రక్తం -రక్తదాన ఆవశ్యకత - కందర్ప మూర్తి

రక్తం -రక్తదాన ఆవశ్యకత

ఎంత కొత్త వాహనమైనా ఇంధనం (ఫ్యూయల్ ) లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు కదల లేనట్టే మనిషి శరీరంలో రక్తం (Blood ) అనే జీవ ద్రవ పదార్ధం ప్రవహించక పోతే జీవితం లేదు. మనిషికి ఊపిరి (ప్రాణవాయువు) ఎంత అవుసరమో బ్లడ్ కూడా అంతే ముఖ్యం. మనిషి ప్రాణాలతో దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవుసరమౌతుంది.రక్తం అంటే విలువ కట్టలేనిది. ప్రాణాపాయంలో సంజీవని వంటిది. ప్రమాదాలు జరిగినప్పుడు , శస్త్రచికిత్సలు , స్త్రీల ప్రసవ సమయంలో, శరీరం కాలిన గాయాలపుడు , కొన్ని దీర్ఘ రోగాలు పిల్లల థలాసీమియా లుకేమియ హెమోప్లీజియ సికిల్ సెల్ ఎనీమియ మూత్ర పిండాల డయాలిసిస్ వంటి సమయాలలో బ్లడ్ దాని ఉప పదార్థాలు (కాంపొనెంట్స్) అవుసరమవుతాయి. దానా లన్నిటిలో రక్తదానం కూడా గొప్పది. రక్తం అనే జీవ పదార్థం ఎటువంటి కర్మాగారాలలో తయారు చేయలేనిది. మనుషులు స్వచ్ఛందంగా వారి శరీరం నుంచి రక్తం డొనేషన్ చెయ్యవల్సి ఉంటుంది. ఒక మనిషి చేసిన రక్తదానం వల్ల నలుగురు పేషెంట్ల ప్రాణాలను కాపాడ వచ్చు. ఆరోగ్య వంతుడైన మనిషి శరీరంలో 5 లేక 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. అందులోంచి 350 మిల్లీ లీటర్ల బ్లడ్ సంవత్సరంలో మూడు లేక నాలుగు నెలల కొకసారి డొనేట్ చెయ్యవచ్చు.ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడవు. బ్లడ్ లో ఎర్ర రక్త కణాలు కీలక పాత్ర పోషిస్తాయి.శరీరంలో ఎర్ర రక్తకణాల జీవిత కాలం నూట ఇరవై రోజులు. రక్తం దానం చేసినా లేకపోయినా అవి నశిస్తాయి. రక్త దానం చేసినట్లయిన కొత్త రక్తకణాలు పుట్టి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరం లోని బ్లడ్ ను 55% ద్రవ పదార్ధం 45% ఘన పదార్థంగా లెక్కించారు. రక్త ద్రవ పదార్థంలో ఎర్ర రక్తకణాలతో పాటు తెల్ల రక్త కణాలు ప్లేట్ లెట్స్ ఉంటాయి. ఇవి కాక ఐరన్ కాల్షియం సోడియం పొటాషియం వంటి మూలకాలతో పాటు ఆక్సిజన్ నైట్రోజన్ కార్బన్డయాక్సైడ్ వంటి వాయువులు హార్మోన్లు సమ్మిళితమై ఉంటాయి. . ఎర్ర రక్త కణాలు (Red-blood cells) శరీర భాగాలకు ఆక్సిజన్ తో పాటు ప్రోటీన్స్ ఫేట్స్ కార్బొహైడ్రేట్స్ విటమిన్స్ మినరల్ సాల్ట్స్ వంటి పోషక పదార్థాలు అందచేస్తాయి. తెల్ల రక్త కణాలు( White blood cells )శరీర రోగ నిరోధక శక్తిని పెంచి రోగ కీటాణువుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ప్లేట్ లెట్స్( Platelets )శరీరంలో రక్తస్రావం (bleeding) జరిగినప్పుడు రక్తకణాలు గడ్డకట్టి రక్త స్రావం నిలుపుదల చేస్తాయి.. బ్లడ్ శరీరంలో అన్ని అవయవాలకు పోషక పదార్థాలు , ఆక్సిజన్ అందచేసే చిక్కని ఎరుపురంగు జీవ(Nutrition) ద్రవ పదార్ధం. ఇది మనిషి ఎముకల మధ్య బోన్ మేరోలో ఉత్పత్తి అవుతుంది. రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలలో హెమోగ్లోబిన్ అనే ఇరన్ మూలకం ముఖ్యమైంది. దీని వల్ల రక్తానికి ఎరుపురంగు కలుగుతోంది.రక్తకణాలలో హెమోగ్లోబిన్ సాదరణంగా 12 శాతం పైన ఉండాలి. కావల్సినంత హెమోగ్లోబిన్ రక్తకణాలలో లేకపోతే ఎనీమియ అనే జబ్బు వస్తుంది. దీని వలన ఊపిరి తిత్తులకు సమపాళ్లలో ఆక్సిజన్ అందక శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్య ఆడవారిలోను , పోషకాహారం లోపించిన పిల్లల్లో వస్తుంటుంది. బ్లడ్ గుండె నుంచి ధమనుల ద్వారా మంచి రక్తాన్ని శరీర అన్ని భాగాలకు సరఫరా చేస్తూ శిరల ద్వారా మలినాలతో కూడిన చెడు రక్తాన్ని శుద్ధి చేసి ఊపిరి తిత్తులు కిడ్నీలు చర్మం మలద్వారం ద్వారా విసర్జకాలు బయటకు విసర్జింప బడతాయి. రక్తంలోని ఎర్రకణాల మీద ఉండే A మరియు B ఏంటిజెన్స్( Antigens ) ను బట్టి , ద్రవ పదార్ధం లోని A మరియు B ఏంటీబాడీ( Antibody )లను బట్టి బ్లడ్ గ్రూపులు ఏర్పడ్డాయి. రక్తం లోని రక్త కణాలలో ఒక గ్రూప్ ఏంటిజెన్ తో అదే గ్రూప్ ఏంటీబాడీ కలిస్తే రియాక్షన్ (కణవిభజన) జరుగుతుంది. అందువల్ల బ్లడ్ గ్రూపుల్లో ఏంటిజెన్స్ కి వ్యతిరేక ఏంటీబాడీలు ఉంటాయి ఏంటిజన్. ఏంటీబాడీ A బ్లడ్ గ్రూప్. A. B B బ్లడ్ గ్రూప్ B. A A and B బ్లడ్ గ్రూప్ A and B. Nil O బ్లడ్ గ్రూప్. Nil A and B రక్తంలో ఏంటిజెన్స్ వారసత్వ జీన్స్ వల్ల తల్లిదండ్రుల నుంచి వారి సంతానికి సంక్రమిస్తాయి. సాధారణంగా ఎర్ర రక్త కణాల మీద ఉండే ఏంటిజెన్స్ ను బట్టి నాలుగు ముఖ్య బ్లడ్ గ్రూపులుగా విభజించారు. అవి A ఏంటిజెన్ ఉంటే A బ్లడ్ గ్రూప్ గా B ఏంటిజెన్ ఉంటే B బ్లడ్ గ్రూప్ గా రెండు A ,B ఏంటిజెన్స్ ఉంటే AB బ్లడ్ గ్రూప్ గా ఎటువంటి ఏంటిజెన్స్ లేని బ్లడ్ గ్రూప్ ను O గా నిర్ధారించారు. వీటన్నింటినీ కలిపి ABO బ్లడ్ గ్రూప్ సిష్టంగా నామకరణం చేసారు. సాధారణ నాలుగు బ్లడ్ గ్రూపులే కాకుండా Rh (Rhesus) అనే వేరొక సబ్ గ్రూప్ తర్వాత కనుక్కో బడింది. ఈ Rh సబ్ గ్రూపులో కూడా ఏంటిజెన్స్ ఉపస్థితిని ( Present) బట్టి Rh ఏంటిజెన్స్ ఎర్ర రక్త కణాల మీద కలిగి ఉంటే POSITIEVE గా Rh ఏంటిజెన్స్ లేకపోతే Negative గా ధృవీకరించారు. Rh , Negative బ్లడ్ గ్రూప్ ను (Rare) అరుదు బ్లడ్ గ్రూపులుగా స్థిరీకరించారు. ఉదాహరణగా కామన్ బ్లడ్ గ్రూప్. రేర్ బ్లడ్ గ్రూప్ A+ve. A--ve B+ve. B--ve AB+ve. AB--ve O+ve. O--ve ABO బ్లడ్ గ్రూప్ సిస్టంలో A,B,O బ్లడ్ గ్రూప్ ల రక్తం జనాభాలో విరివిగా దొరికినా AB +ve బ్లడ్ గ్రూపు రక్తం చాలా తక్కువగా లబ్యమౌతుంది. AB బ్లడ్ గ్రూప్ Rh Negatieve ( Rh--ve) అత్యంత రేర్ గ్రూపుగా గుర్తింప బడింది. మరొక అత్యంత రేర్ గ్రూపుగా బోంబే బ్లడ్ (Oh ) గ్రూప్ కూడా ఉంది. 18 సంవత్సరాలు నిండిన యువ స్ర్తీ పురుషులు 65 సం.ల వయో వృద్ధుల వరకు వైధ్య పరిక్షల అనంతరం రక్త దానానికి అర్హులు. కావల్సిన శరీర బరువు , ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి. డాక్టరు పరీక్ష చేసి అన్ని విధాల అర్హులైన వారి నుంచి రక్త సేకరణ చేస్తారు. పాత రోజుల్లో ప్రత్యేకంగా చేసిన గాజు సీసాల్లో దాతల నుంచి రక్తం సేకరించేవారు.ఇప్పుడున్న బ్లడ్ బేంక్ సౌకర్యాలు అప్పుడుండేవి కావు.అందువల్ల అనేక సమస్యలు ఏర్పడేవి. రక్త దాతల నుంచి సేకరించే రక్తం గడ్డ కట్టకుండా ఏంటీకోగ్యు లెంట్ (Anticoagulant) అనే రసాయన ద్రవం ఉన్న మెత్తని స్టెరైల్ Pvc ప్లాస్టిక్ బేగ్ లలో సేకరించి 4--6 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ మైన్టైన్ చేసే ప్రత్యేక ఫ్రిడ్జ్ లలో భద్ర పరుస్తారు. సేకరించిన బ్లడ్ బేగ్ ల సేంపిల్సు లేబోరేటరీలో అన్ని పరీక్షలు జరిపి సురక్షిత క్వాలిటీ బ్లడ్ ను ఫ్రిడ్జులలో ఉంచుతారు. బ్లడ్ ను ఎక్కువ కాలం ఫ్రిడ్జ్ టెంపరేచర్లో ఉంచేందుకు వాడే ఏంటికోగ్యులెంటును బట్టి 21రోజుల నుంచి 42 రోజల వరకు నిలవ ఉంచవచ్చు. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి మిషిన్ల ద్వారా ఒక బ్లడ్ డోనర్ నుంచి సేకరించిన రక్తాన్ని ఎర్ర రక్తకణాలు , తెల్ల రక్తకణాలు , ఫ్రోజెన్ ప్లాస్మా, ప్లేట్ లెట్స్ , ఫేక్ట‌ర్8 వంటి కాంపొనెంట్సు గా విభజించి తగిన పద్దతిలో భద్ర పరిచి విభిన్న రోగ పేషంట్లకు అందిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ తో బ్లడ్ డోనర్ నుంచి మొత్తం బ్లడ్ కాకుండా కావల్సిన కాంపొనెంట్ సేకరించే అవకాశం ఏర్పడింది. ఏంటికోగ్యులెంట్ రసాయన ద్రవంలో సేకరించిన బ్లడ్ లో ప్లాస్మా , ఏంటికోగ్యులెంట్ లేని రక్తంలో రక్తకణాలు గడ్డకట్టి సిరం అనే ద్రవపదార్ధం ఏర్పడుతుంది. లేబోరేటరీలో రక్తదాత బ్లడ్ సేంపిల్ తో రక్తం స్వీకరించే పేషెంట్ రక్త సేంపిల్ తో బ్లడ్ గ్రూప్ క్రాస్ మేచ్ చేసి ఎటువంటి రియాక్షన్ లేనప్పుడు పేషెంట్ కి బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజ్ చేస్తారు. పాత రోజుల్లో రక్త దానం చేసే వారిలో ప్రొఫెషనల్, వాలంటీర్స్ బ్లడ్ డోనర్స్ గా ఉండేవారు. ప్రొఫెనల్స్ బ్లడ్ డోనర్స్ గా రిక్షాపుల్లర్స్ ,హోటల్ సర్వర్స్ ,చిత్తు కాగితాలు ఏరుకునే వారు, బెగ్గర్స్ డబ్బు కోసం వివిధ ప్రైవేట్ బ్లడ్ బేంకుల్లో బ్లడ్ అమ్ముకునేవారు. వారిలో సరైన తిండిపోషణ లేక హెమోగ్లోబిన్ తక్కువ గాను అనేక గుప్తరోగాలతో బక్క చిక్కి పరిమిత సమయానికి ముందే బ్లడ్ ఇచ్చేవారు. అప్పట్లో ఆరోగ్య వంతులెవరూ అపోహలతో రక్తదానానికి ముందుకు రానందున బ్లడ్ బేంకుల వారు ప్రొఫెషనల్ బ్లడ్ డోనర్స్ మీద ఆధార పడవల్సి వచ్చేది. బ్లడ్ తీసుకునే ముందు లేబ్ టెస్టులు చేసినా అవి నామ మాత్రమే.అందు వల్ల రోగులకు అనేక సంక్రమిత వ్యాధులు సంభవించేవి. కాలగమనంలో ప్రభుత్వాలు ప్రొఫెషనల్ డోనర్స్ ని నిషేదించి ప్రజలలో రక్తదానం గురించి అవగాహన కల్పించి ప్రోత్సహించి నందున వాలంటీర్స్ బ్లడ్ డోనర్స్ గా యువత, ప్రభుత్వ ఉధ్యోగులు, రోగుల బంధువుల నుంచి రీప్లేస్ మెంటుగా రక్తసేకరణ జరుగుతు ఆధునిక టెక్నాలజీ లేబ్ పరీక్షలు జరుపుతు క్వాలిటీ బ్లడ్ పేషెంట్లకు సరఫరా జరుగుతోంది. .స్వచ్ఛంద సంస్థల ద్వారా బ్లడ్ డొనేషన్ కేంపులు నిర్వహిస్తున్నప్పటికీ పేషెంట్లకు కావల్సిన పరిమితిలో రక్తం లబ్యం కావడం లేదు. ఆధునిక సౌకర్యాలున్న బ్లడ్ బ్యాంకులు డిపార్టుమెంటు ఆఫ్ బ్లడ్ మరియు ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్ గా మారాయి. ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటి న బ్లడ్ డోనర్స్ దినంగా పాటిస్తు ప్రోత్సకాలు ప్రకటిస్తున్నాయి. ఎటువంటి అపోహలు లేకుండా యువత బ్లడ్ డొనేషన్ కి ముందుకు వచ్చి మానవత్వం కనబర్చాలి. *. *. * హైదరాబాద్ వంటి నగరాల్లో స్వచ్ఛందంగా చిరంజీవి లాంటి బ్లడ్ బ్యాంకులు పేషంట్ల అవసరాలకు అందుబాటులో ఉన్నప్పటికీ బ్లడ్ కొరతగానే ఉంది. ఈమధ్య కాలంలో కోవిడ్ లాక్ డౌన్ ఇతర కారణాల వల్ల బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ కి కొరత ఏర్పడినట్టు తెల్సింది. కనుక యువజనులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేసే అవసరం ఏర్పడింది .

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు