''నీతిమాలినవాళ్ల నీతికథలు'' రెండో భాగం - జాలాది రత్న సుధీర్

''నీతిమాలినవాళ్ల నీతికథలు''  రెండో భాగం

The X - Ray Man ఇంగ్లీష్ నవల రాసి తెలుగు ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రచయిత మోహన రావు దురికి రాసిన ''నీతిమాలినవాళ్ల నీతికథలు'' ఎంతటి సంచలనం రేపిందో తెలుగు పాఠకులకు తెలిసిందే.

వాస్తవ కథలతో విసిగిపోయి సెల్ ఫోనికి అతుక్కుపోయిన తెలుగు పాఠకుడికి  'అతివాస్తవ కథల'తో కొత్త ప్రక్రియను చేపట్టిన  మోహన రావు దురికి  -  ''నీతిమాలినవాళ్ల నీతికథలు'' రాసి సంచలనం సృష్టించారు. అందుకే  మోహన రావు దురికి  రాసిన ''నీతిమాలినవాళ్ల నీతికథలు''39 కథల తోలి సంకలనం కేవలం ఆరు నెలల్లో పది వేల కాపీలు అమ్ముడుపోయి కొత్త రికార్డ్ సృష్టించింది. మీడియాలో వైరల్ గా మారింది. నమ్మాలని పించడంలేదుగా. ఐతే అతి చిన్న movingmovies.com లో వేసిన ఒక ఆర్టికల్ ఒక్క ఏడాదిలోనే 37 వేలమంది వీక్షించారు . కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి.

అందుకే ఎమెస్కో వాళ్ళు వెంటనే  ''నీతిమాలినవాళ్ల నీతికథలు'' పార్ట్ 2 నీ 20 కథలతో  మార్కెట్ లోకి వదిలారు. ఇవి కూడా 'అతివాస్తవ' కథలు.

అసలు వాస్తవ కథలకు - అతివాస్తవ కథలకుగల తేడా ఏమిటో తెలుసుకోవాలంటే - మోహన రావు దురికి మాటల్లోనే వినాలి అనుకుంటే NTN NEWS channel జరిపిన ఇంటర్వ్యూ కోసం https://www.youtube.com/watch?v=FADtYpTy-J8
క్లిక్ చేయండి.

తెలుగు సాహిత్యంలో 'అతివాస్తవ కథల'తో సంచలనం లేపిన మోహన   రావు దురికి  ''నీతిమాలినవాళ్ల నీతికథలు'' రెండో భాగం పుస్తకంలో 20 కథలు ఉన్నాయి. ఏ కథకు ఆ కథ ప్రత్యేకతను సంతరించు కున్నాయి. అందులో మచ్చుకు ''జననం ఎంతటి నరకం?'' కథ తీసుకుందాము.

శిషువు అప్పుడే పుట్టింది.
ఆ తల్లి మురిసిపోతూ సూట్లో ఉన్న వాడిని చూపుతూ
 ''డాడీని చూడు కన్నా'' అన్నది. 
ఇంకా కళ్ళు తెరవని శిషువు కళ్ళు తెరిచి సూట్ వాలాను చూసింది.                                                                                                                  
ఎలాంటి ఫీలింగ్ కలగలేదు.                                                                                                                                                                          
 కానీ ఆ బిడ్డకు డైపర్ తెచ్చి వినయంతో దూరంలో నిలుచుకున్న 
డ్రైవర్ ని చూడగానే శిషువు సంతోషించింది. ఆ డ్రైవర్ తన తండ్రి అనే భావన కలిగింది.                                                                                            
శిషువు కెవ్వున ఏడ్చింది. అందరు నవ్వారు. 
ఆ తల్లి  రొమ్ము పెట్టి శిషువు  నోరు మూసింది. 
తల్లి వాస్తవం - తండ్రి నమ్మకం - 
అందుకే ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియని దేవా రహస్యం గురించి రాసిన కథ. నాకు తెలిసి ఇలాంటి కథలు తెలుగు సాహిత్యం చవిచూడలేదు. 
 ''ఎవనిచే మారణించు'' మరో కథ తీసుకుంటే - 
మనకు నిజాలు తెలియకపోయినా పరవాలేదు -కానీ మనం అబద్దాలను నమ్మకుండా ఉంటే చాలు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చావు - శశికళ జైలు ఉదంతం వెనకున్న రహస్యాల ప్రేరణపొంది - కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరిగే క్రైమ్ మాఫియా మీద  అంతర్జాతీయ ప్రమాణాలతో రాసిన కథనే 'ఎవనిచే మారణించు'. ఇది వాస్తవంగా గరిగింది.. కానీ మోహన రావు దురికి 'అతివాస్తవంగా' రాసి మనకు పచ్చి నిజాలను కథ రూపంలో అందించారు.

''ప్రేమ వ్యాపారం '' కథ చదివాకా ఓ గంట వరకు మామూలు మనుషులము కాలేము. 
లంచం ముసుగులో నీతిని  అమ్ముకుంటే ఓ రేట్ ఉంటుంది. 
వ్యభిచారం దుప్పట్లో ఒళ్ళు అమ్ముకుంటే మరో రేట్ ఉంటుంది. 
మరి చేట్ల పొదల చాటున ప్రేమను  అమ్ముకుంటే రేటెంత? 
అసలు ప్రేమను ఎలా అమ్ముకుంటారు? 
ఆ వ్యాపారం ఎలా సాగుతుంది? 
ఊపింది బిగపట్టి చదివించే శిల్పం, నరాలు బిగుసుకునే శైలి, ఎవ్వరు ఊహించని మలుపు, మనకు తెలిసిన కొత్త నీతిని - కొత్తగా చెప్పే విధానం అద్భుతం, అంతకు మించి  అంతర్జాతీయ ప్రమాణాలతో రాసిన 20 కథలు ''నీతిమాలినవాళ్ల నీతికథలు'' - రెండో భాగంలో  ఉన్నాయి.

''నీతిమాలినవాళ్ల నీతికథలు'' పార్ట్ 2 E-BOOK కోసం

https://kinige.com/book/Neetimalina+Valla+Neeti+Kathalu+2

లేదా కథలు విడిగా చదవాలనుకుంటే https://www.kahaniya.com/s/udayam-leni-rathri-3379

వాస్తవకథలకు - అతివాస్తవ కథలకుగల తేడా ఏమిటో తెలుసుకోవాలంటే - NTN NEWS channel జరిపిన ఇంటర్వ్యూ నా కోసం https://www.youtube.com/watch?v=FADtYpTy-J8

క్లిక్ చేయండి.