తెలుగు సంస్కృతి(కవిత) - మోపూరు పెంచల నరసింహం

కట్టులో బొట్టులో
నడకలో నడతలో
పలుకులో చేతలో
ముంగిట ముగ్గుల్లో
ముదిత బుగ్గల్లో
విరబూసె సిగ్గుల్లో
మామిడి తోరణాల పచ్చదనంలో
భానుడి కిరణాల వెచ్చదనంలో 
గడపలకు పూసె పసుపు పసిడికాంతిలో
ఆరు రుచులలో
ఆమని సోయగములో
అలరించె ప్రకృతిలో 
సప్తవర్ణాలలో 
సప్త స్వరాలలొ
సప్తపదిలొ
తేనెలొలుకు తెలుగులొ
సంప్రదాయాల మేలిముసుగులొ
ఆచారాల వెలుగులో
పరిమళిస్తొంది తెలుగుసంస్కృతి
ఇదే సకలశాస్త్రాల ఆకృతి
సధ్గుణాల హారతి 

మరిన్ని వ్యాసాలు

The tree woman of India
ది ట్రీ ఉమెన్ ఆఫ్ ఇండియా
- రాము కోలా. దెందుకూరు
గుల్ గుంబజ్7 .
గుల్ గుంబజ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
విక్టోరియా మెమోరియల్
విక్టోరియా మెమోరియల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మైసూర్ ప్యాలెస్ .
మైసూర్ ప్యాలెస్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Digital Welness
డిజిటల్ వెల్నెస్
- సి.హెచ్.ప్రతాప్