శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

Sri Swamy Vivekananda

వివేకానంద స్వామి మాయ - ముక్తి  ని గురించి లండన్ వుపన్యాసములో ఇలా వివరించారు.

వివేకానంద స్వామి గురువు గారైన రామక్రిష్ణ  పరమహంస ఒకసారి "మాయ ను దర్శించాలనుకున్నారు. కాళి మాతను ప్రార్దించారు. గంగానది వైపు చూస్తుండగానే ఆ జలాల్లోంచి ఒక చిన్న బుడగ బయటికి వచ్చింది. అది అలా లేచి క్రమేపి పెద్దదవుతూ గట్టు మీదకి వచ్చి, చూస్తూ ఉండగానే ఒక స్త్రీ గా మారింది. ఆ స్త్రీ ప్రౌడఐ ఒక బిడ్డను ప్రసవించింది. కాసేపు ఆ బిడ్డను పోషించి, పెంచి, ప్రేమతో లాలించి పెద్దచేసింది. కొద్ది సేపటికి ఎక్కడి నుండో కత్తిపీట తెచ్చింది. అంత సేపు ఆలనా, పాలనా చూస్తూ కని పెంచిన బిడ్డను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కరకరా నమిలి మింగేసింది. తానూ ఆ జలాల్లో కలిసిపోయింది. అయితే ఆ స్త్రీ ముఖములో నీటి బుడగ నుంచి ఉత్పన్నమైన క్షణము నుంచి, తిరిగి నీటిలో కలిసి పోయేవరకు ఒకే రకమైన ప్రసన్నత వుంది రామకృష్ణులు వంక పలకరింపుగా నవ్వి, అంతర్దానమైంది.

వారికీ దృశ్యము అనుభూతమైనంత సేపు, చుట్టు పక్కల జనం సంచరిస్తున్నారు. వారెవరికీ దృశ్యం కనిపించినట్లు లేదు. అప్పుడు కాళికా దేవి ఇలా వివరించింది. "నీవు చుసిన దృశ్యం మాయ. అయితే మాయను చూచుటకు ఒకడుండాలి. చూచువానిని విడిచి మాయ లేదు. చూచువాడు కూడా ఆ మయాసమ్భవములొ ఒక పాత్రను పోషిస్తాడు". రామక్రిష్ణులు అప్పటికే జ్ఞాన సిద్ధులు కాబట్టి స్వయముగా ప్రభావితులు కాకుండానే అ దృశ్యాన్ని దర్శించగలిగారు. అలా కాని వారికి అది సాధ్యము కాదు. మాయానుభుతికి ఎంతో కొంత సుంకం చెల్లించాలి .అంటే అందులో పాత్రను పోషించి, దాని కష్ట నష్టాలను, పంచుకొవాలి. ఈ అనుభూతి  ద్వారా మాయను గురించి గ్రహించవలసిన అంశాలు వున్నాయి.

1. మాయ తాత్కాలికమ్. దానికి మొదలు, మధ్య, తుది, వున్నాయి.
2. దానిలో సంఘటనలు ముందు ఆకర్షణీయముగా ఉన్నప్పటికీ, చివరికి దుఃఖము గానే మారుతున్నాయి.
3. రామక్రిష్ణుల దర్శనములో మాయారూపిణి అయిన స్త్రీ గంగా జలము నుండి పుట్టి తిరిగి గంగ లోనే కలిసి పొయింది. అంతే కాదు తాను సృష్టించిన బిడ్డని, తెగ నరికి తిరిగి తనలోకే అంతర్హితం చేసుకుని మరీ గంగలో కలసిపోయింది. గంగ అంటే పరబ్రహ్మము. కాబట్టి మాయ బ్రహ్మము నుండి పుట్టి, దాని నుండి పడినట్టుగా కనిపించి తిరిగి బ్రహ్మము లోనే కలిసి పోతుంది. పై దృశ్యము లోని స్తేరీ మాయకు సంకేతము. ఆమె కని, ప్రేమతో పెంచిన బిడ్డ ఆమె, దేహముతో కలుపుకుని ఈ ప్రపంచానికి సంకేతము. అనగా మాయ తాను కన్న ప్రపంచములో అంతర్భాగమే. ముందు ఆకర్షణీయముగా తోచిన ప్రపంచమే చివరకు విషం, విషమం అవుతుంది. దానిని వదిలిన్చుకోవటమే అభ్యాసము. దానికి సాధనం విచారమనే కత్తిపీట. తన సృష్టి అనే శిశువును ఖండించి అంతర్హితం చెయ్యాలి. అనగా దేహ భావన, ప్రపంచ భావన అంతరించాలని అన్తరార్ధము. అప్పుడే జీవునికి మరలా గంగా ప్రవేశము - అనగా బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మము లో కలియుట.

ఇది మాయ. మనం మాయకు దాసులం. మాయలోనే పుట్టి, మాయ లోనే జీవిస్తున్నాము అనటము నిజమే ఐనా,  దీనిని ఎదుర్కోనటానికి రెండు మార్గాలు వున్నాయని వివేకానంద స్వామి ఇలా చెప్పారు:

"కాలం తప్పనిదే కావచ్చు. కాని దానిని పట్టించుకోవద్దు. చేయగలిగినదంతా చెయ్యి. దృష్టిని ఎప్పుడు అభివృద్ధి వైపే ఉంచు. ఎప్పుడు జీవితములోని దుఃఖాల గురించి ఆలోచించ వద్దు. ప్రపంచము ఎలా నడిచిన సరే, దానిని అంగీకరించండి. మీకు వీలున్నంత ప్రశాంతముగా సుఖముగా జీవించండి. మీ పైన పడే దెబ్బలను పువ్వులుగా భావించండి. మిమ్మల్ని బానిసలగా తరిమినా, మేము స్వేచ్చాపరులమే అనుకోండి. "మాయ మిమ్మల్ని ఎప్పుడు బందించ లేదు. ప్రకృతికి మీపై ఎప్పుడు అధికారం లేదు. పసిబిడ్డలాగా భయపడుతున్నారు. ఈ భయములోనుండి బయటకు రండి. విముక్తిని పొందండి. ఈ పరమార్ధాన్ని బుద్ధి గతం చేసుకుంటే చాలదు. ప్రత్యక్షముగా అనుభవించండి. ఈ ప్రపంచము ఎంత స్పస్టముగా కనిపిస్తుందో అంత సృష్టముగా అది కనిపించాలి. అప్పటికి కాని కస్టాలు తీరవు అప్పుడు మాయ, భయంకర స్వప్నరూపమై ఉండటము మాని, అతి మనోహరముగా కనిపిస్తుంది. ప్రపంచం అద్భుతమైన ఉద్యాన వనము లాగ కనిపిస్తుంది. అపాయాలు, కష్టాలు, వ్యధలు వాని సత్య రూపమైన భగవంతునిగానే కనిపిస్తాయి. అన్నిటికీ యదార్ధ మూలమై అతడే నిలిచి ఉంటాడని, అతడు ఏకం, సత్యంఐన ఆత్మ అని, మనకర్ధమవుతుంది".

మరిన్ని వ్యాసాలు

కళల ఆవిర్భావం .
కళల ఆవిర్భావం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
లంబాడి సంస్కృతి .
లంబాడి సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
గిరిజన నృత్యాలు .
గిరిజన నృత్యాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం ఒగ్గు కథ.
కళారూపం ఒగ్గు కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
యోగాలు .
యోగాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం తోలుబొమ్మలాట .
కళారూపం తోలుబొమ్మలాట .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కురుక్షేత్ర సంగ్రామం.
కురుక్షేత్ర సంగ్రామం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.