సిని నారదులు.13. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

సిని నారదులు.13.

కృష్ణ ప్రేమ (1943 సినిమా)

ఇదే పేరుతో 1961లో వచ్చిన మరొక సినిమా కృష్ణ ప్రేమ

కృష్ణప్రేమ 1943లో. మార్చి 27 న విడుదలైన తెలుగు చలన చిత్రం. హెచ్.వి.బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పి.భానుమతి,శాంతకుమారి,గాలి వెంకటేశ్వర్లు , అద్దంకి శ్రీరామమూర్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి, సంగీతం గాలి పెంచల నరసింహారావు అందించారు .

ధరించిన పాత్ర

నటీనటులు

శ్రీకృష్ణుడు

గాలి వెంకటేశ్వరరావు

రాధ

శాంతకుమారి

సత్యభామ

హైమవతి

చంద్రావళి

భానుమతీ రామకృష్ణ

చంద్రావళి తల్లి

పార్వతీ బాయి

చంద్రగోపుడు

అద్దంకి శ్రీరామమూర్తి

నారదుడు

టంగుటూరి సూర్యకుమారి

రుక్మిణి

జయ గౌరి

విదూషకుడు

హీరన్నయ్య

సాంకేతిక వర్గం

దర్శకుడు: హెచ్.వి.బాబు

సంగీతం: గాలి పెంచల నరసింహారావు

నిర్మాణ సంస్థ: ఫేమస్ ఫిలింస్

ఫోటోగ్రఫి: జితేన్ బెనర్జీ _ పి ఎన్. సెల్వరాజ్

సాహిత్యం: తాపీ ధర్మారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం

చిత్రానువాదం, మాటలు: తాపీ ధర్మారావు

నేపథ్య గానం: పి.భానుమతి, శాంతకుమారి,గాలి వెంకటేశ్వర్లు, టంగుటూరి సూర్యకుమారి, అద్దంకి శ్రీరామమూర్తి

విడుదల:1943: మార్చి 27.

ఈచిత్రంలో నారద పాత్రధారిటంగుటూరి సూర్యకుమారి గురించి...

తొలితరం దేశభక్తిగాయనిగా మాదీ స్వతంత్ర మాది స్వతంత్రజాతి ఎలుగెత్తిన ఈకీర్తిశిఖరం టంగుటూరి శ్రీరాములు రాజేశ్వరి గార్రకు 1925నవంబర్ 13 న రాజమండ్రిలో జన్మించారు. టంగుటూరి ప్రకాశంపంతులు గారి తమ్ముని కుమార్తె ఈమె.బాలకోకిలగా పేరుపొందినఈమె తరువాతకాలంలో క్రేంబ్రిడ్జిసీనియర్ మెట్రిక్యులేషన్ పరిక్షలోఉత్తిర్ణతసాధించారు.ప్రముఖ సంగీత విద్వాంసులు అరియకూడి రామానుజ అయ్యంగార్ వద్దసంగీతం అభ్యసించారు.1937 లో తనపదమూడవఏట "విప్రనారాయణ"(తమిళం)చిత్రంద్వారా సినిమా రంగానికి పరిచయం చేయబడ్డారు.1944 లో "గీతాప్రకాష్ "అనే సంస్ధ స్ధాపించి ,పలుప్రాంతాలలో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన ధనాన్ని క్షయ వ్యాధి వైద్యశాలకు,రెడ్ క్రాస్ సంస్ఢకు విరాళంగా అందజేసారు. 1952 లో ఈమె "మిస్ మద్రాసు"గా ఎంపిక అయ్యరు.అమెరికా చలనచిత్ర పర్యటనకు 14 భారతీయులులను ఎంపిక చేయగా అందు లో ఈమె ఉన్నారు.1953 అక్టోబర్ 1 న ఆంధ్రరాష్ట్ర అవతరణ సభలో నెహ్రు,రాజాజి,ప్రకాశం గారి సమక్షంలో 'వందేమాతరం'గీతంతోపాటు 'మాతెలుగు తల్లికి మల్లేపూదండ'గీతాన్ని తొలి సారి ఆలపించారు.అలా ఎన్నో లలిత గీతాలు గ్రాంఫోన్ రికార్టులుగా వెలు వడ్డాయి.మెత్తం26 తెలుగు,తమిళం,హిందీ,గుజరాతి,సంస్కృతం,ఇంగ్లీషు చిత్రాలలో నటించారు.1956 లో ఈమె నిర్మించిన'చిత్రార్జున' చిత్రప్రదర్మనచూసిన నెహ్రు,సర్వేపల్లిరాధాకృష్ణా గార్లఅభినందనలు పొందారు.1960 లో లండన్ వెళ్ళి అక్కడ 'ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ 'అనే సంస్ధస్ధాపించి భారతీయ పలుకళలు ప్రదర్మించి పేరుపొందారు.1968 లో గాంధీ శతజయంతి ఉత్సవాలకు నివాళులు అర్పిస్తూ సెయింట్ పాల్ కెథడ్రల్ ల్లో గానం చేసిన తొలి భారతీయమహిళగా గుర్తింపుపొందారు.నార్వే,స్వీడన్ ,స్పెయిన్ ,కెనడా,అమెరికా వంటిదేశాలలోసంగీతశిక్షణాలయాలు స్ధాపంచి వందలమంది కళాకారులకు శిక్షణ యిచ్చారు.అమెరికా బ్రాడ్ వే ధియోటర్లొ విశ్వకవి రవీంద్రుని'కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్ 'నాటకంలో రాణి పాత్ర ధరిచి బ్రడ్వే అవర్డు పొందిన తొలి భారతీయు రాలుగా గుర్తింపు పొందారు.అమెరికా ప్రభుత్వం కొలంబియా విశ్వవిధ్యాలయంలో బోధకురా లుగానియ మించింది.1961 లోఅమెరికా లో' OBPE'అవార్డు అందుకున్నారు.లండన్ ల్ స్థిరపడి అక్కడి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చిత్రకారుడు'హెరాల్డ్ ఎల్విన్ ' గారిని వివాహంచేసుకున్నారు.ప్రాచ్య,పాశ్యాత్య నృత్య సంగీతాలకు మధ్య సుహృద్బావ సేతువుగా అంతర్జాతీయ కీర్తినిపొందినఈమె 1985 లో తనజీవిత భాగస్వామిని కోల్పోయారు.తనశేషజీవితాన్ని జీవితాన్ని వ్యాధి గ్రస్తుల సేవలో గడిపిన మన ఈతెలుగు కీర్తి శిఖరం 2005ఏప్రిల్ 24 న కళామతల్లి వీణావాణి పాదసేవకై అంబర వీధిన పయనించారు.

మరిన్ని వ్యాసాలు

సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం
Vikarnudi patra ouchityam
వికర్ణుడి పాత్ర ఔచిత్యం
- సి.హెచ్.ప్రతాప్
సిని నారదులు.12.
సిని నారదులు.12.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు .11.
సిని నారదులు .11.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు