సినీ గీతాల రచయిత్రులు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Cine geethala rachayitrulu

తెలుగు సినీ గీతాల రచయిత్రులు.

తొలిరోజుల్లో బాగా ప్రాచుర్యం పొందిన పౌరాణిక నాటకాలను, ఆ నాటక ఫక్కీ చెడకుండా అలాగే యధాతథంగా చలనచిత్రాలుగా తీయడంతో, రంగస్థలం మీద బాగా పాడగలిగినవాళ్ళే నటీనటులుగా తెరమీద కూడా కనిపించి, తమ పద్యాల్నీ పాటల్నీ తామే పాడుకునేవారు. ఏది ఏమైనప్పటికీ ఆనాటి పాటల్లో నాటకాల బాణీ మాత్రం బాగా ఉండేది. రంగస్థలంతో సంబంధమున్నకవులే సినిమాలకూ పాటలు వ్రాసేవాళ్ళు. ఆ విధంగా ఆనాడు నాటకకవులుగా ఉన్న చందాల కేశవదాసు, పాపట్ల కాంతయ్య, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, దైతా గోపాలం వంటి కవులు తొలినాటి సినిమాపాటలకు సృష్టికల్పన చేశారు. ఆ తరువాత ఎంతోమంది తెలుగు సినిమా పాటల రచయితలు పాటలు రాశారు.

సినిమాలకు పాటల రచన చేసే రచయిత్రుల సంఖ్య మనకు చాలా తక్కువ. 1932లో తెలుగు సినిమా పుడితే 1966 వరకూ ఒక్క మహిళా రచయిత్రి కూడా రాలేదు. అయితే కొంతమంది రచయిత్రులు కూడా తెలుగు సినిమాలకు పాటలు రాశారు.

పాటల రచయిత్రుల జాబి కె.జి. వసంతాదేవి - 'దారి కాచి వేచినానురా...రేయిబవలు చూచినానురా' (విజయశంఖం (1966)). లభించిన ఆధారాల ప్రకారం వసంతాదేవినే మన తొలి తెలుగు పాటల రచయిత్రని తెలుస్తుంది. వీరమాచనేని సరోజిని - 'ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఊగాలి ఊగాలి' (చిన్నారి పాపలు - 1968) సుప్రసిద్ధ సినీనటి సావిత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వీరమాచనేని సరోజిని నిర్మించారు. నిర్మాత, దర్శకులు, నటీనటులు, నేపథ్యగాయకులు, సాంకేతిక సిబ్బంది అంతా మహిళలే నిర్వహించడం ఈ సినిమా గొప్పతనం. ఈ సినిమా గిన్నిస్ రికార్డ్స్ లోకి చేరింది. సరోజిని, సుప్రసిద్ధ దర్శకుడు వి. మధుసూదనరావు భార్య. మంచి గాయకురాలు. కామ్రెడ్ విజయలక్ష్మీ - 'కులం కులమని కుచ్చితాలు పెంచుకోకు' విప్లవ శంఖం (1982) జ్యోతిర్మయి - 'చేతికి గాజుల్లా...' (రాధాకళ్యాణం (1981)). 'లేత చలిగాలులు దోచుకోరాదురా' (మూడు ముళ్ళు (1987)) డా. సీతాదేవి - మా తెలుగుతల్లి (1988) రాణి పులోమజాదేవి - బుల్లెబ్బాయ్ (2007), ఐస్ క్రీం, జెంటిల్ మేన్ రమాదేవి - 'పోకిరి రాజా...' మాయ (సినిమా) (2014) కిరణ్మయి - మిస్సింగ్ (2013) కొండముది అనురాధ - నాచూపు (పవన్ సుబ్బలక్ష్మీ ప్రేమించుకున్నారట) పి. సూర్యకుమారి - డా. చల్లా భాగ్యలక్ష్మి - ఒక్కడొచ్చాడు (2016), అమ‌రావ‌తి అమ్మాయి (2017), పెళ్లి రోజు (2017), శ్రేష్ట - ఒక రొమాంటిక్ క్రైమ్ కథ (2013), 'ఓ మధురిమవై', 'బంగారు కొండ' (కో అంటే కోటి), పెళ్లిచూపులు 2016, అర్జున్‌రెడ్డి (2017), యుద్ధం శరణం (2017) చైతన్య పింగళి - 'ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు' (ఫిదా 2017)

 

 

సేకరణ.

 

మరిన్ని వ్యాసాలు