కాగితం - చంద్ర శేఖర్ కోవూరు

కాగితం కాగితం విలువ చెప్పాలంటే మాటలు సరిపోవు.. తరతరాలుగా మనిషి జీవితంలో కాగితం పాత్ర అద్భుతం. ఎన్నో తరాలు పోయినా, తరాలు మారినా , ఇప్పటికీ కాగితం విలువ మారలేదు. జీవన గమనానికి కరెన్సీ కాగితం. బ్యాంకు లావాదేవీలుకు చెక్కు కాగితం. ప్రయాణానికి టికెట్ కాగితం. ఇతర దేశాలకు వెళ్ళాలంటే పాస్ పోర్టు కాగితం. ప్రేమలేఖకు తెల్ల కాగితం. పెళ్ళికి శుభలేఖ కాగితం. పెళ్లి సర్టిఫికెట్ కాగితం. జనన మరణ ధ్రువీకరణ కాగితం. చదువుకు నోటుబుక్ కాగితం. పరీక్షలుకు తెల్లకాగితం. దేశ భవిష్యత్తుకు ఓటు కాగితం. అప్పుకు ప్రామిసరీ కాగితం. అస్తిపాస్తులకు దస్తావేజు కాగితం. పిల్లలు ఆడుకొనే గాలిపటం కాగితం. నీటిలో వదిలే పడవ కాగితం. ఉద్యోగంలో చేరాలంటే అపాయింట్మెంట్ కాగితం. ఉద్యోగంలో నుండి తీసెయ్యాలంటే టెర్మినేషన్ కాగితం. చివరకు మనం ఫలానా అని తెలిపేది కూడ ఐడి ప్రూఫ్ కాగితం. ఇలా చెప్పుకుంటూ పోతే కాగితం విలువ లేనిది కాదు, చాలా విలువైనది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి జీవితంలో కాగితం అనేది ఒక భాగం... అందుకే నా మనస్సు అనే తెల్ల కాగితంలో కాగితం విలువ గురించి ఇలా నింపాలనుకున్నా!!!