బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి.

బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి.
వీరిమేనమామ కొటేశ్వరరావు స్వతహాగా హరిదాసు. ఉత్తమ గాయకుడు. మేనమామ పర్యచేక్షణలో పద్యాలు, పాఠాలు శ్రావ్యముగా పాడుట నేర్చుకున్నాడు. వానపాముల సత్యనారాయణ వద్ద పద్యాలు భావయుక్తముగా పాడుట, చిత్రకళలోని మెలకువలు నేర్చుకున్నాడు. శాస్త్రి నటనా విశిష్ఠత గుర్తించిన బి.వి. నరసింహారావు నాట్యశాస్త్రములోని నూతన ప్రయోగ రీతులన్నీ నేర్పాడు. శాస్త్రి అన్న తగినంత ప్రోత్సాహమిచ్చి నాటకరంగాన నిలిపి ఉత్తమ స్త్రీ పాత్రధారిగా తీర్చి దిద్దాడు. అకుంఠిత కార్యదీక్షతో ఉత్తమ స్త్రీ పాత్రలైన సత్యభామ, చింతామణి, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి మొదలైన పాత్రలు ధరించి ఆంధ్ర దేశ ముఖ్య పట్టణాలలో స్త్రీ పాత్రధారణలో "ఔరా" అనిపించుకున్నాడు. స్వంతంగా సత్యసాయిబాబా నాటక సమాజము స్థాపించి నాటక ప్రదర్శనలిచ్చి రసజ్ఞులందరి మెప్పు పొందాడు. శాస్త్రి పాత తరం నటుల సంప్రదాయాలైన క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర అన్వేషణ, నిత్యసాధన, కొత్త ప్రయోగాలపై తపన, ఆశయసాధన కనిపిస్తాయి.
శాస్త్రి స్త్రీ పాత్రలన్నింటిలోను ఒక నూతనత్వం గోచరిస్తుంది. కవి సృష్టించిన పాత్రకు న్యాయము చేస్తూ, మరొకవైపు సృజనాత్మక రూపం పాత్రకు ఆపాదింపచేసి సజీవ శిల్పం తో రాణింపు కలగచేస్తాడు. భావయుక్తమైన సంభాషణ విధానమూ, ఆ విధానానికి తగిన సాత్విక చలనమూ, ఆ చలనముతో సమ్మిళితమైన నేత్రాభినయనమూ, పలుకూ, కులుకూ, సొంపూ, ఒంపూ, హొయలు, ఒయ్యారాలతో నాట్యమయూరిలా, శృంగార రసాధిదేవతగా ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరయ్యేటట్లు నటించేవాడు. చూపు మన్మధ బాణంలా ఉండేది. ప్రేక్షకుల కరతాళధ్వనితో నిండిపోయేది. శాస్త్రి స్త్రీ పాత్రాభినయానికి ముగ్ధులైన విశ్వనాధ సత్యనారాయణ "నాట్యాచార్య" బిరుదునిచ్చాడు. ఆంధ్ర ప్రజానీకం "అభినయ సరస్వతి" అని, కొండవీటి వెంకటకవి "నాట్యమయూరి" అని బిరుదులిచ్చారు. అనేక చోట్ల ఘన సన్మానాలు, బంగారు కంకణాలనూ అందుకున్నారు.
ఈయన కుమారుడైన సాయిమాధవ్‌ బుర్రా తెలుగు సినీరంగంలో రచయితగా పనిచేస్తున్నారు. బుర్రా వారు
2019, ఏప్రిల్ 7న హైదరాబాదులో తుదిశ్వాసవిడిచారు.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

 

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్
Kashi Prayana Kathalu - Phalitham leni Mantram
కాశీ ప్రయాణ కథలు - ఫలితం లేని మంత్రం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు