దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

న్యూయార్క్ లోని వెల్స్ ఫోర్గొ బేంకులో దొంగతనం చేసాక ఆ దొంగ పారొపోవడానికి తన కారు దగ్గరకి వచ్చి జేబులు వెదుక్కుంటే కారు తాళం చెవులు కనిపించలేదు. దాంతో పరిగెత్తిపారిపోయాడు. ఆ తళం చెవులు కనిపించలేదు.  ఆ తాళం చెవులు కారులోనే వుంచి పొరపాట్న తీసుకోకుండా తలుపు వేయడంతో, కారు తలుపు లాక్ అయిపోయిందని పోలీసులు వచ్చాక బయటపడింది. ఆ కారు ఆధారంగా పోలీసులు దొంగని అరెస్ట్ చేసారు.

 

 


మిన్నెసొటాలోని నార్త్ ఫీల్డ్ అనే ఊళ్ళోని ఓ దొంగ బేంకులో దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. పోలీసులు వచ్చారు కానీ దొంగ ఆచూకీ తెలీలేదు. బేంక్ కేషియర్ కి తన కౌంటర్ లో ఓ కారు తాళం చెవి దొరికింది. అది కస్టమర్దయితే తిరిగి రావాలిగా? పోలీసులకిస్తే వారు బయటకి వెళ్ళి చూస్తే ఓ కారుకి తాళం చెవి పట్టింది. దొంగ తాళం చెవిని మరచి, కారు వదిలి వెళ్ళి ఉంటాడని పోలీసులు అనుమానించారు. వారి అనుమానం నిజమై ఆ దొంగ పోలీసులకి పట్టుబడ్డాడు.