ఘజని మహమ్మద్ దండయాత్రను నిరోధించిన రాజు - ambadipudi syamasundar rao

ఘజని మహమ్మద్ దండయాత్రను నిరోధించిన రాజు

సుహాల్ దేవ్ పాసి  అనే పేరు చాలా మందికి తెలియక పోవచ్చు కానీ భారతదేశము మీద 17 సార్లు దండెత్తి దేశాన్ని దోచుకున్న ఘజని పేరు మనము చరిత్ర పాటాల  ద్వార ఇప్పటికి తెలుసుకుంటూనే ఉంటాము. అటువంటి మొహమ్మద్ ఘజనిని ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ లోని అవధ్ ప్రాంతానికి రాకుండా 20 సంవత్సరాలునిరోధించిన మహా వీరుడే  సుహేల్ దేవ్ పాసి అనే రాజు దురదృష్ట వశాత్తు మన చరిత్రలో అటువంటి వీరుడి చరిత్ర చెప్పకుండా ఒక విదేశ దురాక్రమణ దారుడు ఘజని చరిత్ర చెప్పుకుంటున్నాము.అదే మన భావ దరిద్రము ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అంటే ఈ వీరుడి చరిత్ర ఈ రోజున ఇరాన్ వాళ్ళ చరిత్ర పుస్తకాలలో ( రచయిత అబూ ఉర్ రెహమాన్ రచించిన  మిరాత్ -ఇ -మసుది అనే సలార్ మసూద్ జీవితచరిత్ర) కనిపిస్తుంది ఈపుస్తకాన్ని మొఘల్ చక్రవర్తి జెహాంగీర్ కాలములో రచించాడు  20వ శతాబ్దము నాటికి మన భారతీయులు కళ్ళు తెరిచి అయన చరిత్రను తెలుసుకొనే ప్రయత్నాలు చేశారు  కొంతైన అయన మరుగున పడిన చరిత్ర తెలుసుకొనే ప్రయత్నము  చేద్దాము. ఈయన సాధించిన ఘన  విజయము ఘజనిని నిరోధించటమే కాకుండా ఘజని మేనల్లుడు ఘజని సైన్యాధిపతి అయిన  ఘాజి సలార్ మసూద్ ను ఇతర ఐదుగురు సేనానులను క్రి. పూ 1034 లో జరిగిన  బహరైక్ యుద్దములో చంపి ఘజని సైన్యానికి అపార నష్టము కలుగ జేసి ఓడించిన మహా వీరుడు.ఘాజి సలార్ మసూద్ మొదట ఢిల్లీకి చెందిన రాజా మహిపాల్ తోమర్ తో తలపడ్డాడు ఘజని సమయానికి సహాయము చేయటము వలన ఆ యుద్ధము గెలిచి అక్కడి నుండి మీరట్ వైపు తన యాత్ర సాగించాడు అక్కడి రాజు రాజా హరి డాట్ లొంగిపోయి ఇస్లామ్ మతాన్ని స్వీకరించాడు అక్కడి నుండి మసూద్ కనౌజ్ వైపు తన దాడిని ప్రారంభించాడు కనౌజ్ కూడా మసూద్ కు లొంగిపోయింది మసూద్ కనౌజ్ ను తన సామ్రాజ్య వ్యాప్తికి సైనిక స్థావరంగా అవధ్ పూర్వాంచల పై దాడికి వాడుకున్నాడు అప్పుడే సుహేల్ దేవ్ మసూద్ ను ఘజని సైన్యాలను అవధ్ ప్రాంతములోకి చొరబడకుండా 20 ఏళ్ళు నిరోధించాడు
సుహేల్  దేవ్ పాసి అనే రాజు నేడు ఉత్తర ప్రదేశ్ లో దళితులు గా పిలవబడే పాసి కులానికి చెందినవాడు అయినప్పటికీ ఆ నాటి కాశీ లోని బ్రాహ్మణులచే ఇంద్రుడి అవతారంగా కొలవబడిన ధర్మాత్ముడుగా పేరు గాంచాడు సుహేల్ దేవ్ శ్రవస్థి రాజైన మొరధ్వజ్ పెద్ద కుమారుడు సుహేల్ దేవ్ సాకర్ దేవ్, సహారా దేవ్ ఇలా రకరకాల పేర్లతో ప్రసిద్ధి చెందాడు.మహమ్మద్ ఘజని మేనల్లుడైన ఘాజి సలార్ మసూద్ 16 ఏళ్ల వయస్సు లో ఘజని తో పాటు సింధు నదిని దాటి భారతదేశానికి యుద్దానికి వచ్చి ముల్తాన్, ఢిల్లీ,మీరట్ చివరగా సాత్రిక్ లను జయించి సాత్రిక్ లో స్థావరం ఏర్పరచుకొని సైన్యాలను స్థానిక రాజ్యాలను ఓడించటానికి పంపాడు పిన్న వయస్సులోనే మసూద్ మంచి సైన్యాధ్యక్షుడిగా పేరు సంపాదించాడు. మసూద్  సయ్యద్ సైఫుద్దీన్ మరియు మియాన్ రజ్జబ్ లను బహరైక్  కు పంపాడు స్థానిక రాజులు కొంతమంది సంఘటనగాఏర్పడి ఎదుర్కొన్నారు కానీ మసూద్ తండ్రి ఘాజి సలార్ సాహు నాయకత్వములోని సైన్యము వారిని ఓడించింది. అయినప్పటికీ ఆ సంఘటనలోనివారు దురాక్రమణదారులను ఎదుర్కొంటూనే ఉన్నారు పరిస్థితిని తెలుసుకోవటానికి క్రీపూ 1033 నాటికి మసూద్ స్వయముగా బహరైక్ వచ్చాడు ఆ దాడులలో మసూద్ శత్రువులపై వరుస విజయాలను సాధించాడు చివరికి సుహాల్ దేవ్ సైన్యము వచ్చి మసూద్ సైన్యాలను ఓడించి మసూద్ ను యుద్దములో చంపారు.
మసూద్ ను అక్కడే సమాధి చేసి ఆ స్థలములో అయన జ్ఞాపకార్థముగా ఒక దర్గా నిర్మించారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాదన ప్రకారము ఆ దర్గా కట్టిన చోటు ఒక హిందూ సన్యాసి బాలార్క రిషి ఆశ్రమము ఉండేది ఆ ఆశ్రమాన్ని ఫిరోజ్ తుగ్లక్ దర్గా గా మర్చాడు అని చెపుతారు.సుహేల్ దేవ్ ను ఓడించటానికి ఘజని వాడిన ట్రిక్ భారతములో భీష్ముని చంపటానికి అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకున్నట్లుగా ఘజని గోవులను అడ్డుపెట్టుకున్నాడు సుహేల్ దేవ్ కు గోవుల పట్ల అమితమైన భక్తి ప్రపత్తులు ఉండటంవలన సైనికులు వేసిన బాణాలకు గోవులు చనిపోతాయని బాణాలు వేయనివ్వలేదు అందుచేత ఘజని సైన్యము సుహేల్ దేవ్ ను సమీపించి సుహేల్ దేవ్ ను ఓడించగలిగాయి.
అలెగ్జాన్డర్ కన్నింగ్ హమ్ అనే చరిత్రకారుడు గొండు ప్రాంతానికి చెందిన తరు రాజుల వంశక్రమాన్నిఅంటే సుహేల్ దేవ్ కుటుంబము గురించి  తెలియ జేశాడు దాని ప్రకారము మయూరధ్వజ క్రీపూ 900, హంస ధ్వజ క్రీపూ 935, మకర ధ్వజ క్రీపూ 950 , సుధాన్య ధ్వజ క్రీపూ 975, సుహేల్ దేవ్ క్రీపూ 1000 ప్రాంతానికి చెందినవారు.రకరకాల కులలా వారు సుహేల్ దేవ్ తమవాడిగా చెప్పుకోవటానికి తాపత్రయపడ్డారు. కానీ మిరాత్ ఎ మసుడి అనే చరిత్రకారుడు సుహేల్ దేవ్ బార్ తరు అనే తెగకు చెందినవాడని పేర్కొన్నాడు. తరువాతి చరిత్రకారులు ఆ తెగను వేరు వేరు ప్రాంతాలలోని తెగలుగా పేర్కొన్నారు ఉదాహరణకు బార్ రాజపుట్ ,రాజభర్ ,బైస్ రాజపుట్ పాండవ వంశీ తోమర్ ,నాగవంశీ క్షత్రియ మొదలైనవి
1940 లో గురు సహాయ్ దీక్షిత్ ద్విజి దీన్ అనే ఒక స్కూల్ టీచర్ తానూ రచించిన ఒక పెద్ద పద్యములో ఆర్య సమాజ్ ప్రేరణతో సుహేల్ దేవ్ ను జైన్ రాజుగాను హిందూ ధర్మ పరిరక్షకుడిగాను అభివర్ణించాడు. ఈ పద్యము బాగా పాపులర్ అయ్యింది ఈ పద్యము యొక్క అచ్చు ప్రతి మొదటిసారిగా 1950 లో వెలుగులోకి వచ్చింది.ఆ విధముగా ఆర్యసమాజ్, రామ రాజ్య పరిషద్ హిందూ మహాసభ సంఘటన వంటి సంస్థలు సుహేల్ దేవ్ ను హిందూమతానికి నాయకుడిగా అభివర్ణించారు. ఈ సంస్థలు సలార్ మసూద్ దర్గా వద్ద ఒక ఉత్సవాన్ని రాజు స్మారకార్ధము నిర్వహించాలని తలపెట్టారు కానీ దర్గా కమిటీ లోని సభ్యుడు ఖ్వాజా ఖలీల్ అహమద్ షా జిల్లా యంత్రాంగానికి అటువంటి ఉత్సవాల నిర్వహణ మతకలహాలు దారి తీస్తుంది వద్దని విజ్ఞప్తి చేయటంతో ఆగింది. కానీ స్థానిక హిందూ నాయకుల ఆ ఆర్డర్ కు వ్యతిరేకముగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు అరెస్టులు అల్లర్ల జరిగినాయి. సుమారు 2000 మంది అరెస్ట్ అయినారు చివరికి జిల్లా యంత్రాంగము నిషేదాజ్ఞలు సడలించారు.
సుహేల్ దేవ్ స్మారక సమితి ఏర్పడి సుహేల్ దేవ్ కు గుడి కట్టాలని తీర్మానించగా ప్రయాగపుర్ సంస్థానాధీశుడు ఆ గుడికి 500 బిగాల భూమిని దానము ఇచ్చాడు ఆ స్థలము లోనే చిత్తోరా సరస్సు కూడా ఉంది. ఆ దేవాలయము సుహేల్ దేవ్ కు అంకితము చేయబడింది.
1950 -60 మధ్యకాలములో స్థానిక రాజకీయనాయకులు సుహేల్ దేవ్ ను పాసి (దళిత) రాజుగా చెప్పుకుంటూ దళితుల వోట్లకోసము ప్రచారము చేయటము మొదలు పెట్టారు ఆ విధముగా సుహేల్ దేవ్ ఆ ప్రాంతములో అధికముగా గల దళితులు (పాసి) ల ఓట్ల కోసము రాజకీయ నాయకులు వాడుకోవటం ముమ్మరం చేశారు మొదటిసారిగా బహుజన్ సమాజ్ పార్టీ ఆ తరువాత బిజెపి ఇతర పార్టీలు దళితులను ఆకర్షించుకోవటానికి సుహేల్ దేవ్ నామ జపము చేయటము మొదలు పెట్టారు.1980 నుండి ఇంచుమించు అన్ని పార్టీలు సుహేల్ దేవ్ రకరకాల ప్రోగ్రాము లను నిర్వహిస్తూ దళితుల ఓట్లను ఆకర్షించాయనికి ప్రయత్నాలు చేశారు. 2002 లో సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ స్థాపించబడింది.ఆ విధముగా మరచి పోయిన వీరుడిని 1960 నుండి అన్ని పార్టీలు రాజకీయ లబ్ది, అంటే దళితుల ఓట్ల కోసము వాడుకోవాటము మొదలు పెట్టారు ఇంకా వాడుకుంటున్నారు
2016లో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సుహేల్ దేవ్ విగ్రహాన్ని బహరైక్  లో ఆవిష్కరించాడు 2017లో యుపి ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాధ్ హిందూ విజయ్ ఉత్సవ్ నిర్వహించి బహరైక్ లో సుహేల్ దేవ్ స్మారక స్తూపాన్ని నిర్మించటానికి ఒప్పుకున్నాడు. డిశంబర్ 2018లో ప్రధాని నరేంద్ర మోడీ సుహేల్ దేవ్  స్మారక చిహ్నముగా పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. జూన్ 2019 లోసుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు  ఓం ప్రకాష్ రాజ్ బర్ ఘాజీపూర్ జిల్లాలో ఇండోర్ గ్రామములో సుహేల్ దేవ్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు ఆ విధముగా చాలాకాలము తరువాత సుహేల్ దేవ్ ను గుర్తుకు తెచ్చుకొని అయన గౌరవార్థము విగ్రహాలు మొదలైనవి ఆవిష్కారించారు మన రాజకీయ పెద్దలు అంతా ఓట్ల రాజకీయములో ఆ ప్రముఖుడి పేరు గుర్తుకు వచ్చింది ఏది ఏమైనప్పటికి అతి కీలకమైన యుద్దములో ఘజని మేనల్లుడైన ఘాజి సలార్ మసూద్ ను చంపినా యోధుడుగా దాదాపు 20 ఏళ్ళు ఘజనిని నిరోధించిన యోధుడిగా రాజా సుహేల్ దేవ్ పాసి  చరిత్రలో నిలిచిపోయినాడు.
అంబడిపూడి శ్యామసుందర రావు .