జరిగినది తెలుసుకొని శకుంతల భరతుడిని ప్రసవించాక, ఆమెకు కొందరు ఋషులను తోడిచ్చి, హస్తినాపురానికి, దుష్యంతుని వద్దకు, భరతునితో సహా పంపిస్తాడు. శకుంతలను దుష్యంతుడు గుర్తించడు. భరతుడిని తన కొడుకుగా అంగీకరించడు. కాని తరువాత ఆకాశవాణి పలికిన మాటలు విని జరిగిన వృత్తాంతం గుర్తుకు తెచ్చుకొని, శకుంతలను తన భార్య గాను, భరతుని తన కుమారుడిగాను అంగీకరిస్తాడు.
దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళి సకల సంభారాలతో రాచ మర్యాదలతో తాను ఆహ్వానిస్తానని చెప్పి అభిజ్ఞాతము (గుర్తు) గా తన అంగుళీయకాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. రాజ్యానికి వెళ్ళిన దుష్యంతుని నుండి ఎప్పటికీ ఆహ్వానం రాదు. ఆమె ఎప్పటికీ దుష్యంతుడి తలచుకొంటూ ఆలోచిస్తూ ఉంటుంది.
ఇలా ఉండగా ఒకరోజున దూర్వాసుడు కణ్వమహర్షి ఆశ్రమానికి వస్తాడు. శకుంతలను దూర్వాసుడికి సపర్యలు చేయడానికి నియోగిస్తారు. కాని శకుంతల దుష్యంతుడిపై తలపుతో ఎప్పుడూ పరధ్యానముగా ఉంటుంది. అది చూసిన దూర్వాసుడు కోపించి, ఎవరి గురించి ఆలోచిస్తున్నావో వారు నిన్ను మరుస్తారు అని శపిస్తాడు. అప్పుడు శకుంతల ప్రార్థించగా, నిన్ను మరిచినవారు నీకిచ్చిన గుర్తును చూస్తే నిన్ను గుర్తిస్తారు అని శాపవిమోచనం చెబుతాడు. ఇలా శాపగ్రస్తురాలైన శకుంతల ఒకరోజు నది దాటుతూ తన చేతిని నీళ్ళలో పెడుతుంది. అప్పుడు దుష్యంతుడు ఆమెకు ఇచ్చిన అంగుళీయకం నీళ్ళలో పడిపోతుంది. శకుంతల ఇది గమనించదు. మరి కొన్నాళ్లకు భరతుడిని ప్రసవిస్తుంది.
కణ్వ మహర్షి తన దివ్యదృష్టితో జరిగినదంతా గ్రహిస్తాడు. శకుంతలను కుమారునితో సహా దుష్యంతుని వద్దకు, తన శిష్యులను తోడు ఇచ్చి పంపిస్తాడు. శాప ప్రభావము వలన, దుష్యంతుడు శకుంతలను గుర్తించడు. గుర్తు చూపుదామని, వేలి ఉంగరం కోసం చూస్తే, అది కనిపించదు. అప్పుడు శకుంతల అసత్యమాడుతోందని దుష్యంతుడు భావిస్తాడు. శకుంతల వేలినుంచి జారి, నదిలో పడిన ఉంగరాన్ని ఒక చేప మింగుతుంది. ఆ చేప ఒక జాలరి వలలో చిక్కుతుంది. జాలరి ఆ చేపను కోయగా దానికడుపులో నుంచి ఉంగరం బయటకు వస్తుంది. జాలరి తన అదృష్టానికి సంతసించి, ఆ ఉంగరాన్ని అమ్ముదామని వర్తకునికి చూపుతాడు. ఆ ఉంగరం రాజాంగుళీయకమని గ్రహించిన వర్తకుడు, జాలరిని దొంగగా భావించి రాజభటులకు అప్పచెబుతాడు. జాలరిని రాజభటులు రాజ సముఖానికి, శిక్షించేనిమిత్తం తీసుకొని వెడతారు. రాజు ఆ ఉంగరాన్ని చూసి, జరిగిన వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చుకొని, దూర్వాస శాపఫలితంగా ఇది జరిగిందని తెలుసుకొని, శకుంతలను, భరతుని ఆదరిస్తాడు.

 

మరిన్ని వ్యాసాలు

బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మీకు తెలియని నాటి నట,గాయని
మీకు తెలియని నాటి నట,గాయని
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
తెలుగు సినీ కృష్ణుడు రఘరామయ్య.
తెలుగు సినీ కృష్ణుడు రఘరామయ్య.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గాయని రమోలా.
గాయని రమోలా.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Paata
పాట
- M chitti venkata subba Rao