రంగస్థలం తీయడానికి మెగాస్టార్ ఒప్పుకోలేదంట..! - Dinesh

రంగస్థలం తీయడానికి మెగాస్టార్ ఒప్పుకోలేదంట..!

**రంగస్థలం-ఇది కంటెంట్ ఉన్న సినిమా* సూపర్ హిట్లు, బ్లాక్ బాస్టర్లు, అయ్యే సినిమాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి... కానీ చిన్న,పెద్ద,ముసలి,ముతక, ఇలా అందరినీ అలరించే సినిమా ఏ పది సంవత్సరాల కో ఒకటి వస్తుంది. అయితే...2018 లో రిలీజ్ అయిన రంగస్థలం హిట్ టాక్ ని తెచుకోవడమేగాక విపరీతంగా ప్రజాదరణ పొందింది కమర్షియల్ జోనర్ లో ఒకే రకమైన సినిమాలు చూసి చూసి విసిగిపోయిన తెలుగు ఆడియన్స్ ఒక కొత్త కధ కోసం తీవ్రంగా వేచి చూస్తున్నారు... అలాంటి టైమ్ లో మన సుకుమార్ ఒక village drop స్క్రిప్ట్ తో రాంచరణ్ ని ఒప్పించి తీరా పట్టాలెక్కించేటప్పుడు ...అసలే గ్రామీణ వాతావరణం ఉండే సినిమా అందులోనూ హీరో కి చెవుడు అంటున్నావు వర్కౌట్ అవుతుందా అని చిరంజీవి గారు అడిగినా...నాకు పూర్తి నమ్మకం ఉంది సర్..!అని సుకుమార్ చెప్పి ఒప్పించారు... చివరికి షూట్ అంతా.. ముగించుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ మాట్లాడుతూ...మూవీ కి మేజర్ ప్లాట్(కుమార్ బాబు చనిపోవడం) ని లీక్ చేసేసారు... డైరెక్టర్ సుకుమార్ తో సహా మొత్తం యూనిట్ అంతా షాక్...అందరూ అబ్బా అనుకున్నారు... దానితో చాలా మందికి స్టోరీ అర్థమైపోయింది. ఏదైతేనేం...సినిమా రిలీజ్ అయింది... మొదటి రెండు రోజులు సినిమా పోసిటివ్ టాక్ తో బాగానే ఆడిన...తర్వాత ఏ హాల్ చూసిన హౌస్ ఫుల్ బోర్డు లే...ఇది.. కంటెంట్ ఉన్న మూవీ దెబ్బ అంటే అనుకున్నారు అంతా... అయితే నేను మా తముడు కూడా మార్నింగ్ షో కె వెళ్ళేం ఫస్ట్ ఆఫ్ అంత చూసాం చాలా బావుంది కదా...ఆ కామెడీ,పాటలు అనుకున్నాం సెకండ్ఆఫ్ స్టార్ట్ అయింది ఆది చనిపోయే సీన్ కంట్లో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి ...సినిమా క్లైమాక్స్ కి వచ్చింది జగపతిబాబు ని కర్ర తో కొట్టే సీన్ అయితే అదిరిపోయింది ధియేటర్ లో... చంద్రబోస్ లిరిక్స్ తో DSP కొట్టిన మ్యూజిక్..అయితే సినిమా కి పెద్ద ప్లస్ పోయింట్ దానికి తోడు గా రత్నవేలు తన సినిమాటోగ్రఫీ తో ఎదో మ్యాజిక్ చేసేసాడు... ఈ సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరూ నేను మాత్రమే చూస్తే సరిపోదు మా ఫ్యామిలీ మొత్తం చూడాల్సిందే అని అనుకున్నారు...ఒకప్పుడు బాలీవుడ్ లో తుఫాన్ మూవీ చూసి ...రాంచరణ్ కి అసలు యాక్టింగ్ రాదని అన్నారు ఒక క్రిటిక్.. అదే..క్రిటిక్ రంగస్థలం సినిమా చూసి రాంచరణ్ యాక్టింగ్ అద్భుతం అనడమే కాకుండా ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వరకు వచ్చి మరీ చరణ్ ని కలిసి వెళ్లారు... ఈ సినిమా కి ప్రతి ఒక్కటి ఇదే..స్థాయి లో కుదరబట్టే సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యి 120 కోట్ల కు పైగా కలెక్ట్ చేసింది... అయితే ఈ మా టీవీ లో cd అరిగిపోయేలా వేసినా..చూసే ఆడియన్స్ మాత్రం తగ్గట్లేదు... Example కి :-- మా అమ్మమ్మ కి 75 years ఆమె ధియేటర్ లో ఈ మూవీ చూడలేదు కానీ tv లో ఎప్పుడు వచ్చినా అసలు మిస్ కాదు... అలా చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వల్ల వరకు ఈ సినిమా అందరిని ఒక ఊపు ఉపేసింది...ఇలాంటి మూవీ ని ఎంకరేజ్ చేయడం లో తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటారు అని నిరూపించుకున్నారు....👏🏻