సాలిగ్రామాలకు ఆవాసము - ambadipudi syamasundar rao

సాలిగ్రామాలకు ఆవాసము

సాక్షాత్తు శ్రీ మహా విష్ణు చిహ్నం గల శిలలనే సాలిగ్రామాలు అంటారు అటువంటి సాలిగ్రామాలు లెక్కకు మించినన్ని పుట్టెవి నేపాల్ లో గండకీ నది లోనే ఆ నదిలో తప్ప మరెక్కడా సాలిగ్రామాలు లభ్యం కావు గండకీ నది జన్మ వృత్తాంతము, సాలిగ్రామం ఎలా పుట్టిందో తెలుసుకుందాము.

గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే|

సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:||

శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:|

గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:

 

శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:||

గండకీ నదిలో ఈ సాలిగ్రామాలు చిన్నగా పెద్దగా రకరకాల పరిమాణాల్లో ఉంటాయి సాలగ్రామము విష్ణుప్రతీకమైన, విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది ఈ సాలిగ్రామాలు గుండ్రటి రాళ్ళలా ఉన్నా తాబేలు నోరు తెరుచుకున్నట్లు ఉంది లోపల శ్రీ మహా విష్ణువే శేష సాయి గా ఉంది దర్శనమిస్తాడు అందుచేత విష్ణు భక్తులు సాలిగ్రామాన్ని పూజిస్తే సాక్షాత్తు విష్ణు నే పూజిస్తున్నట్లు భావిస్తారు. ఇంత పవిత్రమైన సాలిగ్రామాలు లభ్యమయి గండకీ నది ఆ నదిలోనే ఈ సాలిగ్రామాలు పుట్టడానికి వెనుక ఒక కథ నేపాల్ లో ప్రచారము లో ఉంది ఆ కథను కథను తెలుసుకుందాము.,

నేపాల్ లోని శ్రావస్తి నగరములో గండకీ అనే పేరుతొ అందాల వేశ్య ఉండేది ఆమె అందమైనది అవటం వల్ల చాలా మంది ధనికులు ఆమె అనుగ్రహం కోసము అంటే పొందు కోసం పరితపిస్తూ ఉండేవారు కానీ గండకీ కొన్ని నియమాలు పెట్టుకొని వేశ్యా వృత్తి చేసేది ఆ నియమము ఏమిటి అంటే ప్రతి రోజు ఎవరు ముందు వస్తే వారిని అంగీకరించేది ఆ రోజుకి అతనినే భర్తగా భావించేది రెండో మనిషి ఎంత ధనము ఇస్తానన్నా ఎంత ఆశ చూపినా రెండో బేరానికి ఒప్పుకునేది కాదు గండకీ తల్లి గండకిని మార్చాలని విశ్వ ప్రయత్నమూ చేసెది దీపము ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి యవ్వనములో ఉండగానే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలి తల్లి నిత్యం గండకీ కి హిత బోధ చేసి మార్చాలని ప్రయత్నాలు చేసేది కానీ గండకీ మాత్రం తానూ పెట్టుకున్న నియమాన్ని అతిక్రమించేది కాదు

ఇలా కొన్నాళ్ళు సాగుతుండగా సాక్షాత్తు నారాయణుడికే గండకీని పరీక్షించాలన్న కోరిక కలిగింది. ఒక రోజు ఉదయాన్నే ఒక ధనవంతుడు తన పరివారము కానుకలతో గండకీ దగ్గరకు వచ్చి బేరం కుదుర్చుకొని భారీగా కానుకలు ఇచ్చాడు గండకీ అలవాటుగా ఆ వచ్చిన ధనవంతుడికి స్నానము చేయించటానికి దుస్తులు తీస్తే ఒళ్ళంతా పుండ్లు అంటే ఆ వచ్చిన ధనవంతుడు కుష్టు వ్యాధి గ్రస్తుడు విషయం తెలుసుకున్న గండకీ తల్లి అ ధనవంతుడిని తరిమేయాలని చూసింది కానీ గండకీ తల్లి ప్రయత్నాలను నివారించి ఆ వచ్చిన ధనవంతుడిని అసహ్యించుకోకుండా అతని వంటికి సంపెంగ నూనె ను పూసి చక్కగా చాలా జాగ్రత్తగా గోరు వెచ్చని నీటితో స్నానం చేయించింది చక్కటి వాస్తవాలు ధరింపజేసి రుచికరమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేసింది కానీ ఆ ధనవంతుడి వేళ్ళు కుష్టు వ్యాధి వలన సక్రమముగా లేకపోతె తానె తినిపించింది. ఆతనికి తినిపించినాక అదే కంచములో మిగిలిన ఆహారాన్ని తానూ తిన్నది ఆహారము తిన్నాక అతనిని పక్క మీదకు చేర్చి విసురుతూ సపర్యలు చేసింది

ఆ ధనవంతుడు ఆ రాత్రి తీవ్రమైన జ్వరముతో బాధపడుతూ ప్రాణాలు వదిలాడు గండకీ ఆ నాటి ఆచార వ్యవహారాల ప్రకారము ఆ నాడు వచ్చిన ధనవంతుడిని భర్తగా భావించి సపర్యలు చేసింది కాబట్టి సహగమనానికి పూనుకుంది తల్లి, ఇతరులు వద్దని వారించినా బ్రతిమాలిన గండకీ తన ప్రయత్నాన్ని విసరమించుకోలేదు. తన ఆస్తిని బీద సాదలకు పంచి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాళాలతో వెళ్ళింది. స్మశానంలో చితి పేర్చి తానె చితికి నిప్పంటించి తానూ కూడా చితిలో దూకింది. చూస్తున్న ప్రజలందరికి సంభ్రమాశ్చర్యాలు కలుగజేసే విధముగా ఎగసిపడే మంటలు మల్లెలయ్యాయి కాలుతున్న కట్టెలు పూలు అయ్యాయి లక్ష్మి సమేతంగా విష్ణు మూర్తి ప్రత్యక్షమయ్యాడు

విష్ణుమూర్తిని చుసిన గండకీ ముగ్దురాలైయింది చేతులు జోడించి కన్నీళ్లతో విష్ణుమూర్తి కాళ్ళు కడిగి కీర్తించింది స్వచ్ఛమైన మనసును, శరీరాన్ని భగవంతుని పట్ల నిలిపింది. గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చలించిపోయాడు. నిష్టకు ఇష్టపడ్డాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి డబ్బూ ధనం కోరలేదు. మోక్షమూ కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది. మహా విష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఫలితమే.మరు జన్మలో గండకీ నదిగా పుట్టింది. నది కడుపులో సాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందు కున్నాడు. గండకి ఏ కులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు. పవిత్రముగా ఉన్నది కాబట్టి విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకొని తల్లయింది. కృతయుగాన జరిగినా ఈ యుగానికీ గండకీ కథ నిలిచిపోయింది!.ఆ నదిలో లభ్యమయ్యే సాలిగ్రామాలు నేటికీ పూజలందుకుంటున్నాయి