శుభ యోగములు - గుమ్మా రామలింగ స్వామి

Subhayogamulu

సనాతన కాలముండి మన ఋషులు జ్యొతిష్శాస్త్రమందు వివిధ జాతకములలొ నుండు శుభయోగములను అవయోగములను విపులముగా చర్చించి శాస్త్ర బద్ధము చెసిరి అట్టి యోగములు కొన్ని వందలవరకు ఉన్నవి. అందులోని కొన్ని శుభయోగములను నేను నా వ్యాసములందు ఉదహరించెదను.

ఈ యోగములు శుభాశుభ గ్రహములు తామున్న రాశుల స్తితిని బట్టి గ్రహముల కలియికను బట్టి దృస్ఠిని బట్టి ఎర్పడుచుండును. అందుచే వాటి వాటి బలములను అనుసరించి యోగముల బలములు నిర్ణయించవలెను.

భాగ్య యోగము:- భాగ్య స్థానమును అనగా లగ్నము నుండితొమ్మిదవ ఇంట శుభగ్రహ మున్ననూ లేదా శుభ గ్రహము చూచుచున్ననూ, ఆ భాగ్యధిపతి తన స్వ, మిత్ర, ఉచ్చ స్తానములో నున్నను ఈ భాగ్య యోగము కలుగును. ఈ యోగమున జన్మించిన వాడు శాశ్యిత ఇశ్వర్య వంతుడు, రాజ పూజితుడు, ధర్మ మార్గా పరుడు స్వకులాచార తత్పరుడు మొ" శెభ గుణములు కలిగి ఉండును.

ఖ్యాతియోగము:- లగ్నము నుండి దశమ స్థానమందు శుభగ్రహ మున్నను, శుభ గ్రహ వీక్షణ కలిగినను,దశమాధిపతి తన స్వ , మిత్ర ,ఉచ్చ స్థానములొ ఉన్ననూ ఈ యోగము కలుగును. ఈ జాతకులు ధన, మిత్ర, సతీ సుతులతొ,సకల సంపదలు కలిగి జనామోదము విపుల కిర్తి కలిగి ఉందురు.

పారిజాత యోగము:- లాభ స్థానమున అనగా లగ్నమునుడి పదకొండవ భావమున శుభగ్రహ మున్ననూ ఆ స్థానమును శుభగ్రహము చూచుచున్ననూ లెదా లాభాధిపతి స్వ,మిత్ర ఉచ్చ క్షెత్రమునందున్ననూ ఈ యొగము కలుగును. ఈ జాతకుడు స్వసంపాదన పరుడు ఉన్నత కుటుంబీకుడు భహు శుభంకరుడూఅగును.
 

గజకేసరి యోగం:- మనవ జాతకంలో గ్రహ స్థితిని బట్టి ఏర్పడిన యోగములలో ఈ యోగము చాలా మంచి ఫలితములిచ్చును. జాతక చక్రములో గురు, చంద్రుల ఉనికి వలన ఈ యోగము ఏర్పడుతుంది. చంద్రుని నుంచి గురుడు కేంద్రముల యందు ఉన్నప్పుడు అనగా గురుడు 4, 7, 10 స్థానములలో వున్నప్పుడు ఈ యోగబలము 4 కన్నా 7 లోనూ, 7 కన్నా 10 లోను అధికముగా వుంటుంది. ఈ యోగముల వారు సభ్యత, ఉదారము, సంపద, దానగుణము, ఉన్నతాధికారము మొదలగు సకల శుభ లక్షణములు కలిగి ఉందురు. కొందరు గురుడు కోణ మున్దున్నను ఈ యోగముగా భావించ వలెననుచున్నారు. కానీ నా అనుభవమున గురుని స్వస్థాన, ఉచ్చస్థాన, ధనుర్, మీన లగ్నమందు, కర్కాటక, వృషభ లగ్నమందు విశేష బలము కలుగునట్లు గమనించితిని. ఇతర రాశులలో దీని బలము నామ మాత్రమే. జాతకములో గజకేసరి యోగమును దాని బలమును నిర్థారించుటకు విశేష అనుభవము కావలెను. గురు చంద్రుల బలములు, గురుడు చంద్రుని కంటే ఎక్కువ బలము పొందిన ఆ జాతకులు విశేష ధన కీర్తి, సుఖమయ జీవితం జీవితాంతం గడిపినవారున్నారు !

ఈ యోగములలొ ఉన్న సర్వ శుభములు కనుపించుటకు ఆ గ్రహములన్నియు అస్థంగత దొషము లేకుండా ఉండవలెను. ఆ గ్రహములకు షడ్బలము దిగ్మలము కలిగిఉండవలెను. జాతకములలొ పైన చెప్పబడిన గ్రహస్తితి ఉన్ననూ ఈ బలములు లేనియడల ఆ యోగములు అంతగా ఫలితములను ఇచ్చుటలేదు. ఈ గ్రహస్తితినీ ఉనికినీ బలములనూ పరిగణలొనికి తీసుకునుని ఫలితములు చెప్పవలెను.