ద్వీపాలు-వర్షాలు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

ద్వీపాలు-వర్షాలు.పురాణకథ.

స్వయంభువమనువు శతరూప దంపతులకు 'ప్రియవ్రతుడు', 'ఉత్తానపాదుడు' అనే కుమారులు, 'ప్రసూతి' అనే కుమార్తె ఉన్నారు. ప్రసూతి 'దక్షప్రజాపతి'ని వివాహం చేసుకుంది. ఉత్తానపాదుడికి 'సునీతి', 'సురుచి' అనే భార్యలు ఉన్నారు. వీరిలో సురుచికి పుట్టినవాడు 'ఉత్తముడు'. సునీతికి పుట్టినవాడు 'ధృవుడు'. ప్రియవ్రతుడు ప్రజాపతి కుమార్తే 'బర్హిహ్మతి'ని వివాహం చేసుకున్నాడు. 'ఊర్జస్వతి అనే కుమార్తెతో పాటు, 'అగ్నిధ్రధుడు', 'అగ్నివాహుడు', 'మేధ', 'మేధాతిథి', 'వసువు', 'జోతిష్మానుడు', 'ద్యుతమానుడు', 'హవ్యుడు', 'సవనుడు', 'పుత్రుడు' అనేకుమారులు ఉన్నారు. ప్రియవ్రతుడు భూమిని ఏడు ద్వీపాలుగా విభజించి జంబుద్వీపానికి అగ్నిధ్రదుని, ప్లక్షద్వీపానికి మేధాతిథిని, శాల్మిలీద్విపానికి వసువును, కుశద్వీపానికి జ్యోతిష్మానుడిని, క్రౌంచద్వీపానికి ద్యుతిమానుడిని, శకద్వీపానికి హవ్యుడుని, పుష్కరద్వీపానికి సవనుడుని రాజులుగా నియమించాడు. మిగిలిన ముగ్గురు పాలనకు విముఖులు కావడంతో తపోవనాలకు వెళ్ళిపోయారు. అలా ప్రతిద్వీపం 'వర్షాలుగా' విభజించబడింది. సవనునికి ఇద్దరు కుమారులు కనుక పుష్కరద్వీపాన్ని 'దిటఖండ', 'వర్షమనీ', 'థాటకీ' ఖండవర్షమని విభజించారు. హవ్యునికి ఏడుగురు పుత్రులు కనుక శకద్వీపాన్ని'జలజ', 'కౌమార', 'సుకుమార', 'మణీచక', 'కుసుమోత్తర', 'మౌడక', 'మహరుద్రమ' వర్షలుగా విభజించారు. ద్యుతిమానునికి ఏడుగురు కుమారులు కనుక క్రౌంచద్వీపాన్ని 'కుశాల', 'మనోనుగ', 'ఊష్ణ', 'పవన', 'అంధకార', 'ముని', 'దుందుభి' వర్షలుగా విభజించారు. జ్యోతిష్మానునికి ఏడుగురు కుమారులు కనుక కుశద్వీపాన్ని'ఉర్బద', 'వేణుమండల', 'స్వెైరాంధకార', 'లవణ', 'థృతిమాన', 'ప్రభాకర', 'కపిల' అనే వర్షలుగా విభజించారు. వపుష్మానుడికి ఏడుగురు కుమారులు కనక శాల్మిలీ ద్వీపాన్ని'శాల్మిలీద్వీప', 'శ్వేత', 'రోహిత', 'జీమూత', 'హరిత', 'వైద్యుత', 'మానస', 'సుప్రభ' వర్షాలుగా విభజించబడ్డాయి. మేధాతిథికి ఏడుగురు కుమారులు కనుక ప్లక్షద్వీపం 'శాంతభయ', 'శిశిర', 'సుభోదయ', 'ఆనంద', 'ధృవక', 'క్షేమక', 'శివ' అనే వర్షలుగా విభజింపబడింది. అగ్నిధ్యదునికి తొమ్మిది మంది కుమారులు కనుక జంబుద్వీపం' నాభి', 'కింపురుషుడు', 'హరి', 'ఇలావృత', 'రమ్య', 'హిరణ్వాన', 'కురు', 'భద్రాశ్వ', 'కెతుమాల' లుగా విభజించారు. నాభి కుమారుడు 'ఋషబుడు'. ఇతని భార్య జయంతి. వీరికి భరతుడు, కవి, హరి, అంతరిక్షుడు, ప్రభుధ్ధుడు, పిప్పలాదుడు, అవిర్హాత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు, కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మవర్తుడు, ఆర్యవర్తుడు, మలయకేతుడు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్కు, విదర్బుడు, కీకటుడు, మెదలకు వారు జన్మించారు. వీరిలో భరతుడు విశ్వరూపుని కుమార్తె పంచజనిని వివాహం చేసుకోగా, వీరికి సుమతి, రాష్టృభృత్తు, సుదర్శనుడు, అచరుణుడు, ధూమ్రకేతువు అనే సంతతికలిగారు. భరతుడు పరిపాలించిన ప్రదేశం 'భరతవర్షం' అయింది. దీన్ని అజనాభం అనికూడా అంటారు.