మన సినిమాల్లో గోదావరి గీతాలు. - డా.బెల్లంకేండ నాగేశ్వరరావు.

మన సినిమాల్లో గోదావరి గీతాలు.

మన సినిమాల్లో గోదావరి గీతాలు. తరచూ మనంవినే పాటలలో కొన్ని భావాలు హృదయాన్ని మెత్తగాహత్తుకుంటాయి.మరికొన్ని పాటలు జీవితాంతం వెంటాడి కాలులోని ముల్లులా వేధిస్తాయి.మంచి పాటవిన్నప్పుడు మనసు విహాంగమై అంబరాన్ని చుంబిస్తుంది.అలాంటి ఆణిముత్యాలవంటి పాటలను మనసినీకవులు పలువురు గోదావరి సోయగాలను వర్ణిస్తు సుధామధుర గీతాలను మనకు అందించారు. ముందుగా ఈనదీమతల్లి గురించి కొంత తెలుసుకుందాం. వేదంలా ప్రవహించే గోదావరి అన్నాడు ఒసినీకవి.నిజమే నిర్మలంగాసాగే ఈతల్లి నేలపై కొంతసేపైన సేదతీరవలసిందే! పరవసింపజేసే పాపికొండల అందాలు మరువగలమా? ఈనదీమతల్లి ప్రవాహ సోయగాలు,ఉరవళ్ళ సొంపులు మనవాళ్ళు 'అందాలరాముడు' 'మూగమనసులు' 'ఉయ్యాల జంపాల' 'సాక్షి' వంటి చిత్రాలలో నయనమనో హరంగా చిత్రికరించారు.ఉభయగోదావరి జిల్లా పరీవాహక ప్రాంతం సస్యశ్యామలం.సాంప్రదాయాన్న,ఆదునీకతను మేళవించుకుని ఎన్నో ఆలవాలం.సాంస్కృతిక,సాహిత్య కళలకు,నిత్యనూతన చైతన్య వికాశాలకు ఈనేల నెలవు. ఈనదీప్రవాహం 1484 కిలోమీటర్లుకాగా 775కిలోమీటర్లు తెలుగు నేలపై ప్రవహిస్తుంది.వశిష్ట-గౌతమి-తుల్య-అత్రి-శబరి-భరద్యాజ పేర్లతో లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చెస్తు,కోట్లాది జీవుల దాహార్తిని తీరుస్తుంది. సప్తఋషులు కోరికమేరకు విరి ఏడు పేర్లతో ఏడు పాయలుగా విడిపోయి శతసహస్త్ర పుష్కరాలుగా జీవజలంతో ప్రవహించే నదీమతల్లిని చూస్తే మనసిక ఆనందంతోపాటు అనిర్వచినీయమైన అనుభూతికలుగుతుంది. ఈతల్లి ప్రవాహక ప్రాంతంలోని ఘనత రాజరాజనరేంద్రుడు.తెలుగు భారతాన్ని అందించిన నన్నయ్యభట్టు,సమాజ సంస్కర్త కందుకూరి,భద్రాద్రి,బాసర,దీవెనలుఇచ్చే ధర్మపురి,కాటన్ దొర,అడవి బాపిరాజుగారి కిన్నెరసాని రూపుదిద్దుకున్నది ఇక్కడే! టంగుటూరి,చిలకమర్తి,చెళ్ళపిళ్ళ,దేవులపల్లి,నాళం,చెట్టుకవి ఇస్మాయిల్,దళిత ఉద్యమకారుడు కుసుమధర్మన్న, ముళ్ళపూడి,కొనకళ్ళ,ఇల్లెందుల,దామెర్లరామారావు,,ఇలా మహిమాన్విత పుణ్యక్షేత్రలతో పాటు,ఈనేలపై నడయాడిన మహనీయులు ఎందరో... కళారంగానికివస్తే నాటి నేటితరంవారు చిరంజువి,కృష్ణంరాజు,దాసరి,కోడిరామకృష్ణ,ఆర్.నాగేశ్వరరావు,చలం,అల్లురామలింగయ్య,పినిశెట్టి,నల్లరామ్మూర్తి,కోళ్ళసత్యం,వంటి వందలమంది కళాకారులు ఉన్నారు.అలా సమస్త కళలకు అనేకమంది మహనీయకవులకు నిలయం ఈ గోదావరిజిల్లాల ప్రాంతం. మరి సినిమా గీతాలకు వస్తే 'మూగమనసులు' చిత్రంలో -గోదారిగట్టుంది. ''ఉయ్యాలజంపాల'లో కొండగాలితిరిగింది.'దేవత'లో ఎల్లువచ్చిగోదారమ్మ. 'అందాలరాముడు'లో కురిసేసే వెన్నెల్లో.'సితార' లో వెన్నెల్లో గోదారిఅందం' 'గౌరి' లో గలగలపారుతున్న గోదారిలా. 'సరిగమలు'లో గోదివరిపై ఎద. 'నువ్వులేక నేనులేను'లో నిండుగోదావరికదా. 'అందాలరాముడు'లో మాతల్లిగోదావరి. 'గోదవరిలో' లో ఉప్పోంగెలే. 'స్వాతికిరణం'లో కొండాకోనా లోయల్లో.వంటి వందలాది సుమధుర గీతాలు నయనమనోహరంగా చిత్రీకరింపబడి మనకు కనువిందు చేసాయి.విదేశి లొకేషన్స్ కన్నా! మనగోదావరి అమ్మ సోయాగాలేమిన్న!.