అమ్మ - చంద్ర శేఖర్ కోవూరు

అమ్మ అమ్మ గురించి తెలియనివారు ఎవరుంటారు... అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే..... ప్రతి మనిషి జీవితం ఆరంభం ఐయ్యేది అమ్మతోనే.... అమ్మ తర్వాతే ఏదయినా.. మన జీవితమే అమ్మా... పుడుతూనే చూసే మొట్ట మొదటి దేవత అమ్మా.. నమ్మకానికి నిదర్శనం అమ్మా.. అమ్మ కోపం క్షణికం.. అమ్మ ప్రేమ అనంతం... మన మొదటి గురువు అమ్మ.. మన మొదటి స్నేహం అమ్మతోనే.. మనం మొదటిసారి వినే మధురమైన సంగీతం అమ్మ పాడే లాలి పాట... జోలపాట.... దేవుడు మనతో ఉండలేక అమ్మని మనకిచ్చారంటారు, కానీ ఆదేవుడికే తెలీదు, తనకంటే గొప్పదైన ఒక ప్రేమమూర్తిని మనకి అందిస్తున్నాడని... అమ్మ శ్రమ నిరంతరం ఒక ప్రవాహంలా బిడ్డలకోసం సాగుతూనే ఉంటుంది.. తన చివరి శ్వాస వరకు బిడ్డలకు ఇంకా ఎదో చేద్దాం, ఇంకేదేదో చేద్దాం అనే తపన ఒక్క అమ్మలోని ఉంటుంది... తనను ద్వేషించినా కూడా, ప్రేమించేది అమ్మ మాత్రమే.. అమ్మ ప్రేమ ఈ విశ్వమంతా, అందులో మనమెంతా అమ్మ చేతి గోరుముద్దలు తిన్న రోజులు... అమ్మతో దాగుడుమూతలు ఆడుకున్న రోజులు.. అమ్మని ఆట పట్టించిన రోజులు.. అమ్మ ఒడిలో నిదురించిన రోజులు... నాన్న భయంతో అమ్మ కొంగు చాటున దాక్కున్నా రోజులు... ఇంతటి అందమైన మధురమైన బాల్యాన్ని ఎవరు మరిచిపోగలరు... ఏ బంధంలో ఐన ధనిక-బీద, గొప్పా-తక్కువ అనే భేధాలుంటాయేమో కానీ, తల్లి ప్రేమలో మాత్రం అందరూ సమానమే... ఆకలైనపుడు అనేది అమ్మా... దెబ్బతగిలినపుడు అనేది అమ్మా... ఆరోగ్యం బాగాలేనపుడు అనేది అమ్మ... ఒంటరితనంలో అనుకునేది అమ్మ... కంటికి రెప్పలా కాపాడేది అమ్మా... ప్రాణానికి ప్రాణం ఇచ్చేది అమ్మ... తన ఆకలి మరిచి మన ఆకలిని తీర్చేది అమ్మా... మనల్ని ప్రపంచమంతా వెలి వేసినా, తన అక్కున చేర్చుకునేది అమ్మా... దుర్మార్గులైన బిడ్డలని కూడా ప్రేమించగలిగేది అమ్మ మాత్రమే... ప్రతిఫలం ఆశించని ప్రేమ అమ్మ ప్రేమ ... ఎవరు మరిచిపోలేని బంధం అమ్మా... మన ఊపిరే అమ్మా... అమ్మ జీవితమంతా రాసిచ్చిన మనకి సరిపోదేమో కానీ (అమ్మ ఎంత చేసిన ఇంకా అది చేయలేదు ఇది చెయ్యలేదు అనుకునేవాళ్లు కూడా ఉన్నారు), మనం ఇచ్చే చిన్ని చిన్ని కానుకలను, ఎంతో గొప్పగా, సగర్వంగా, ఆనందంగా మనస్ఫూర్తిగా స్వీకరించే గొప్ప మనస్సు అమ్మకు మాత్రమే ఉంది. ఈ భూప్రపంచంలో శాశ్వతమైంది అమ్మ ప్రేమ ఒక్కటే..... ఇలా చెప్పుకుంటూ పోతే ఏమని చెప్పను యెంతని చెప్పను ...అసలు అమ్మ గురించి చెప్పటానికి అక్షరాలు మాటలు సరిపోతాయా...... 🌺అమ్మ ప్రేమ కు అంతం లేదు🌺

మరిన్ని వ్యాసాలు

బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మీకు తెలియని నాటి నట,గాయని
మీకు తెలియని నాటి నట,గాయని
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
తెలుగు సినీ కృష్ణుడు రఘరామయ్య.
తెలుగు సినీ కృష్ణుడు రఘరామయ్య.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గాయని రమోలా.
గాయని రమోలా.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Paata
పాట
- M chitti venkata subba Rao