యన్ సి సి యఫ్ వారి సౌజన్యంతో కార్టూన్ ప్రదర్శన మరియు కార్టూన్ శిక్షణా శిబిరం. - LAL

యన్ సి సి యఫ్ వారి సౌజన్యంతో కార్టూన్ ప్రదర్శన మరియు కార

యన్ సి సి యఫ్ వారి సౌజన్యంతో కార్టూన్ ప్రదర్శన మరియు కార్టూన్ శిక్షణా శిబిరం.
***
ఈ రోజు 18-5-2022 బుధవారం నాడు విశాఖపట్నం బాల వికాస ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 16-5-2022 నుండి గత మూడు రోజులుగా జరుగుతున్న కార్టూన్ శిక్షణ శిబిరం జయప్రదంగా ముగిసినది. విశాఖపట్నం ఏ యస్ రాజా మహిళాజూనియర్ కళాశాల ప్రాంగణంలో 16-5-2022 నుంచి జరుగుతున్న ఉచిత సమ్మర్ కేంపు లో భాగంగా తొలి మూడురోజులు యన్ సి సి యఫ్ ( నార్త్ కోస్టల్ ఆంధ్రా కార్టూనిస్ట్స్ ఫోరమ్ ) , విశాఖపట్నం వారు పాల్గొని ఈ కేంపుకి హాజరయిన విద్యార్ధినీ విద్యార్ధులకు కార్టూన్లు ఎలాగీయాలో సీనియర్ కార్టూనిస్టులు శ్రీ పి రామశర్మగారు, శ్రీ టి ఆర్ బాబుగారు, శ్రీ వందన శ్రీనివాస్ గారు మరియు శ్రీ లాల్ (సదాశివుని లక్ష్మణరావు ) గార్లు శిక్షణనిచ్చారు. బ్లాక్ బోర్డు పై బొమ్మలెలా గీయాలో తెలిపారు.పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరిరోజు 18-5-2022 నాడు యన్ సి సి యఫ్ తరఫున విద్యార్ధులందరికీ శ్రీ గుత్తులశ్రీనివాసరావుగారు వేసిన ఒక చక్కని కార్టూను ని ఇచ్చి దాని నమూనా గీయమని నలభైనిమిషాల సమయం ఇచ్చి పోటీపెట్టారు.వివిధతరగతులకు చెందిన 24 మంది ఉత్సాహంగా పాల్గొని బొమ్మను గీశారు. యూకేజి,ఒకటో తరగతి, రెండోతరగతి, ఎనిమిదో తరగతి నుంచి ఒక్కరుచొప్పున, 4,6,9,10 తరగతులనుంచి ఇద్దరు చొప్పున, 5 తరగతినుంచి ముగ్గురు,3 తరగతినుంచి నలుగురు మరియు 7 తరగతినుంచి ఐదుగురు పాల్గొన్నారు. వీరిలో స్నేహితశ్రీ, దక్షిత్ , లోకేష్ ,లాస్య,యోగితసంజన,లలీషణ, ఆర్యన్ , సాహిత్ ,చరణ్ , ప్రియహాసిని మరియులక్ష్మీచరణ్య లు చాలా బాగా వేశారు.

బాల వికాస ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యం గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో కార్యదర్శి శ్రీ నరవ ప్రకాశరావు గారు పాల్గొని ప్రసంగించారు.బాలలు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని అందుకు ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేశామని అన్నారు. సుమారు 40 మంది పిల్లలు పాల్గొన్నారు.కార్టూన్ వర్క్ షాప్ లో బొమ్మలు ఎలాగీయా లోకార్టూనిస్టులూ శ్రీ టి.అర్.బాబు గారు, శ్రీ శర్మగారు, శ్రీ సదాశివునిలక్ష్మణ రావు(లాల్ )గారు మరియు శ్రీ వందన శ్రీనివాసరావు గార్లు నేర్పారు. ఈ సమావేశం లో జూనియర్ కాలేజి ప్రిన్సిపల్ శ్రీ సాంబశివరావుగారు, .డాక్టర్ బాబ్జీగారు, శ్రీ చిన్నారావు గారు తదితరులు పాల్గొన్నారు.
బాలలు గీసిన చిత్రాలు ప్రదర్శించారు. అలాగే యన్ సి సి యఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలలనుంచి కార్టూనిస్టులు వేసిన కొత్తకార్టూన్లను ప్రదర్శించారు..బాలలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్టూన్లను తిలకించారు..

శ్రీ నరవ ప్రకాశరావుగారు యన్ సి సి యఫ్ సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు.

లాల్
వైజాగు

మరిన్ని వ్యాసాలు

కళల ఆవిర్భావం .
కళల ఆవిర్భావం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
లంబాడి సంస్కృతి .
లంబాడి సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
గిరిజన నృత్యాలు .
గిరిజన నృత్యాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం ఒగ్గు కథ.
కళారూపం ఒగ్గు కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
యోగాలు .
యోగాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం తోలుబొమ్మలాట .
కళారూపం తోలుబొమ్మలాట .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కురుక్షేత్ర సంగ్రామం.
కురుక్షేత్ర సంగ్రామం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.