పంచతంత్రం - ధర్మబుద్ధి - పాపబుద్ధి - రవిశంకర్ అవధానం

Panchatantram - dharma budhi - papa budhi

పంచతంత్ర కథలు కేవలం పాతబడిపోయిన నీతి బోధలు కాదు, అవి మన జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే పరిస్థితులకు అద్దం పడతాయి. దాదాపు 3000 సంవత్సరాల క్రితం రాసినా, ఈ కథల్లోని పాత్రలు, సన్నివేశాలు నేటి కార్పొరేట్ ప్రపంచంలో, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా తారసపడుతుంటాయి. ఈరోజు మనం ఒక కథ ద్వారా నిజాయితీ, తెలివి, మరియు మోసం ఎంత వరకు నిలబడతాయో తెలుసుకుందాం.

ఒకానొక గ్రామంలో ధర్మబుద్ధి, పాపబుద్ధి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. పేరుకి స్నేహితులే కానీ, ఒకరిది నిజాయితీ అయిన స్వభావం, మరొకరిది దుష్టబుద్ధి. ఒకరోజు వారు ధనం సంపాదించడం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ధర్మబుద్ధి తన కష్టంతో, నిజాయితీతో ధనం సంపాదించాడు. పాపబుద్ధి మోసం చేసి ధనం సంపాదించాడు. తిరిగి వచ్చేటప్పుడు, వారు తమ సంపాదించిన ధనాన్ని ఒక చెట్టు మొదలులో దాచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ధర్మబుద్ధి అంగీకరించాడు. ధనం దాచిన తర్వాత, వారు తమ గ్రామానికి తిరిగి వచ్చారు.

కొంతకాలానికి, పాపబుద్ధి మనసులో దురాశ పుట్టింది. ధనం మొత్తం తనే తీసుకోవాలని పన్నాగం పన్నాడు.అతను ఒక్కడే చెట్టు దగ్గరకు వెళ్లి, ఆ ధనాన్ని తీసుకుని, ఆ స్థలాన్ని మళ్ళీ పాతలాగే మూసివేసాడు. మరుసటి రోజు, ధర్మబుద్ధి దగ్గరకు వెళ్లి, "మిత్రమా, మన ధనాన్ని తీసుకుందాం. నాకు కొంచెం అవసరం వచ్చింది" అని చెప్పాడు. ఇద్దరూ కలిసి చెట్టు దగ్గరకు వెళ్లి చూస్తే, ధనం లేదు.

పాపబుద్ధి వెంటనే నాటకం మొదలుపెట్టి, "ఓహ్! ధనం లేదు! నువ్వే దొంగిలించావు!" అని ధర్మబుద్ధిని నిందించడం ప్రారంభించాడు. ధర్మబుద్ధి షాక్ అయ్యాడు. తన నిందను ధర్మబుద్ధి అంగీకరించలేదు. ఇద్దరూ కలిసి రాజు దగ్గరకు వెళ్ళి న్యాయం చేయమని కోరారు.

రాజు విషయం విచారించడానికి, సాక్ష్యం కోసం చెట్టు దగ్గరకు వెళ్ళాడు. పాపబుద్ధి అప్పటికే ఒక పథకం వేశాడు. చెట్టు తొర్రలో తన తండ్రిని దాచి, రాజు అడిగినప్పుడు ధర్మబుద్ధి దొంగ అని చెప్పమని చెప్పాడు. రాజు చెట్టును ప్రశ్నించగా, తొర్రలోని తండ్రి, "ధర్మబుద్ధి దొంగ!" అని అరిచాడు. రాజు ఆశ్చర్యపోయాడు.

ధర్మబుద్ధి అనుమానంతో, "మహారాజా, సూర్యాస్తమయం తర్వాత అగ్నిదేవుని సమక్షంలో ఈ చెట్టును మళ్ళీ ప్రశ్నిద్దాం" అని కోరాడు. సరేనన్న రాజు, మరుసటి రోజు సాయంత్రం అందరితో కలిసి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అగ్నిహోత్రం ఏర్పాటు చేయబడింది. మంటలు రాజుకోగానే, ధర్మబుద్ధి ఒక పదునైన ఆలోచనతో, "మహారాజా, ఈ చెట్టులో దేవుడున్నాడని అంటారు. ఆ చెట్టు కడుపులో అగ్నిహోత్రం చేసి దేవుణ్ణి బయటకు పిలుద్దాం" అని చెప్పాడు. అగ్ని వల్ల ఉక్కిరిబిక్కిరి అయిన పాపబుద్ధి తండ్రి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చాడు. అసలు నిజం బయటపడింది. రాజు పాపబుద్ధిని, అతని తండ్రిని శిక్షించాడు. ధర్మబుద్ధి తన నిజాయితీని నిరూపించుకున్నాడు.

నీతిశాస్త్రం
ఈ కథలోని నీతి ఏమిటంటే - నిజాయితీ ఎప్పుడూ విజయం సాధిస్తుంది. మోసం తాత్కాలికంగా పనిచేసినా, చివరికి బయటపడుతుంది. తెలివి, ధర్మం శక్తివంతమైన ఆయుధాలు.

కార్పొరేట్ ప్రపంచంలో ఈ నీతి ఎంత ముఖ్యం?

  • నిజాయితీ vs మోసం: ఆఫీసులో కొందరు తమ పనితీరు గురించి, క్రెడిట్ గురించి అబద్ధాలు చెప్తారు. వీరు 'పాపబుద్ధి' లాంటివారు. ఇలాంటి మోసాలు తాత్కాలికంగా పైకి ఎదగడానికి సహాయపడవచ్చు, కానీ చివరికి వారి నిజ స్వరూపం బయటపడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • తెలివిగా వ్యవహరించడం: మనపై ఎవరైనా నిందలు వేసినప్పుడు లేదా మోసం చేయడానికి ప్రయత్నించినప్పుడు, తెలివిగా, ధర్మబద్ధంగా స్పందించడం 'ధర్మబుద్ధి' లాంటిది. ఆధారాలతో సహా నిజం నిరూపించుకోవాలి.
  • ఆఫీస్ పాలిటిక్స్: ఆఫీసులో కొందరు తమ స్వార్థం కోసం ఇతరులను ఇరికించడానికి ప్రయత్నిస్తారు. అలాంటివారి పట్ల జాగ్రత్తగా ఉండి, మన పని మనం నిజాయితీగా చేసుకోవాలి.


వ్యక్తిగత జీవితంలో ఒక ఉదాహరణ:
స్నేహితుల్లోనో, బంధువుల్లోనో ఒకరు మన డబ్బును మోసం చేయాలని చూసినప్పుడు. వారు అబద్ధాలు చెప్పి మనల్ని నిందించవచ్చు. అప్పుడు భయపడకుండా, ధర్మబుద్ధిలాగా ఆధారాలతో, నిజాయితీగా వ్యవహరించి మన హక్కును కాపాడుకోవాలి. కేవలం 'విధి' అని వదిలేయడం మూడవ చేప లాంటిది అవుతుంది (మునుపటి కథలో).

ఆ రోజు ఆ పాపబుద్ధి, చెట్టు తొర్రలో తండ్రిని దాచి, "ధర్మబుద్ధి దొంగ!" అనిపించాలనుకున్నాడు. కానీ పాపం, ధర్మబుద్ధి తెలివికి అగ్నిహోత్రం ముందు అసలు నిజం బయటపడింది. ఈరోజుల్లో ఆఫీసులో కూడా చాలామంది 'పాపబుద్ధి' లాగే ఉంటారు. టీమ్ మెంబర్స్ పనిని తమ క్రెడిట్‌గా చెప్పుకుంటారు. వేరే వాళ్ళ రిపోర్టు కాపీ చేస్తారు. చివరికి ఎక్కడో ఒకచోట ఏదో ఒక 'అగ్నిహోత్రం' ముందు (ఉదాహరణకు, పెర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్, ఆడిట్) వారి 'తండ్రి' లాంటి అబద్ధం బయటపడిపోతుంది కాబట్టి, ఆఫీసులో అయినా, జీవితంలో అయినా... 'ధర్మబుద్ధి' లాగా నిజాయితీగా ఉందాం. 'పాపబుద్ధి' లాగా మోసం చేస్తే... గ్నిహోత్రం ఎదురు చూడాల్సి వస్తుందేమో !

మరిన్ని వ్యాసాలు

Social media lo nakilee profile patla apramattata
సోషల్ మీడియాలో అప్రమత్తత
- సి.హెచ్.ప్రతాప్
సాలార్ జంగ్ మ్యుజియం.
సాలార్ జంగ్ మ్యుజియం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చార్మినార్ .
చార్మినార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Cripto currancy
క్రిప్టోకరెన్సీ
- సి.హెచ్.ప్రతాప్
అక్షౌహిణి అంటే ???.
అక్షౌహిణి అంటే ???.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు