తెన్నేటి విశ్వనాథం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

తెన్నేటి విశ్వనాథం.

తెన్నేటి విశ్వనాథం.
వీరు1895 సెప్టెంబర్ 9 వతేదిన లో విశాఖపట్నం జిల్లా లక్కవరంలో చిట్టెమ్మ,గౌరిపతిశాస్త్రి దంపతులకు జన్మించిన విశ్వనాథం మద్రాసులో బి. ఎ., ఎం. ఎ. పూర్తి చేసి, 1918 ట్రివేండ్రంలో లా పట్టా తీసుకుని విశాఖపట్నంలో ప్రేక్టీస్ చేస్తూ1926లో విశాఖపట్నం కాంగ్రెస్ కమిటికి అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డారు. మహాత్మా గాంధీచే ప్రభావితుడై స్వాతంత్ర్యోద్యమములో చేరి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలములో ఐదు సార్లు జైలుకు వెళ్లాడు. 1937లో మద్రాసు శాసనసభకు ఎన్నికైనాడు. స్వరాజ్యం వచ్చిన తర్వాత కాంగ్రేస్ పార్టీని వదలి పెట్టి,1947 లో విశాఖా మునిసిపల్ చైర్మెన్ పదవి చేపట్టారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రజా పార్టీలో చేరేరు. విశ్వనాథం 1951లో మద్రాసు శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా కూడా పనిచేశాడు.1952-62-67లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించారు.ప్రకాశం పంతులువారి మంత్రివర్గంలో ఆర్ధిక,న్యాయ, దేవాదాయ శాఖలు నిర్వహించారు.జమిందారి వ్యవస్ధ రద్దుకు,కృష్ణానది నాగార్జున సాగర్ బ్యారేజి నిర్మాణానికి విశాఖఉక్కు ప్యాక్టరి శంఖుస్ధాపనకు విషేషంగాకృషిచేసారు.జై ఆంద్రా ఉద్యమంలో ఆరుసార్లు అరెస్టు అయ్యారు.తనకు వచ్చే ఫెంక్షన్, పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారు.ఎమర్జన్సి సమయంలో చెరసాలలో ఉన్నారు.1977 లో రాష్ట్రజనతాపార్టి అధ్యక్షులుగా ఉన్నారు.భగవద్గీతపై వ్యాఖ్యనం,కలవరింతలు,నవజీవనము,యాజ్ఞవల్క్య,మనలోక్ సభ,శ్రీరామ విప్రవాసము,తత్త్వమసి వంటి రచనలుచేసారు. కొన్నిరచనలు అనువాదించారు.ఇంకా చిన్న వయస్సులో ఉన్న రోజులలోనే వారింట అంతా ఆయనని పెళ్ళి చేసుకోమని బలవంత పెట్టేరుట. ఆయనకి అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదో, లేక చూపించిన పిల్లంటే ఇష్టం లేదో, తెలియదు కాని మొత్తం మీద అప్పట్లో ఆయన పెళ్ళి చేసుకోటానికి ఇష్టపడ లేదుట. ఈసందర్భంలోనేఆయనఇంట్లోఎవ్వరితోటీచెప్పకుండా రంగూన్ వెళ్ళిపోయారుట.విశ్వనాధం గారు మంచి స్పురద్రూపి, వక్త గానే కాకుండా తెలుగు, సంస్కృత భాషలలో మంచి ప్రవేశము ఉన్న వ్యక్తి. విశ్వనాధం గారు విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి చెప్పుకోదగ్గ కృషి చేశారు. ఈయన కాఫీ బోర్డు ప్రెసిడెంటుగా ఉన్న రోజులలోనే అరకు లోయలో కాఫీ తోటలు వేయించటం మొదలు పెట్టేరు. ఈ సేవని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం పురజనులు వారి పురపాలక సంఘం భవనానికి “తెన్నేటి భవన్” అనీ, వారి ఊరిలో ఉన్న ఒక పార్కుకి “తెన్నేటి పార్క్” అని పేరు పెట్టుకున్నారు. ఆయన విగ్రహం ఇప్పటికీ జగదాంబా సినిమా హాలు దగ్గర ఉంది.
భారతీయ తపాలా శాఖ తెన్నేటి విశ్వనాథం స్మృత్యర్ధం 2004 నవంబర్ 10వ తేదీన ఐదు రూపాయల తపాళా బిళ్లను పోస్టు మాస్టర్ జనరల్ ఎస్.కె.చక్రబర్తి విడుదల చేశారు.బహుముఖ ప్రజ్ఞా శాలిఅయినవీరు తమజీవితమంతా ఉన్నతమైన విలువలకు కట్టుబడి అహర్నిశలు ప్రజేసేవలోనేగడిపినవీరు 1979 నవంబర్10 వతేదిన తుదిశ్వాసవిడిచారు.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

 

మరిన్ని వ్యాసాలు

మోక్షప్రదాయని చిదంబరం.
మోక్షప్రదాయని చిదంబరం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బహుముఖ ప్రజ్ఞాశాలి తురగా జానకిరాణి.
బహుముఖ ప్రజ్ఞాశాలి తురగా జానకిరాణి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
చదువులతల్లి...
చదువులతల్లి...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
దక్షణాది నటి జయంతి.
దక్షణాది నటి జయంతి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Prakrithi-purushudu-aatma
ప్రకృతి - పురుషుడు - ఆత్మ
- కందుల నాగేశ్వరరావు