అందం - చందం - మానస

తల స్నానం చేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది.  జుట్టు ఫ్రెష్ గా, షైనీగా కనిపిస్తేనే ఫేస్ కూడా గ్లామరస్ గా కనిపించాలని ప్రతి వారు కోరుకుంటూనే ఉంటారు. దానికోసం చాలా మంది రెండురోజులకు ఒకసారి తలస్నానం చేస్తూ ఉంటారు. అయితే తలస్నానానికి ముందు తీసుకునే జాగ్రత్తలు మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. తలస్నానానికి ముందు కేవలం ఆయిల్ పెడితే సరిపోదు.  కురులు చిక్కుపడకుండానూ, కురుల కుదుళ్ళు బలహీనపడ కుండానూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


గోరువెచ్చని నీళ్ళు: తలస్నానానికి అధికవేడి నీటినికానీ, చన్నీటిని కానీ ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి.

శుద్దమైన నీరు: తలస్నానానికి పరిశుభ్రమైన నీటినే ఉపయోగించాలి. ఉప్పునీరు, బోరింగ్‌ నీరు కంటే శుద్ధమయిన నీటిని వాడటం కురులకు ఆరోగ్యకరం.

హాట్ ఆయిల్ మసాజ్: తలస్నానం చేయటానికి అరగంట ముందుగా కొబ్బరినూనెను వెచ్చచేసి, ఆ నూనెను వెంట్రుకల కుదుళ్ళకు చేరేలాగా పట్టించాలి. వేళ్ళతో మృదువుగా మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.

శీకాయ: తలస్నానానికి కుంకుడుకాయలు, సీకాయను వాడటం వల్ల జుట్టు మెత్తగా ఉండటమే కాక, జుట్టు ఆరోగ్యమూ బాగుంటుంది.

హేయిర్ ప్యాక్: అభ్యంగన స్నానానికి ముందుగా మెంతులు రుబ్బిన ముద్దను తలకుపట్టించే వారు. పేల నిర్మూలనకోసం హారతి కర్పూరం పొడిని లేదా కలరా ఉండల పొడిని కొబ్బరినూనెలో కలిపి జుట్టుకు రాసేవారు. చుండ్రు నిరోధానికి నిమ్మ రసాన్ని కానీ, లేతవేపాకుల ముద్దను కానీ జుట్టుకు రాసేవారు. హెన్నా తలకుపూసే వారు ముందుగా తలమీద నీరుపోసి, వాటిని కడిగేసిన తర్వాతనే షాంపూను కానీ, సీకాయసబ్బును కానీ, సీకాయ పొడినికానీ, కుంకుడురసాన్ని కానీ వాడాలి.

షాంపూ: తలతడిపిన తర్వాతనే షాంపూతో రుద్దుకోవాలి.షాంపూను నేరుగా జుట్టు మీద వేసుకో కూడదు.చేతిలో కొంచెంవేసుకొని,నీళ్ళు కలిపి, ఆ తర్వాత తలకు పట్టించి, వెంట్రుకలను శుభ్రపరచాలి.

సిట్రస్ పండ్లు: నిమ్మ, కమలాఫలం, నారింజ తొక్క లను, ఎండిన మందార ఆకులు లేదా పూలను మెత్తగా పొడిచేసి, ఆ పొడిని సీకాయ పొడిలో కానీ కుంకుడు కాయ పొడిలో కానీ లేదా కుంకుడు రసంలో కానీ కలిపి తల రుద్దుకుంటే జుట్టు త్వరగా తెల్లబడదు. వెంట్రుకలు నిగనిగ లాడుతూ, మృదువుగా ఉంటాయి.

స్టార్చ్: తలస్నానానికి ఉపయోగించే కుంకుడు రసంలో కానీ, సీకాయపొడిలో కానీ అన్నం వార్చిన గంజిని కలిపి తల రుద్దు కుంటే వెంట్రుకలు త్వరగా నెరిసిపోవు.

షవర్ బాత్: షాంపూను ఉపయోగించే వారు ఆ నురగ తలమీది నుంచి, వెంట్రుకల కుదుళ్ళలోంచి పూర్తిగా తొలగి పోయేం త వరకు తలమీద నీళ్ళు పోసుకుని జుట్టును బాగా శుభ్రపరచాలి. తలస్నానానికి ఎక్కువగా షాంపూను వాడితే, వాటిలోని రసాయనాలు కేశాలకు హాని చేస్తాయి. వెంట్రుకల మురికి, జిడ్డు వదలడానికి తగినంత షాంపూను మాత్రమే వాడాలి.వెంట్రుకలను శుభ్రపరచటానికి అడ్డదిడ్డంగా రుద్దకూడదు. అల్లా చేస్తే వెంట్రుకలు చిక్కు పడడం, తెగిపోవడం జరుగుతుంది.

టవల్: వెంట్రుకల తడిని పీల్చడానికి తలకు చుట్టే టవలు మెత్తగానూ, తేలికగాను ఉండాలి. రఫ్‌గానూ బరువుగానూ వుండకూడదు. ఇతరులు వాడిన తువ్వాలను తల తుడుచుకోడానికి ఉపయోగించకూడదు. తలను తుడుచుకునేటప్పుడు పై నుంచి క్రింది వరకూ తుడవాలి. ఎడా పెడా ఇష్టం వచ్చినట్లు తుడవకూడదు. వెంట్రుకలు తడిగా వున్నప్పుడు తల దువ్వుకూడదు. ఆరిన తర్వాతనే తల దువ్వుకోవాలి.

మరిన్ని వ్యాసాలు

Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం