
ఆ రోజు సాయంత్రం, రవి తన పనేదో చేసుకుంటున్నాడు. గదిలో శకుంతల టీ తాగుతూ కొడుకు పక్కనే కూర్చుంది. శకుంతల క్రిప్టోకరెన్సీ చుట్టూ ఉన్న గోల గురించి ఆసక్తిగా ప్రశ్నించడం మొదలు పెడుతుంది.
రవి,నువ్వు ఎప్పుడూ ఆ ల్యాప్టాప్కి అతుక్కుపోయి ఉంటావ్ , క్రిప్టోకరెన్సీ అని చాల సార్లు విన్నాను. అసలేంటి క్రిప్టోకరెన్సీ అంటే?
రవి నవ్వుతూ "క్రిప్టో ట్రెండ్స్ గురించి చదువుతున్నాను, అమ్మా, మార్కెట్ ఎలా మారుతుందో చూడటం చాలా ఆసక్తికరం" అన్నాడు
ఆహా క్రిప్టో! ఈరోజుల్లో అందరూ అదే మాట చెబుతున్నారు. బిట్కాయిన్, ఈథీరియం, ఇంకా ఏదో బ్లాక్చైన్ల గురించి వినిపిస్తోంది. ఆ గోల అంతా ఏమిటి? అంది
ల్యాప్టాప్ మూసేస్తూ " క్రిప్టో అంటే డిజిటల్ రూపంలో డబ్బు, అత్తా. ఇది డిసెంట్రలైజ్డ్ ఉంటుంది, అంటే ఇది ఏ ప్రభుత్వానికో లేదా బ్యాంక్కి ఆధీనంలో ఉండదు. బదులుగా, ఇది బ్లాక్చైన్ అనే టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది" అన్నాడు
"బ్లాక్చైన్? డిసెంట్రలైజ్డ్? నువ్వు ఆలా తల తిప్పేస్తూ అంటే నాకేమి అర్ధం అవుతుంది ? ! సింపుల్గా చెప్పలేవా? అంది
రవి నవ్వుతూ," సరే, మొదటినుంచి మొదలెడదాం. జీవితం ఒక చక్రంలా ఉందని ఊహించండి . ఈరోజు మనం చేసే ప్రతిదీ—వ్యాపారం, మార్పిడి, సంపాదన, పొదుపు—కాలం తో మనం క్రమంగా అభివృద్ధి చెందినా, అదే విలువ మార్పిడి మీద ఆధారపడి ఉంటుంది, పూర్వం లాగా సామ్రాజ్యాలు వారి వారి నాణాలను వారు ముద్రించుకోవటం డిసెంట్రలైజ్డ్ గా పరిగణినిచవచ్చు " అంటుండగానే ,
"విలువ మార్పిడి అంటే? అంటే, నేను బజారులో కూరగాయలతో బియ్యం తీసుకునేలా అని అంటున్నావా?" అంది శకుంతల.
ఆ పాయింట్ కే వస్తున్నా అమ్మా ! పూర్వ కాలంలో డబ్బు ఉండేది కాదు. ప్రజలు బార్టర్ సిస్టమ్ ఉపయోగించేవారు—ఒక వస్తువు కోసం మరో వస్తువును మార్పిడి చేసుకోవడం. ఎవరికైనా గోధుమలు ఉంటే, ఉప్పు కావాలి అనుకుంటే, వారు ఒకదానిని మరొకదానికి ఇచ్చి తీసుకునేవారు.కానీ, ఉప్పు అమ్మేవారికి గోధుమలు అవసరం లేకపోతే గనక అది సమస్య కదా ? బార్టర్లో రెండు పక్షాలకూ అవసరం కలగాలి. దీన్ని పరిష్కరించడానికి, మనుషులు బంగారం మరియు వెండితో తయారైన నాణేలను కనుగొన్నారు.
"ఓహ్ !అర్థం అయ్యింది, మరి నాణేలు విలువ కొలవడానికి మార్గం? అడిగింది శకుంతల.
" నాణేలు పోర్టబుల్, డ్యూరబుల్, మరియు తమ అంతర్గత విలువ కారణంగా అందరికీ ఆమోదయోగ్యంగా మారాయి. క్రమంగా, ప్రభుత్వాలు ఫియాట్ డబ్బు—ప్రపంచమంతా ముద్రించబడిన కాగిత డబ్బును విడుదల చేయడం ప్రారంభించాయి" అన్నాడు రవి .
"ఇప్పుడు డిజిటల్ డబ్బుకి అదే ఆన్లైన్ , గూగుల్ పే , అవీ -ఇవీ కి మారాము. క్రిప్టో కూడా అలాంటిదేనా? అడిగింది ఆసక్తిగా.
"అవును, కానీ కొంచెం విభిన్నంగా ఉంటుంది. క్రిప్టో కూడా డిజిటల్గా ఉంటుంది, కానీ ఇది ఫియాట్ డబ్బు కాకుండా, ఎటువంటి కేంద్రీకృత అధికారాన్ని అనుసరించదు. బదులుగా, ఇది క్రిప్టోగ్రఫీ మరియు బ్లాక్చైన్ ఆధారంగా పనిచేస్తుంది" అన్నాడు రవి
"అహా మళ్ళీ ! ఈ బ్లాక్చైన్ గొడవేంట్రా నాయనా ? "అంది శకుంతల
"ఊహించండి అమ్మ , అన్ని లావాదేవీలను నమోదు చేసే ఒక లెడ్జర్ బుక్ ఉంటుందని . కానీ ఒకే వ్యక్తి కాకుండా, ప్రతి వ్యక్తి వద్ద ఆ లెడ్జర్ కాపీ ఉంటుంది. ఎవరో కొత్త ఎంట్రీ చేస్తే, అందరూ తమ కాపీలను అప్డేట్ చేస్తారు. ఇదే బ్లాక్చైన్—ఒక డిసెంట్రలైజ్డ్, పారదర్శక, మరియు సురక్షిత వ్యవస్థ. ఒక్క బ్యాంక్ వాళ్లే ఇదే ప్రక్రియ చేస్తే , తప్పులు జరిగే అవకాశాలుంటాయి , అదే కాకుండా తప్పులు జరిగాయి కూడా" అన్నాడు .
"ఇది ఆసక్తికరంగా ఉంది! మరి ఇది బిట్కాయిన్లతో లేదా మరేదైనా కాయిన్ల తో ఏంటి సంబంధం?" అంది
"బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు ప్రాచీన నాణేల సమానం. బంగారు నాణేలు బంగారం వల్ల విలువ కలిగి ఉన్నట్లే, బిట్కాయిన్ సిస్టమ్పై నమ్మకం మరియు దాని లభ్యత తగ్గిపోవడం వల్ల విలువ కలిగి ఉంటుంది—21 మిలియన్ బిట్కాయిన్లు మాత్రమే ఉంటాయి. వాటి తోనే అందరూ సర్దుకోవలసి వస్తే, రోజు రోజుకు దాని విలువ పెరుగుతుంది. అంటే సప్లై తగ్గితే డిమాండ్ పెరుగుతుందిగా ! అలా అన్నమాట!" అన్నాడు.
"కానీ, సాధారణ డబ్బు వాడకం , సులభంగా ఉంటుంది కదా? ప్రశ్నించింది.
"అవును, కానీ దానికీ లోపాలున్నాయి. ఉదాహరణకు, ప్రభుత్వాలు ఎక్కువ డబ్బు ముద్రిస్తే, ద్రవ్యోల్బణం అవుతుంది. క్రిప్టోకి ఇలాంటివి ఉండవు, ఎందుకంటే దాని సరఫరా కంట్రోల్డ్ గా ఉంటుంది . ప్రభుత్వం కరెన్సీ ముద్రించడం సులభం , కానీ ఈ కాయిన్స్ సంఖ్య పెంచడం సులభం కాదు. అది ప్రపంచం లో ఒకరికొకరు తెలియనివారు కలిసి నిర్ణయం తీసుకోవటం అ సంభవం అనే చెప్పాలి" అన్నాడు రవి.
"మరి ప్రజలు క్రిప్టోను ఎలా ఉపయోగిస్తారు? దానితో కూరగాయలు కొనగలనా?
"ఇంకా లేదు, కానీ కొన్ని చోట్ల క్రిప్టో ఆమోదం పొందుతోంది అమ్మ "
"నిజమే, ప్రపంచం నిజంగా ఒక చక్రంలా ఉంది. ధాన్యం-ఉప్పు బార్టర్ నుండి ఇవాళ బ్లాక్చైన్ స్కానింగ్ వరకూ ఎంత మార్పు వచ్చినా, అది పూర్వ పద్దతి లాగే ఉంది" అంది శకుంతల
"చక్రం తిరుగుతూనే ఉంటుంది, అమ్మా!" అన్నాడు రవి.
ఇద్దరూ నవ్వుకున్నారు.