సిరిపురంలో శివయ్య అనే అతను కిరాణ అంగడి నడుపుతూ ఉండేవాడు.
అతని అంగడిలో సరుకు నాణ్యతతోపాటు, ధరలుకూడా ఎప్పుడు తక్కువగా ఉండేవి.ఆఊరిలోని ప్రజలేకాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు కూడా అతని అంగడిలో సరుకులు కొనుగోలు చేస్తుండేవారు. తనచదువు ముంగించుకుని వచ్చిన కుమారుడిని గల్లాపెట్టె వద్దకూర్చొపెట్టి ,అంగడిలో పనివాళ్ళకు జాగ్రత్తలు చెప్పి ,వారంలో రెండు రోజులు తను పెద్దమొత్తంలో నాణ్యమైన సరుకులు నగరంలో కొనుగోలు చేస్తూ,ఉదయం నగరానికి వెళితే రాత్రికి ఇల్లు చేరేవాడు.
ఒకరోజు శివయ్య కుమారుడు రాత్రి తండ్రితో భోజన సమయంలో "నాన్నగారు ఇంతమంచి సంపాదన కలిగిన వ్యాపారం మనకి ఉన్నదికదా! మరినన్ను ఇంత గొప్పచదవు ఎందుకుకు చదివించారు ,అలాగే మన ఊరిలో ఇన్ని అంగడులు ఉండగా మనఅంగడికె ఇంత జనం ఎలా వస్తున్నారు? ఏమిటా వ్యాపార రహస్యం " అన్నాడు.
" నాయనా విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం, మనిషిని వీవేక వంతుడిని,చైతన్యవంతుడిని చెయడంతోపాటు మన సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సామాజకీయం జేయడం. విద్య అనగా, మానవునిలో దాగివున్న అంతర-జ్ఞానాన్ని వెలికి తీయడం. ప్రకృతి ప్రతి మానవునికీ అంతర-జ్ఞానాన్ని ప్రసాదించింది. దానికి సానబెట్టి వెలికి తీయడమే విద్య పని.నాకులేని పెద్ద చదువునీలో చూసుకోవాలి అనుకున్నాను.అందుకనే నువ్వుకోరుకున్నది చదవించాను.
ఇకవ్యాపార రహస్యంఅంటావా ? మనిషికి ఆశ ఉండాలి దురాశ ఉండకూడదు. ప్రజలకు అమ్మేసరుకులపైన ఎక్కువ లాభం చూడకూడదు.ఉదాహరణకు మనఎదటి అంగడిలో బియ్యం కిలో నలభై ఐదురూపాయలకు తీసుకువచ్చి,వాటిని ప్రజలకు యాభైరూపాయలకు అమ్ముతూ,కిలోకి ఐదురూపాయల లాభం పొందుతున్నాడు. మనం అదేరకం బియ్యం నలభై ఏడురూపాపాయలకు అమ్మికిలోకి రెండు రూపాయల లాభం పొందుతున్నాం. తక్కువధరకు మనంరోజుకు నాలుగు బస్తాల బియ్యంఅమ్ముతుంటే,ఎక్కువధరకి ఎదటి అంగడివారు బస్తా బియ్యం అమ్మలేరు. ఇలా పలురకాల వస్తువులు తక్కువ ధరలో అమ్మడం వలన మనకు మంచివ్యాపారం జరుగుతుంది.ప్రజలు తాము కొనుగోలు చేసే సరకులలో నాణ్యతతోపాటు,ధరల వెత్యాశంకూడా చూస్తారు. ఒకసారి ప్రజలకు మన అంగడిపైన నమ్మకంకుదిరింది అంటే చాలు ,మనవ్యాపారం సాఫీగాసాగిపోతుంది.
పదిమందిపై నీవు పొందాలి అనుకున్నలాభం, ఇరవైమంది పైన పొందు. అదే వ్యాపార రహస్యం.అధిక లాభాలు ఆశించకుండా వ్యాపారంచేయి. మనిషి నమ్మకం,నిజాయితిగా,నిర్బయంగా జీవించగలిగితే అదిగొప్ప జీవితం.నీవు చేస్తున్న వృత్తి,వ్యాపారాలలో ఒడుదుడుకులు తట్టుకోవడానికి సిధ్ధంగా ఉండాలి.ఎదటివారికి గౌరవం, ప్రాధాన్యత ఇవ్వు ఇవన్ని ఎవరైతే ఆచరించగలుగుతారో వారు సుఖమైన జీవితాన్ని అనుభవిస్తారు.మొదట ఒంటి ఎద్దు బండిలో సరుకులు తెచ్చే నేను నేడు లారిలో సరుకు తెప్పిస్తుంన్నాను అంటే ఇదే నావ్యాపార రహస్యం "అన్నాడు శివయ్య.

