డేంగిజంకు వ్యతిరేకంగా పోరాడుదాం! - అంకాళ్ళ పృథ్వి రాజ్.

డేంగిజంకు వ్యతిరేకంగా పోరాడుదాం!

డేంగిజంకు వ్యతిరేకంగా పోరాడుదాం! డేంగిజం యొక్క మొళిక స్వభావ రూపంలో వ్యక్తమయ్యే ముఖ్యమైన అంశాలు 1) ఉత్పత్తిలో ఆధునికత ఆహ్వానానికై సంస్కరణల పేరుతో వ్యక్తిగత హౌద పెట్టుబడికి అవకాశాల రూపంలో తెరవబడిన ప్రక్రియ. 2) ఆధునికత వైపుగా సాగుతున్నవేల కమ్యూనిస్టు పార్టీ యొక్క భావజాలాత్మక ఐక్యత యొక్క సంరక్షణార్ధం కలిగిన భావజాల సాంప్రదాయ కొనసాగింపు. డేంగిజం ప్రతిపాదించిన ఆధునికత చెందవలసిన అంశాలు: 1) వ్యవసాయం 2) పరిశ్రమ 3) జాతీయ రక్షణ వ్యవస్థ 4) శాస్త్ర-సాంకేతికత డేంగిజపు భావజాల సాంప్రదాయతకై నాలుగు మొళిక సూత్రాలు: 1) కమ్యూనిజం యొక్క పునాదిని సమర్ధించడం 2) ప్రజల ప్రజాస్వామిక నియంతృత్వమనే రాజకీయ వ్యవస్థ 3) కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని సమర్ధించడం 4) మార్క్సిజం లెనినిజం మరియు మావో ఆలోచనా విధానాన్ని ఎత్తిపట్టడం డేంగిజం యొక్క మొళిక లోపం: వ్యవసాయం, పరిశ్రమ, జాతీయ రక్షణ వ్యవస్థ, శాస్త్ర సాంకేతికతలో ఆధునికత పేరుతో విదేశీ పెట్టుబడులను, సంస్కరణల పేరుతో వ్యక్తిగత హౌద పెట్టుబడికి అవకాశాల రూపంలో తెరవబడిన ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దడం అనే కార్యాన్ని కొనసాగించడం. ఈ కార్యసిద్ధికై ఒక బలమైన మార్క్సిజం-లెనినిజం-మావోయిజపు భావజాల సాంప్రదాయాన్ని మొళిక భావనగా ఎత్తిపట్టే కార్యాన్ని కొనసాగించడం కోసం కార్యకలాపాల సన్నద్ధతను, అమలును చేసుకుంటూ వ్యక్తిగత హౌద పెట్టుబడికి మరియు సాంప్రదాయ భావజాలమైన మార్క్సిజం-లెనినిజం-మావోయిజానికి ఐక్యతని కుదర్చడం, సర్ధుబాటు చేయడంగా సాగడం. గతితార్కిక భౌతికవాదానికి భిన్నంగా బూర్జువా రాజకీయ ఆర్ధిక ఫలితప్రాధాన్యవాదాన్ని ముందుకు తెచ్చాడు, ఫలితంగా వ్యవసాయం పై ఆస్తి హక్కును రద్దు చేసే దిశగా సాగలేదు, పారిశ్రామిక జాతీయత కనుమరుగు అయ్యింది, జాతీయ రక్షణ వ్యవస్థ ప్రవేటీకరించబడింది, శాస్త్ర-సాంకేతిక గుత్తగా మారిపోయింది. దీనితో తమ మొళిక సూత్రాలకు పూర్తి భిన్నమైన ఫలితాలు పుంజుకున్నాయి, వైషమ్యంగా మారాయి. కమ్యూనిస్టు పార్టీ పేరుతో బూర్జువాజీ సోషలిజం అమలు చేయబడింది. పార్లమెంటరీ డేంగిజం: మన భారత దేశంలోని కమ్యూనిస్టు పార్టీలకు సైతం డేంగిజం అను ఆధునిక రివిజనిజం ఒక అంటు రోగంగా సాగుతుందనే అర్ధం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. భారత దేశంలోని రివిజనిస్టు కమ్యూనిస్టు కార్యాచరణ, వారి ఎజెండా మొళికంగా ఉత్పత్తిలో ఆధునికత ఆహ్వానానికై సంస్కరణల పేరుతో వ్యక్తిగత హౌద పెట్టుబడికి అవకాశాల రూపంలో తెరవబడిన ప్రక్రియగానే సాగుతుంది (దీనిని మనం కేరళలోని కమ్యూనిస్టు పరిపాలనలో గమనించవచ్చు) ఐతే ఈ ప్రక్రియను మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం అనే భావజాలాత్మక సాంప్రదాయ రూపంలో కొనసాగించే ప్రయత్నాన్ని స్పష్టంగా గమనించగలం, ఫలితంగా వాటి మధ్య ఐక్యతను ఏర్పర్చి బూర్జువాజీ సోషలిస్టు నియంతృత్వాన్ని కొనసాగించే వాతావరణాన్ని చూడవచ్చు. కావున ఈ ప్రక్రియకు మొలికమైన భారతీయ పార్లమెంటరీ విధానం సరితూగుతుంది, కావును మన రివిజనిస్టు కమ్యూనిస్టుల ఆధునిక భావజాల-కార్యాచరణ పార్లమెంటరీ డేంగిజంగా పరిగణించాలి. సాయుధ డేంగిజం: సాయుధ డేంగిజాన్నే మనం ప్రతిఘటణ పోరాటం లేదా పాక్షిక గెరిల్లా పోరాటంగా అభివర్ణిస్తాము. ఈ సాయుధ డేంగిజం ఆర్ధికవాద మూలాలతో సాగుతుంది దీనికంటూ ఒక స్పష్టమైన రాజకీయ లక్ష్యం అందుకు సాయుధ పోరాట వ్యూహం మరియు ఎత్తుగడలు ఉండవు. సాయుధ పోరు అనగా ప్రతిఘటణ లేదా పాక్షిక గెరిల్లా పోరాటం ప్రజల ఆర్ధిక హక్కుల సాధన దిశగా ఏర్పడి ఉత్పత్తిలో సంస్కరణల పేరుతో వ్యక్తిగత హౌద యొక్క అవకాశాల రూపంలో తెరవబడిన ప్రక్రియగా ఉంటూనే కేవలం ఆర్ధిక స్వాతంత్రయమే-ఆర్ధిక హక్కుల సాధనతోనే ప్రతిఘటణ మరియు పాక్షిక గెరిల్లా పోరాటం ద్వారా పరిష్కారం సిద్ధిస్తుందనే కార్యాచరణను గమనించగల సాయుధ పోరాట కమ్యూనిస్టులను చూడవచ్చు. ఈ ప్రక్రియకు మార్క్సిజం-లెనినిజం-మావోయిజాలను సాంప్రదాయ భావజాల పునాదిగా వాడుకుంటూ సాగుతారు. అందుకే వీరిని సాయుధ రివిజనిస్టులు లేదా సాయుధ డేంగిస్టులుగా అభివర్ణిస్తారు. ఈ జాడ్యం నేటికీ మనం గమనించవచ్చు. సాహిత్య డేంగిజం: సాహిత్య డేంగిజం కమ్యూనిజం యొక్క పునాదిని సమర్ధించడం, ప్రజల ప్రజాస్వామిక నియంతృత్వమనే రాజకీయ వ్యవస్థ, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని సమర్ధించడం, మార్క్సిజం లెనినిజం మరియు మావో ఆలోచనా విధానాన్ని ఎత్తిపట్టడం అనే సాంప్రదాయ భావజాలాన్ని సాహిత్యంలో కొనసాగించే విధానం ప్రధానంగా సాగుతూనే మరొక ప్రక్క ఉత్పత్తిలో ఆధునికత ఆహ్వానానికై సంస్కరణల పేరుతో వ్యక్తిగత హౌద పెట్టుబడికి అవకాశాల రూపంలో తెరవబడిన ప్రక్రియను సమర్ధించే ఆచరణాత్మకతను ప్రోత్సాకరంగా సాగడాన్ని గమనించవచ్చు. ఈ విధానాన్ని మనం నేటికీ సాహిత్యంలోకి చొప్పించి అభివృద్ధి చేయడాన్ని గమనించగల సాహిత్య రివిజనిజంగా గమనించాలి. డేంగిజపు అత్యున్నత రూపం జింగ్ పింగ్ ఆలోచనా విధానం: జింగ్ పింగ్ ఆలోచనా విధానం 14 మొళిక విధానాల ఆధారంగా రూపోందింది అవి ప్రధానంగా చైనా దేశీయ పరిస్థితులకు అనుగూణంగా సామ్యవాద రూపకల్పన, అందుకోసం సమగ్ర గుత్త పెట్టుబడి ఆధారిత సంస్కరణల తీవ్ర అమలు, ప్రజల ప్రజాస్వామ్య సుస్థిరత్వం, జాతీయ రక్షణ వ్యవస్థ పటిష్టత్వం, పర్యావరణ మరియు సామరస్య పూరిత శాంతి స్థాపన కోసం బలమైన గుత్త పెట్టుబడి పునాదిగా మార్క్సిజం, కమ్యూనిజపు తాత్త్విక నేపథ్యంగా సాగడమానే విధానాన్ని తీసుకురావడం. కావున నేటి చైనా సామ్రాజ్యవాద తాత్త్వికతకు డేంగిజపు అత్యున్నత రూపంగా జింగ్ పింగ్ ఆలోచనా విధానం అభివృద్ధి కాసాగింది. ఇందులో గుత్త పెట్టుబడితో మార్క్సిజం మరియు లెనినిజపు సాంప్రదాయకమైన భావజాలాన్ని ఐక్యపరచి కొనసాగడం. అందుకే సోషల్ సామ్రాజ్యవాదంగా పెట్టుబడీదారీ అత్యున్నత రూపంగా చలామని అవ్వడంగా అవగాహన చేసుకోవచ్చు. ముగింపు: జాతీయకరించడం: డేంగిజమైన ఉత్పత్తిలో ఆధునికత ఆహ్వానానికై సంస్కరణల పేరుతో వ్యక్తిగత హౌద పెట్టుబడికి అవకాశాల రూపంలో తెరవబడిన ప్రక్రియ లేదా జింగ్ పింగ్ ఆలోచనా విధానానమైన దేశీయ గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ అనుగూణమైన సామ్యవాద ప్రక్రియలకు వ్యతిరేకంగా జాతీయకరించడం అనే ప్రక్రియకు సంబంధించిన విధానాన్ని బలంగా ముందుకు తీసుకుని రావడం అలాగే పెట్టుబడి మరియు గుత్త పెట్టుబడి ఆధ్వర్యంలోని ఆధునికత వైపుగా సాగుతున్నవేల కమ్యూనిస్టు పార్టీ యొక్క భావజాలాత్మక ఐక్యత యొక్క సంరక్షణార్ధం కలిగిన మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానపు భావజాల సాంప్రదాయ కొనసాగింపు కాకుండా జాతీయకరణ ప్రక్రియ ఐక్యతలో మార్క్సిజపు మొళిక భావజాల సాంప్రదాయ ఐక్యతను ఎత్తిపట్టడం ముఖ్యము. రాజకీయ అధికార హస్తగతం రాజకీయ అధికార హస్తగతం అనే సమస్యలో మనం నేడు గమనిస్తున్న రెండు డేంగిస్టు పంథాలు ఏమనగా పార్లమెంటరీ డేంగిజం మరియు సాయుధ డేంగిజంలు. నిజానికి ఈ రెండు పంథాలు నిర్ధిష్ట వ్యవస్థ తాలుకు పరిథిలోనే తమ యొక్క లక్ష్యాలను, గమ్యాలను చేరుకోగలమనే విధానానికి పునాదిగా సాగడం ఒకటి బడా బూర్జువా-బడా భూస్వామ్య వ్యవస్థలో భాగంగా పార్లమెంటరీ విధానంతో ముందుకు రావాలని, ఆ పద్ధతిలోనే స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని కొనసాగిస్తూ సాగాలని అందుకోసం మార్క్సిజపు భావజాల ఐక్యతతో సాగాలనే తాపత్రయం. మరొక పంథా ప్రతిఘటణా పోరాట వెల్లువగా ఆర్ధిక హక్కుల సాధనకై ఆత్మ రక్షణా స్థితిగా సాయుధ పాక్షిక గెరిల్లా పోరాటంగా అభివృద్ధి అయ్యి నిర్ధిష్ట వ్యవస్థలో సాధించే ఆర్ధిక డిమాండ్ల లక్ష్యమే అంతిమంగా మలిచే ప్రక్రియనే సాయుధ డేంగిజం. కావున మనం ఆర్ధిక హక్కుల కొరకు పరిమితం అయ్యే దిశగా కాకుండా అలాగే పార్లమెంటరీ విధానంలో కూరుకుపోకుండా రాజకీయ అధికార హస్తగతంకై దీర్ఘకాలిక సాయుధ పోరాటం పునాదిగా చారుమజుందార్ మార్గదర్శకత్వంలో సాగుదాం. డేంగిజంకు, జింగ్ పింగ్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా పోరాడదాం.