నాట్య భారతీయం - కోసూరి ఉమాభారతి

‘మతమేదైనా, కులమేదైనా- మనిషి పీల్చే గాలి, తాగే నీరు, నడయాడే  పుడమి ఒకటే  కాదా?వాటికి తేడాలేమీ లేవే?’

‘ఎన్నో మతాలు, సంస్కృతులు ఉన్న ప్రపంచంలో, ఇతరుల పట్ల - సహనం వహించడం,  గౌరవం పాటించడం ముఖ్యం’ అన్నారునాన్న...


నాన్నకి,TERRITORIAL ARMY  మేజర్ గా హైదరాబాదు నుండి మద్రాస్ ట్రాన్స్ఫర్ అయింది.

సమ్మర్ హాలిడేస్  అయ్యాక,  నాన్న చేయి  పట్టుకొని  స్కూల్లో  అడుగు పెట్టాను. “హోలీ ఏంజల్స్” కాన్వెంట్కాంపౌండ్  చాలా పెద్దది.  గేటు నుంచి ప్రిన్సిపాల్ ఆఫీస్ కి కొంత దూరం నడవాలి.  లెఫ్ట్ లో పార్క్, దాటాక కిండర్గార్టెన్,  తరవాత పార్లర్,  పక్కన ఆఫీసు.

నాన్న ప్రిన్సిపాల్ తో మాట్లాడి పేపర్స్ మీద సైన్ చేసి నన్ను సెకెండ్ స్టాండర్డ్లో అడ్మిట్ చేసారు.

నాకు నర్వస్ గా,  ఆత్రుతగా ఉంది. మరునాటి నుండి స్కూల్.

మొదటి నాలుగు రోజులు నాన్న లోపల వరకు దిగబెట్టారు.  స్కూల్  లోపల  కిక్కిరిసినట్టు జనం. అందరూ మా వంకే చూసేవారు.  నాకు  తెలుసు.  మా నాన్న మిలటరీ యూనిఫారంలో ఉన్నందుకే  అని.  నాన్నతో నడవాలంటే చాలా గర్వంగా, భయం లేకుండా, గొప్పగా అనిపించేది నాకు.

ప్రతి రోజు స్కూల్లో చర్చ్, మ్యూజిక్ క్లాస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అవర్  చాలా నచ్చాయి నాకు. అన్ని సబ్జెక్ట్స్ లో మంచి మార్కులే వచ్చేవి.  మారల్  సైన్స్, గేమ్స్ లో ‘ఎక్సలెంట్ ‘ అనే రిమార్క్ తో.

ఆటల్లో ఈజీగా గెలవగలనని, మా  టీచర్లని అచ్చంగాఇమిటేట్  చేయగలనని  కొత్తగా, నా గురించి నేను తెలుసుకున్నాను.స్కూల్లో మా మ్యూజిక్ క్లాస్  అంటే నాకు స్పెషల్ గా చాలా ఇష్టమయింది.

మా మ్యూజిక్  టీచర్  అమెరికన్  లేడీ.  పేరు  మిస్. లిండా మాథ్యూ.  ఇంగ్లీష్  భాషలో  పాటలు, కొత్త పద్దతిలో  నేర్పేది  మాకు.

స్కూలుకి వెళ్ళే లోగా అమ్మతో పాటు దేవుడికి దణ్ణం పెట్టుకునేదాన్ని... అమ్మ రోజూ చదివే లక్ష్మీ అష్టకం కూడా వినేదాన్ని. అలాగే, ప్రతి రోజూ స్కూల్లో,  తప్పనిసరిగా,  క్లాసుల వారీగాchapelకి వెళ్ళేవాళ్ళం.   దేనికీ అర్ధం తెలియక పోయినా అందరితో పాటు, ప్రేయర్స్ చెప్పి, holy water కూడా ‘sip’ చేసేదాన్ని......

అలాగే lunchకి ముందు, నా ఎదురుగా కూర్చున్న ఫ్రెండ్స్ కొందరు prayers చెబుతుంటే, వాళ్ళతో పాటు క్షణం సేపు కళ్ళు మూసుకునేదాన్ని.

Moral Scienceక్లాసులో,లీనా జోసెఫ్ అనే ఓ స్టూడెంట్ వచ్చి నా పక్కనే కూర్చుంది. 

‘హలో’ అంది.

క్లాస్ మొదలవ్వడానికి  ఐదు నిముషాలుంది.

నాన్న నాకు ప్రతేకంగా  ఇచ్చిన  గణపతి బొమ్మ pencil box నా  డెస్క్ మీద ఉంది. 

who is this?” అంది గణపతి బొమ్మని చూస్తూ లీనా.

Lord Ganapathi,”  అన్నాను.

how stupid?  I hate your Gods.  How can he have elephant face and four hands?So funny,”  అంటూనే పోయింది.నేను గట్టిగానే ఎదురు చెప్పాను.  “how can you talk like this?  He is our God,” అన్నాను.

షాక్ అయిపోయాను.  కళ్ళవెంట నీళ్ళు వచ్చాయి.  అప్పుడే  క్లాస్ రూం లో అడుగు పెట్టిన మా మేడమ్ కి చెప్పాను.

ఆవిడ కూడా ఆశ్చర్య పోయింది.  మమ్మల్నిద్దర్నీ   క్లాస్ బయటికి తీసుకువెళ్ళి,  నచ్చజెప్పి,  వార్నింగ్ కూడా ఇచ్చింది...“చూడు లీనా, నీవిలా బిహేవ్ చేసి ఇతరులని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుంటే, మతపెద్ద (religious preacher) అయిన మీ ఫాదర్ కి చెడ్డ పేరు వస్తుంది.  నీవు, ఉమా కి అపాలజీ చెప్పవలసిన అవసరం ఉంది.  మీ పేరెంట్స్ కి కూడా స్కూల్ నుండి నోట్ వెళుతుంది,” అని హెచ్చరించింది మేడమ్.మొదటి సారి ఇటువంటి సంగతి ఎదురవ్వడం.   చాలా బాధ పడ్డాను.   అమ్మకి, నాన్నకి చెప్పాను.  అప్పటి నుంచే  నాకు  ఇతర  మతాల (religions)  గురించి  తెలుసుకోవాలనే  ఆసక్తి  పెరిగింది.

“లీనా జోసెఫ్ లాంటి వాళ్ళతో అనవసరంగా వాదనలు పెట్టుకోకు.  వీలయినంత మటుకు నీ పని నువ్వు చూసుకో.  అలాంటి వాళ్ళతో టైం వేస్ట్ చేసుకోకు,” అంది అమ్మ.

“ఎన్నో మతాలు, సంస్కృతులు ఉన్నాయి ప్రపంచంలో.  ఎవరు  ఏది పాటించినా, ఇతరుల భావాలని గౌరవించడం నేర్చుకోవాలి...” అని వివరించారు నాన్న.

నేను చదువుకున్నది  St.  Joseph’s - Guntur, Holy Angels –Madras, St. Francis College for Women – Hyderabad…..స్కూల్స్  లో ఎప్పుడూ చర్చ్ కి వెళ్ళేదాన్ని... అన్ని విషయాలు అడిగి తెలుసుకునేదాన్ని.   సికంద్రాబాదులో జరిగే క్రిస్టమస్ మిడ్-నైట్ మాస్ కి కూడా వెళ్లాను ఓ సారి..

అదలా ఉంటే,ఈ సంఘటనతో పాటు,అప్పటివే మరికొన్ని విషయాలు గుర్తొస్తాయి.

Holy Angels –కొత్త స్కూల్,  కొత్త atmosphere  అవడంతో,డ్యూటీ నుండి వచ్చాక, సాయంత్రాలు, స్కూల్లో  ఏమి జరిగిందని నన్నడిగేవారు నాన్న.వెంటనే,  కుర్చీలు, బల్లలు, సోఫా ఓ పక్కకి జరిపేసి, నాకోసం గదిని ‘వేదిక’ గా మార్చేసుకునేదాన్ని. అమ్మ, నాన్న, తమ్ముడు, ఆర్డర్లీకన్నన్ ని కూడా కాస్త దూరంగా, నా ఆడియన్స్ గా  కూర్చోబెట్టి,  మా మ్యూజిక్  క్లాసుని  ఓ  డ్రామా లా నటించి,  వారికి  చూపడం నాకు పరిపాటయింది.

మ్యూజిక్ క్లాస్ లో నేర్చుకున్న ఇంగ్లీష్ పాటలు  రాగాలు  తీస్తూ, రాగానికి తగ్గట్టుగా నేల మీదనుండి, బల్లమీదకి, అక్కడినుండి  కిటికీలోకి  ఎక్కి  పాడటం  ఒక ఎత్తైతే,  ప్రతి  టీచర్ని  అనుకరించి  చూపించడం మరో ఎత్తుగా, ఓ గంట సేపు వాళ్ళని నవ్వించేదాన్ని. ఓ ‘వేదిక’  మీద  డాన్స్ చేయాలి, చేయగలను, నన్ను అందరూ మెచ్చుకుంటారు కూడా - అన్న ఆలోచన,  ఇలాగే  మొదలైంది.

P.E అవర్ కూడా ఎంజాయ్ చేసేదాన్ని.  నేను class - fastest runner….రెండు టీమ్స్ గా డివైడ్ అయ్యేవాళ్ళం... నేను ఎటు వెళ్ళినా రెండో టీమ్ మొత్తుకునేవారు... నన్ను మాత్రం – coinతో tossవేసి గెలిచిన టీమ్ కి పంపేవారు...మా అమ్మా నాన్నా మెప్పు పొందాలని నిత్యం ప్రయత్నించేదాన్ని....అన్నింటా, వారు నన్నే మెచ్చుకోవాలని తాపత్రయ పడేదాన్ని.

http://www.gotelugu.com/issue79/2129/telugu-columns/natya-bharateeyam/