ప్రపంచము లో చరిత్ర సృష్టించిన వైద్యులు - ambadipudi syamasundar rao

ప్రపంచము లో చరిత్ర సృష్టించిన వైద్యులు

ప్రాణాలు కాపాడే వైద్యుడు ఎంత ముఖ్యమో విడిగా చెప్పనవసరం లేదు వైద్యుడి ప్రాముఖ్యతను గుర్తించిన మన పెద్దవాళ్ళు"వైద్యో నారాయణ హరి" అంటారు అంటే దేవుడితో సమానము అని. రోగాల సంఖ్య  అలాగే కొత్తగా వచ్చిన కరోనా వంటి రోగాల సంఖ్య పెరుగుతూ ఉండటం వలన సమాజములో వైద్యుల అవసరము చాలా పెరుగుతూనే ఉంది మనము రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాము ఎంతో మంది డాక్టర్లు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రోగులకు వైద్యము చేయటాన్నివింటూనే వున్నాము సాధారణ పౌరుడికి అనారోగ్యముగాఉన్నప్పుడు వైద్యుడు దేవుడిలాగా ఆసుపత్రి దేవాలయము లాగ కనిపిస్తాయి. కానీ ప్రస్తుతము వైద్యరంగము లో వ్యాపార ధోరణులు బయలు దేరటము వలన డాక్ట్రలు సంపాదనే ధ్యేయముగా రోగులకు వైద్యము అందివ్వటం మనము చూస్తూనే ఉన్నాము టాగోర్ లాంటి సినిమాలు కూడా వచ్చినాయి ఇది నేటి పరిస్థితి కానీ పాత రోజుల్లో వైద్యులు సేవాభావంతో రోగులకు వైద్యము అందించేవారు మన ఆయుర్వేదంలో ధన్వంతరి చరకుడు, సుశ్రుతుడు వంటి వైద్యులు ఉన్నారు.అటువంటి వైద్యులు ప్రపంచములో ఏదేశస్తులైన వారు చరిత్రలో వారు అందించిన సేవల వల్ల చిరస్థాయిగా నిలిచిపోయినారు అటువంటి కొంతమంది వైద్యుల గురించి తెలుసుకుందాము.
1. ఎడ్వర్డ్ జన్నర్ :- ఈయన ఇంగ్లండ్ కు చెందిన డాక్టర్ మరియు శాస్త్రవేత్త.ఈయన మొదటిసారిగా మసూచి (స్మాల్ పాక్స్)వ్యాధి  చికిత్సలో ఆ వ్యాధి రాకుండా వ్యాక్సినేషన్ (టీకాల ప్రక్రియ) ను డెవలప్ చేసిన వ్యక్తి. కాబట్టి ఈయనను ,"ఫాదర్ ఆఫ్ ఇమ్మ్యునాలజీ"అని పిలుస్తారు ఈయన 1749, మేఁ  17 న గ్లాసెస్టర్ షైర్ ప్రాంతములోని బర్కీలీ లో జన్మించాడు ఈ టీకాల ప్రక్రియ ద్వారా ఏ మానవుడు రక్షించలేని మనుష్యులను కాపాడిన ఘనత దక్కించుకున్న వ్యక్తిగా చరిత్రలో పేర్కొంటారు. 18 వ శతాబ్దములో ఉదృతముగా ఉన్న మసూచిని వ్యాధిని ఈ కొత్త ప్రక్రియ ద్వారా ఎదుర్కొన్నాడు. ఈ ప్రక్రియను ఎలా కనుగొన్నాడు అంటే ఈయన పాలు పొసే ఆడవారికి ఈ వ్యాధికి రాకపోవటం వారిలో కౌఫాక్స్ అనే వ్యాధి రావటము( ఎక్కువగా ఆవులతో మెలగటం వలన) గమనించాడు. కాబట్టి ఆడవారు కౌ ఫాక్స్ తో చేసిన యుద్ధము వలన వారిలో మసూచిని నిరోధించే శక్తి పెరుగుతున్నదని గ్రహించాడు  1796 మేఁ 14 న జన్నర్  కౌఫాక్స్ వ్యాధి పుండు నుండి ద్రవాన్ని గ్రహించి దానిని తన తోటమాలి ఎనిమిదేళ్ళ కుమారుడి చర్మము పై పూశాడు ఆ కుర్రవాడికి జ్వరము వచ్చి త్వరగానే తగ్గింది మళ్ళా జులై 1 న,  ఈయన ఆ కుర్రవాడికి ఈ టీకా, అలాగే ప్రతి సంవత్సరము టీకా ఇచ్చాడు. ఆ విధముగా ఆ కుర్రవాడిలో వ్యాధి నిరోధకత పెరిగి మసూచి వ్యాధి రాలేదు. ఆ విధముగా వాక్సినేషన్ ప్రక్రియ విజయవంతము అయింది యూరోప్ అంతటా మిగిలిన వైద్యులు కూడా ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. ఆ విధముగా మసూచి వల్ల సంభవించే మరణాల సంఖ్య గణనీయముగా తగ్గింది. ఆ తరువాతి శతాబ్దాలలో జన్నర్ విధానము ద్వారా వ్యాక్సినులు ఇతర ప్రమాదకర వ్యాధులను ఎదుర్కోవటానికి కనిపెట్టగలిగారు. 1970 నాటికి భూమి మీద నుండి మసూచి వ్యాధిని మాయము చేశారు.దీని ఎడ్వార్డ్ జన్నర్ను ఎంతైనా అభినందించవచ్చు.
2. అలెగ్జాన్డర్ ఫ్లెమ్మింగ్ :- పెన్సిలిన్ అనే సూక్ష్మజీవి నాశకము(యాంటీ బయిటిక్ ) ను కనిపెట్టిన శాస్త్రవేత్తగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వైద్యుడు ఫ్లెమ్మింగ్ 1881లో లోచ్ఫీల్డ్ ,స్కాట్లాండ్ లోజన్మించాడు ఫ్లెమ్మింగ్ మొదటి ప్రపంచ యుద్దములో ఆర్మీ మెడికల్ కార్ప్స్ లో క్యాప్టెన్ గా పని చేసాడు ఈ ప్రతిభ కలిగిన డాక్టరు ఎప్పుడు కూడా సహజమైన బ్యాక్టీరియాను చంపే యాంటీ సెప్టిక్ మరియు రక్తము పట్ల శ్రద్ద కనపరిచేవాడు ఈయన గాయాల ఇన్ఫెక్షన్ మరియు లైసోసోముల(కన్నీరు, మరియు ఉమ్మిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్) పై చేసిన పరిశోధనలు బ్యాక్టీరియాలజి ప్రపంచములో ఉన్నతమైన స్థానాన్ని కల్పించాయి.అలాగే ఈయన నుండి అనేక విషయాలు రావటానికి దోహద పడ్డాయి. 1928లో ఇన్ఫ్లుఎంజా వైరాస్ మీద ప్రయోగాలు చేస్తున్నప్పుడు పెన్సిలిన్ ను కనుగొన్నాడు.ఫ్లెమ్మింగ్ తన ప్రయోగాలు చేస్తూ స్టాఫీలో కాకస్ కల్చర్ ను ప్లేటులో ఉంచి మరునాడు గమనించినప్పుడు మోల్డ్ ఏర్పడటాన్ని చూసాడు. ఆ మోల్డ్ ను పరిశీలిస్తే ఆ  మోల్డ్ తన చుట్టూ బ్యాక్టీరియా ఫ్రీ వలయాన్ని తయారుచేసుకుంది అని తెలిసింది. ఆ తరువాత పరిశోధనలలో ఈ కల్చర్ స్టాఫీలోకాకస్ పెరుగుదలను 800 రేట్లు పలుచగా చేసినా నిరోధించింది అని తెలిసింది. అది పెన్సిలియం నోటాటం కుటుంబములోని భాగముగా గుర్తించాడు ఫ్లెమ్మింగ్ దీనిని మొదట్లో మోల్డ్ జ్యుసి అని ఆ తరువాత పెన్సిలిన్ అని పేరు పెట్టాడు ఆవిధముగా పెన్సిలిన్ మొట్ట మొదటి యాంటీ బయోటిక్ అయి డాక్టర్లచే విరివిగా రోగ నివారణకు ముఖ్యముగా బ్యాక్టీరియా పెరుగుదలను నివారించటానికి రెండవ  ప్రపంచ యుద్ధము కాలములో వాడబడింది.పెన్సిలిన్ మరియు ఇతర యాంటీ బయోటిక్స్ వైద్య రంగములో విప్లవాత్మక మార్పును తీసుకు వచ్చాయి.ఫలితముగా మిలియన్ల మనుష్యుల ప్రాణాలను వైద్యులు కాపాడగలిగారు.ఫ్లెమ్మింగ్ పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచి పోయింది
3. డేనియల్ హెల్ విలియమ్స్ :- .1893లో మొదటిసారిగా ప్రపంచములో గుండె శస్త్రచికిత్స చేసిన ఘనత దక్కించు కున్న వైద్యుడు డేనియల్ హెల్ విలియమ్స్. ఇతను ఒక బార్బర్ (మంగలి) కొడుకు జీవితాన్ని చెప్పులు తయారుచేసేవాడిగా ప్రారంభించి విద్య ఆవశ్యకత ను తెలుసుకొని  చదువు మొదలు పెట్టాడు చికాగో మెడికల్ కాలేజీలో చేరి 1883లో ఎన్నో కష్టాలు పడి  వైద్య శాస్త్రములో పట్టా పుచ్చుకున్నాడు. ఆ తరువాత విజయవంతమైన సర్జన్ గా మారాడు జులై 10, 1893 న మొదటిసారిగా విలియమ్స్ ప్రావిడెంట్ హాస్పిటల్ లో గుండెకు శస్త్రచికిత్స చేసాడు ఆ రోజుల్లో శస్త్రచికిత్స ద్వారా గుండె గాయాలకు వైద్యము చేయటము అనుమతించేవారు కాదు. కానీ విలియమ్స్ ఛాతిలో కత్తిపోట్లకు వైద్యము చేయటానికి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాడు ఈయన ఆట్టి రోగి యొక్క థొరాసిక్ కావిటీని రక్త మార్పిడి అవసరము లేకుండానే లేదా మత్తు మందు మరియు యాంటీ బయోటిక్స్ అవసరము లేకుండా తెరిచి ఆపరేషన్ చేసి పెరికార్డియం కు తగిలిన గాయానికి వైద్యము చేసి కుట్లు కుట్టివేసాడు ఆ రోగి ఆ శస్త్రచికిత్స తరువాత మరో 20 ఏళ్ళు ఆరోగ్యముగా బ్రతికాడు
4. జార్జెస్ మాతే :- ఈయన ప్రఖ్యాత ఆంకాలజిస్ట్(క్యాన్సర్ వ్యాధి చికిత్సలో నిపుణుడు) మొదటిసారిగా 1959లో బోన్ మ్యార్రో ట్రాన్స్ప్లాంట్ చేసిన వైద్యుడు ఈయన జులై 9, 1922న ఫరాన్స్ లోని సెర్మజెస్ లో జన్మించాడు. మొదటినుంచి బోన్ మ్యార్రో ట్రాన్స్ప్లాంట్ మీద ఆసక్తి కనబరిచేవాడు 1959లో 6 గురు యోగోస్లోవియా శాస్తరవేత్తలు ప్రమాదవశాత్తు న్యూక్లియర్ ప్లాంట్ లో రేడియేషన్ కు గురైనప్పుడు మొదటిసారిగా విజయ వంతముగా బోన్ మ్యార్రో  ట్రాన్స్ ప్లాంట్  చేయటము ద్వారా చరిత్ర సృష్టించాడు ఆరుగురిలో నలుగురు ఈ వైద్యము వల్ల బ్రతికారు ఈ విధముగా ఈయన ల్యుకేమియా వ్యాధికి ప్రయోగాత్మక చికిత్స ప్రవేశ పెట్టాడు నాలుగేళ్ళ తరువాత అంటే 1963లో డాక్టర్ మాతే ఈ చికిత్స ల్యుకేమియా రోగిని చికిత్స చేయాటానికి ఉపయోగిస్తుందని రుజువు చేసాడు. ఈ విధానములో రోగికి అధిక మోతాదులో క్యాన్సర్ మందులను ఇచ్చి రేడియేషన్ చేసి ల్యుకేమియా కణాలను నశింపజేసాడు. ఆ తరువాత రోజుల్లో బోన్ మ్యార్రో ట్రాన్స్ప్లాంట్ చికిత్స రేడియేషన్ మరియు సైకిల్ సెల్ అనీమియా  వంటి రక్తసంబంధిత జబ్బులను నయము చేయటానికి వాడారు
5. వర్జీనియా అప్గార్ :-ఈవిడ అమెరికన్ వైద్యురాలు మరియు మత్తు మందు నిపుణురాలు పరిశోధకురాలు ఆవిడా అప్గార్ స్కోర్ ను1952లో  డిజైన్ చేసి ప్రపంచ వైద్య రంగములో పేరు సంపాదించింది, ఇది నవజాత శిశువు తల్లి గర్భమునుండి వచ్చినాక మార్పులను తెలుసుకొనే ప్రామాణిక విధానము దీనిని మొదట ఈ పద్దతిని అంటే ఈ పరికరాన్ని తిరస్కరించారు ప్రస్తుతము అప్గార్ స్కోర్ నవజాత శిశువు పరిస్థితిని ఐదు సూక్షం పరిశీలనల వల్ల తెలుసుకోవచ్చ్ అవి హార్ట్ రేట్ ,శ్వాసక్రియ మజిల్ స్వరము ( రిఫ్లక్స్ రెస్పాన్స్ మరియు రంగుతో సహా) అప్గార్ పరికరము అప్పుడే పుట్టిన శిశువులను వెంటనే ఎవాల్యుయేట్ చేయటానికి ఉపయోగపడతాము తో ఇది ప్రపంచములో బాగా పాపులర్ అయింది. ఆవిడ పరిశోధనలలో ఇది ఒక్కటే కాకుండా గర్భిణులకు ఇచ్చే మత్తు విషయములో కూడా కొత్త విధానాలను ప్రవేశ పెట్టింది.బ్లడ్ గ్యాసెస్ మరియు సీరం ఎనష్టీషియా లెవెల్స్ ను అంచనా వేయటానికి ఈవిడ కొత్త పద్దతులను ప్రవేశపెట్టింది అవిదఃముగాకూడా పాపులర్ అయ్యింది

మరిన్ని వ్యాసాలు

బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మీకు తెలియని నాటి నట,గాయని
మీకు తెలియని నాటి నట,గాయని
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
తెలుగు సినీ కృష్ణుడు రఘరామయ్య.
తెలుగు సినీ కృష్ణుడు రఘరామయ్య.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గాయని రమోలా.
గాయని రమోలా.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Paata
పాట
- M chitti venkata subba Rao