నచ్చిన పుస్తకం: సిల్క్ రూట్ లో సాహసయాత్ర - శివ శంకరి చినాకుల

adventure in silk route

"ఇది సాహసయాత్ర మాత్రమే కాదు, చరిత్ర యాత్ర."

విశ్వ వీధుల్లో ఒంటరి బాటసారిగా పయనించాలనే కోరిక కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. రెండున్నర వేల సంవత్సరాల క్రితం నుండి 13 వ శతాబ్దంలో సముద్ర మార్గాల ఆవిష్కరణ వరకు ఆసియా దేశాలకు,యూరపు దేశాలకు మధ్య 'వారధిగా' ఉపయోగపడింది ఈ" సిల్క్ రోడ్డు".

అయితే ఈ మార్గం వాణిజ్య వ్యాపారాలకే పరి- మితం కాక విజ్ఞాన శాస్త్రాలు,కళలు, మతాలు, సంస్కృతుల పరస్పర మార్పిడికి కూడా ఉపయోగపడింది. ఆసియా ప్రాచీన నాగరికత ఈ "బంగారు పట్టు దారుల" ద్వారానే యూరపు దేశాలకు ప్రవహించి, విస్తరించింది.ఆ వైభవ చరిత్ర సందర్శించడం కోసమే రచయిత "పరవస్తు లోకేశ్వర్" గారు పర్యటించి ఆ విజ్ఞానాన్ని,విశేషాలను మనతో పంచుకున్నారు.

అలెగ్జాండర్, పాహియాన్,మార్క్ పోలో, చంఘిజ్ ఖాన్, బాబార్, చంఘిజ్ ఐతో మతోవ్, అనేక మంది బౌద్ద భిక్షుల, అడుగుజాడలలో గతించిన జ్ఞాపకా లను అన్వేషిస్తూ ముందుకు సాగారు. ప్రముఖ చరిత్ర కారుడు,ప్రపంచ యాత్రికుడు "రాహుల్ సాంకృత్యాన్" ప్రభావం రచయిత మీద ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటూ ఈ పుస్తకాన్ని ఆయనకే "అంకితం" చేసారు.

అరవై రెండు సంవత్సరాల వయస్సులో ఒంటరిగా, సరైన ఆహారం లేక , తెలియని భాష మాట్లాడే దేశాలలో రెండు నెలలు సంచరించడం సాహసం అనే చెప్పాలి.భాష రాని చోట హృదయ భాష ఉంటుంది. కాబట్టి శ్రమ అనిపించలేదు అంటారు. లోహావిహంగం లో ప్రయాణించి తాష్కెంట్ చేరుకొని ఆ నగర విశేషాలను,తన అనుభవాలను వివరిస్తూ అక్కడి పర్యటన ముగించి రైలు లో బుఖారా చేరు కొని ఆ నగర పవిత్రతను వివరిస్తూ, ప్రాచీన భారత దేశంలో తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాల లాగే ఈ బుఖారా, దాని ప్రక్కనే ఉన్న సమర్ఖండ్ లలో కూడా అనేక విజ్ఞాన శాస్త్ర విశ్వ విద్యాలయాలను నెలకొల్పారు.అలెగ్జాండర్ జయించి నప్పుడు గ్రీకులు ఈ నగరాన్ని "మకరంద" అనేవారంట. సమర్ ఖండ్ పదం పలకటం కూడా "కలా ఖండ్ "అంత తియ్యగా ఉందని వర్ణించారు.

అక్కడి ప్రజల వేషధారణ, ఆహారపుఅలవాట్లు గమనిస్తూ, వివరిస్తూ, సమర్ ఖండ్ కి ఆభరణం అయిన " రేగిస్థాన్" కు బయలుదేరి, ఇంక...... ఆ "రేగిస్థాన్" ప్రాంతాన్ని వర్ణించడం రచయిత మాటల్లో మాత్రమే సాధ్యం. ఈ ప్రాంత ఫోటోలను చూసే సిల్క్ రోడ్డు యాత్ర ప్రారంభించినట్లు చెబుతారు. అక్కడి ఇసుక తో ఆ నగరాన్ని నిర్మించడం వలన ఆ పేరు వచ్చిందంటారు.

ఒకప్పుడు ఈ మధ్య ఆసియా దేశాలన్నీ మన ప్రాచీన భరత ఖండంలో అంతర్భాగంగాన, దగ్గర సంబంధం కల దేశాలుగా ఉండేవి.వేదాలలో, రామాయణం, మహాభారతంలో వీటి ప్రస్తావన ఉన్నట్లు చెబుతారు, ఈ మధ్య ఆసియా ప్రాంతాన్ని " ఉత్తర కురు భూమి" అని",పామీరు పీఠభూమి "ని " మేరు పర్వతం" అని, "హిందూఖుష్ పర్వతాలను" "హిమనందన" మార్గమని,తజకిస్థాన్ ను" కాంభోజ దేశమని" ," కాందహర్" ను "గాంధార దేశమని", "కాబుల్ "ను" కపిశ" అని, "పెషావర్ "ను" పురుషపురమని" అనేవారు.

ఉజ్బాకిస్థాన్ నుండి కిర్గిజ్ స్థాన్ చేరుకొని,రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన కన్నీటి గాథలు, త్యాగాలు సాహసాలు వివరిస్తూ, "చెంఘీజ్ ఐత్ మాతోవ్" రచనల ప్రభావంతో నేను "కిర్గిజ్ స్థాన్" ను ప్రేమించానని తెలుపుతూ, చక్కగా వర్ణిస్తూ, ప్రతి విషయం వివరిస్తూ, మనము కూడా రచయిత తో పాటుగా ఆ దేశాలు, ప్రాంతాలు, ఆ ఎడారిలో సంచరిస్తున్నామా అనిపించేంతగా వివరించారు. మన దేశంలో వైద్య విద్యార్థులకు సీటు రాక పోతే ఎక్కువ భాగం ఇక్కడికే వస్తారని, వారి అనుభవాలను కూడా మనతో పంచుకున్నారు.

ఈ పర్యటనలో భాగంగా" శకుల" ప్రస్తావన వచ్చింది. ఈ "శకుల" వలననే మనకు" శాలివాహన శకం" ప్రారంభమైంది. ఆ వివరణ అంత రచయిత "లోకేశ్వర్" గారు చాలా చక్కగా వివరించారు. ఆఖరుగా చైనా పర్యటన తో ముగిస్తారు.ఈ మధ్య కాలంలో చైనా తిరిగి సిల్క్ రోడ్డు ను పునరుద్ధరణ చేయాలని చూస్తోంది.

"సైబీరియా మంచు ఎడారులు", " గోబీ ఎడారులు", "చంఘీజ్ ఖాన్" సాహసాలు, మంగోలియన్ల, గురించి ఇంకా చాలా చాలా విషయాలు వివరించారు. " లోకేశ్వర్" గారు ఎన్నో వ్యయ,ప్రయాసాలకు ఓర్చి ఈ ప్రయాణం చేశారు.

కానీ నేను ఈ పుస్తకం చదవడం వలన అన్ని విశేషాలు రచయిత వెనుక వెళ్ళి చూసినంత ఆశ్వాదించాను. మీరు కూడా చూడాలని (ఈ పుస్తకం చదవడం ద్వారా).......

మరిన్ని వ్యాసాలు

రామసక్కని బాలల కథలు
రామసక్కని బాలల కథలు
- దుర్గమ్ భైతి
రాష్ట్ర కూటులు .
రాష్ట్ర కూటులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
విష్ణుకుండీనులు శాసనాలు.
విష్ణుకుండీనులు శాసనాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
పింగళి వెంకయ్య.
పింగళి వెంకయ్య.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Second World War - 7
రెండవ ప్రపంచ యుద్ధం -7
- శ్యామకుమార్ చాగల్