భూలోక అమృతమే తేనె! - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

భూలోక అమృతమే తేనె!

భూలోక అమృతమే తేనె. వలపుతేనెపాట అని ఓ సినీ కవిగారు అంటే,కురిసెను హ్రుదయంలో తేనె జల్లులు అన్నారు మరో కవిగారు.నిజమే తేనె ఆరోగ్యానికి భూమిపై లభించే అమృతమే!.నాలుగు వేల సంవత్సరాల క్రితం మమ్మితో పాటు భధ్రపరిచిన తేనె నేటికి అలానే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అత్యంత ప్రమాదకరమైన శిలింధ్రాలను తేనె సమర్ధవంతంగా ఎదుర్కొనగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు.చెట్లమీద,నేలలో ఉండే 'ప్యుసేరియం' అనే శిలీంధ్రం ద్వారా సంక్రమించేవ్యాధులు కంటి చూపును తీవ్రంగా దెబ్బతీస్తాయి.కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తాయి.దీనిపై బ్రిటన్ లోని మాంచస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన జెయిన్ హబీబ్ ఆల్ హింది అనే శాస్త్రవేత్త పరిశోధనలు జరిపారు.తేనెను వేర్వేరు గాఢతల్లో తీసుకుని ప్యుసేరియంపై వాటి ప్రభావాన్ని పరిశీలించారు.అత్యంత పలచగా ఉన్న తేనె కూడా ప్యుసేరియం కణత్వాచాన్ని దెబ్బతీసి ఆ శిలీంద్రియాన్ని నిర్మూలించగలదని వారి పరిశోధనలో వెల్లడి అయినది. అమెరికన్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారి లెక్క ప్రకారం టేబుల్ స్పూన్ పంచదారలో 15 క్యాలరీలు ఉంటే,తేనెలో 64 క్యాలరీలు ఉంటాయి.పంచదారతో పోలిస్తే చాలా ఎక్కువ.కానీ తేనెలోని పిండి పదార్ధాలు సులభంగా గ్లూకోజ్ గామారిపోవడంతో తేలిగ్గా జీర్ణమవుతాయి.అందుకే క్రీడాకారులకు తేనే తక్షణశక్తిగా పనిచేస్తుంది.ఈతెనెలు పసుపు,బూడిద,ముదురు కాఫీ,నలుపు...ఇలాభిన్న రంగులలోనూ వర్ణరహితంగాను లభ్యమౌతుంది.ఓక్కో రకమైన తేనే ఓక్కో రకమైన రుచిని సుఘంధాన్ని వెదజల్లుతుంది.యూకలిప్టస్,నిమ్మ పూలజాతి తేనె ఘూటైన రుచి వాసనా కలిగిఉంటాయి.నేడు ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్న పదార్ధం తేనె ఒక్కటే.గ్రీకులు,రోమన్లు చైనీయులు ఈజిష్టియన్లు అస్సీరియన్లు భారతీయులు ప్రాచీన కాలంనుండి వైద్యరంగంలో వాడుతూనే ఉన్నారు.శ్వాసకోసవ్యాధులకు అద్బుత ఫలితాలు తేనె ఇస్తుందట.పొట్ట సంభంధిత వ్యాధులకు,గాయాలకు ఇది దివ్య ఔషదంగా చెపుతారు.తేనెను రోజు తగు మోతాదులో క్రమంతప్పకుండా తీసుకుంటే హృద్రోగాల సంఖ్య బాగాతగ్గినట్లు తేలింది.తేనెలో అధికంగా ఉండే విటమిన్-సి,మోనోఫినాలిక్ లు ఫ్లేవనాయిడ్లూ పాలీఫినాలిక్ లూ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేయడమే ఇందుకు కారణం. ఊబకాయంతో బాధపడేవారు క్రమంతప్పకుండా నెలరోజులపాటు రోజు 70 గ్రా.తేనెఇచ్చిచూడగా వారి బరువులో 1.3 శాతం తేడా ఉండగా కొలెస్ట్రాల్ మాత్రం మూడు శాతం తగ్గిందట.అలాగే తేనెలో నిమ్మరసం,దాల్చినచెక్కపోడి,లేక గోరువెచ్చటి నీటితో కలిపి తీసుకున్న మంచి ఫలితుం ఉంటుంది శరీరంలోని కొవ్వు తగ్గడానికి ఉపయోగ పడుతుంది. బిపి తోపాటు శరీరంలోని చక్కెరస్ధాయిలను నియంత్రిస్తుంది అలసటను దూరంచేస్తుంది.తేనెలోని న్యూట్రాసూటికల్స్ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ శరీరంలోని హానికరమైన ఫ్రీ-రాడికల్స్ ను తొలిగిస్తాయి.దాంతో క్యాన్స్ ర్,హృద్రోగాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.శరీరం పై మచ్చలు తొలిగించడంలో అమోఘంగా పనిచేస్తుంది.తేనె ఎప్పటికి చెడిపోదుకనుక ప్రిజ్ లో ఉంచకూడదు.నేయి తేనె సమపాళ్ళలో తీసుకోకూడదు.పిప్పళ్ళు,మిరియాలు వంటి వాటితో తేనె తీసుకోకూడదు.మసాలా పదార్ధాలు,మధ్యం తేనే కలపకూడదు.అలాగే ప్రభుత్వ అనుమతి పేందిన ఉత్పాదనలు కొనడం మంచిది.నేడు తేనెటీగల పెంపకం ఓకుటిరపరిశ్రమగా మారింది. స్పెయిన్ దేశంలోని వలెన్సియా అనే ప్రాంతంలోని గుహలో అడవితేనె వేటకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి.ఇవి ఎనిమిది వేల సంవత్సరాలనాటివి.అలానే తేనె విలువను ప్రపంచానికి తెలిపిన కీర్తి స్పెయిన్ శాస్తజ్ఞృడు హ్యుబర్ కు దక్కుతుంది.రెండువందల సంవత్సరాలు క్రితం స్వతహాగా అంధుడైనప్పటికి భార్య,అహాయకురాలి సహాకారంతో,రాణి ఈగ తనగూడుకు చాలాదూరంలో ఉన్నా మగఈగతో ఎలా సంపర్కంపెంచుకుంటుంది?తేనెపట్టుపై ఉన్న రంధ్రాల సైజు చూసి కూలీ మగఈగలను,వాటిసంఖ్య ఎలాగుర్తించవచ్చోహ్యుబర్ వివరంగా తెలియ జేసాడు.తేనెటీగలలో రకాలు ఎపిస్ దోర్సలా,సెరినా ఇండికా,ఎపిస్ ఫ్లోరియా,డ్యామెస్ బి లేదా స్పిృంగ్ లెస్ బి అనేవి ముఖ్యమైనవి. ఒకపెద్ద తేనె తుట్టిలో దాదాపు యాభైవేల తెనెటీగలు ఉంటాయి.వీటిలో రాణీ ఈగ-డ్రోన్ లు-కూలిఈగలు ఉంటాయి.రాణి ఈగ రోజుకు రెండువేల గుడ్లు పెడుతూ వాటిని సంరక్షిస్తుంది.తేనె తీసిన అనంతరం తుట్టెనుండి కొవ్వోత్తులు,పాలీష్,మోడల్స్ తయారికి వాడతారు.తేనెటీగ విషాన్ని మోకాళ్ళనొప్పులకు వాడతిరు. చెక్కెర పదార్ధాల సమ్మిశ్రమమే తేనె.ఇందులో ఫ్రక్టోజ్ 38%,గ్లూకోజ్ 31%,సుక్రోజ్ 1%, నీరు17%,ఇతరాత్రా చెక్కెరలు 9%,ఉంటాయి.తేనెటీగ తేనెను సేకరించి తెచ్చేసమయంలో దానిలో కేన్ని ఎంజైములు కలుస్తాయి.ఆతరువాత తేనెటీగ తేనెపట్టుచేరి,అక్కడ రెక్కలల్లారుస్తూ ఎగరడంవలన తేనెలోని నీరు ఆవిరై గాఢతపెరిగుతుంది. తేనెలో కాల్షియం,ఐరన్,మాంగనీస్,ఫాస్ఫరస్,జింక్,సోడియం....వంటిఖనిజాలతోబాటు విటమిన్లు ప్రొటీన్లూ అమైనో ఆమ్లాలు ఉంటాయి.పోషక లేమితో బాధపడేవారికి తేనె మంచి పౌష్టిక ఆహారం.మొహానికి పూసుకోవడంవలన చర్మం నిగారింపు వస్తుంది.ఇది సహజ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుం

మరిన్ని వ్యాసాలు

కేదారనాధ్ .
కేదారనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బదరీనాధ్ .
బదరీనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.