భువనేశ్వర్ లో ఘనంగా జరిగిన ప్రపంచ కార్టూనిస్ట్స్ దినోత్సవవేడుకలు - LAL

భువనేశ్వర్ లో ఘనంగా జరిగిన ప్రపంచ కార్టూనిస్ట్స్ దినోత

భువనేశ్వర్ లో ఘనంగా జరిగిన ప్రపంచ కార్టూనిస్ట్స్ దినోత్సవవేడుకలు
***
6-5-2022 మరియు 7-5-2022 తేదీలలో ఒడిషా రాజధాని భువనేశ్వర్ పట్టణంలో ఒడిషా కార్టూనిస్ట్స్ అకాడెమీ వారి ఆధ్వర్యంలో ప్రపంచ కార్టూనిస్టు దినోత్సవం ఘనంగా నిర్వహించారు.నిర్వాహకులు శ్రీ కే.కే.రథ్ (శ్రీ కమలా కాంత రథ్ కార్టూనిస్టు) గారి బృందం చక్కగా ఏర్పాట్లుచేశారు.మొత్తం 27 మంది కార్టూనిస్టుల కార్టూన్లను ప్రదర్శనలో ఉంచారు. అందులో ఒడిషాలో నివసిస్తూ తెలుగుమూలాలున్న కార్టూనిస్టులు శ్రీ ఆరిశెట్టి సుధాకర్ గారు, శ్రీ శేఖర్ బాబుగారు మరియు శ్రీ నందీష్ గార్లవి పదేసి కార్టూన్లు చొప్పున ప్రదర్శనలో ఉంచారు. శ్రీ సుధాకర్ గారి ఫోటోను, కార్టూను ను ఎంట్రన్సులో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ లో కూడా ముద్రించారు. అలాగే శ్రీ సుధాకర్ గారిని, వారి సతీమణిని వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు. శ్రీ సుధాకర్ గారిని కార్యవర్గ సభ్యునిగా నియమించినట్టు తెలిపారు.

కార్యక్రమంలో హాజరయిన కార్టూనిస్టులందరినీ ఘనంగా సన్మానించారు. స్థానిక ఆర్ట్స్ కాలేజి విద్యార్ధులతో ఇంటరాక్షన్ కూడా చాలా బాగా జరిగింది. రెండురోజుల కార్టూన్ల ప్రదర్శనను స్థానికప్రజలు చాలామంది తిలకించి బాగుందని మెచ్చుకున్నారు. దినపత్రికలలో,టీవీ న్యూస్ ఛానెల్స్ లో చక్కని కవరేజి వచ్చింది.

నేను ఆ రెండురోజులు భువనేశ్వర్ లోనే ఉండడం జరిగింది. కానీ వెళ్ళడానికి అసలు సమయం కుదరలేదు. లేకపోతే వెళ్ళిఅభినందనలు చెప్పి వచ్చేవాడిని.

శ్రీ శేఖర్ బాబుగారికి, శ్రీ నందీష్ గారికి మరియు శ్రీ సుధాకర్ గారికి మన తెలుగు కార్టూనిస్టుల తరఫున అభినందనలు.

లాల్
వైజాగు