దానయ్య తీర్పు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

దానయ్య తీర్పు.

 పొలం వెళుతున్న దానయ్యకు దారిలో ఇద్దరు వ్యక్తులు వాదులాడుకుంటూ ఓకరిని ఓకరు నెట్టుకుంటూ కనిపించారు. వారి కాళ్ళవద్ద పెద్ద పుచ్చకాయ ఉంది.వాళ్ళను సమీపించిన దానయ్య'ఎందుకు నాయనా ఘర్షణ పడుతున్నారు'అన్నాడు.'అయ్య ఈపుచ్చకాయను నేను మోదట చూసాను.కాని ఇతనుకూడా నాఈ పుచ్చకాయ తనదంటున్నాడు నేను బాగా ఇకలితో ఉన్నాను ఈపుచ్చకాయనేనే తింటాను'అన్నాడు. రెండో వ్యక్తి 'అయ్య అతను అబధం ఆడుతున్నాడు ఈపుచ్చకాయ మోదట నేనే చూసాను ఇది నాకే సొంతం నేనుకూడా బాగా ఆకలితో ఉన్నాను ఈపుచ్చకాయ నేనే తింటాను'అన్నాడు. ఇరువురి మాటలువిన్న దానయ్య'ఈపుచ్చకాయ కొరకు మీ ఇరువురు దెబ్బలాడుకుంటే ఎవరో ఒకరే గెలుస్తారు. కానీ గాయాలు మాత్రం ఇద్దరికి అవుతాయి ఘర్షణతో నష్టమేకాని ఎవరికి లాభం ఉండదు.ఈ విషయం తెలియక ఎందరో స్వార్ధంతో అన్నింట ఆవేశపడుతుంటారు. పాముకోరల్లోని విషంకన్నా మనిషిలోని స్వార్ధం చాలా ప్రమాదకరమైనది.అందుకే నామాటవిని మీ ఇద్దరు రాజిపడి ఈపుచ్చకాయను రెండుభాగాలు చేసుకు తినండి ఇరువురి ఆకలి తీరుతుంది ఘర్షణ పడవలసిన అవసరం ఉండదు'అన్నాడు దానయ్య. ' అయ్యా మీతీర్పు మాకు సమ్మతమే' అని ఇద్దరు చేతులు జోడించారు. దానయ్య సంతోషంగాతన పొలంవైపు వెళ్ళిపోయాడు.