Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tarakaratna as vilan once again

ఈ సంచికలో >> సినిమా >>

నందమూరి సంక్రాంతి.. పండగే పండగ

nandamuri family - sankanti festival
సంక్రాంతి పండుగొస్తోంది. సినిమాల పండగ తెస్తోంది. ఈ సంక్రాంతికి నందమూరి వారి సినిమాలతో నిజమైన పండుగ మొదలు కాబోతోంది. శ్రీవాస్‌ డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ హీరోగా 'డిక్టేటర్‌' సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతి అంటే బాలయ్య సినిమాలకి స్పెషల్‌ పండగ. అభిమానులు తమ అభిమాన హీరోని సంక్రాంతి సింహంగా అభివర్ణిసస్తారు. మరో పక్క జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో 'నాన్నకు ప్రేమతో' సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఒకే సంక్రాంతికి డబుల్‌ డోస్‌ అన్నమాట నందమూరి అభిమానులకి. కొత్త సంవత్సరంలో, అదీ సంక్రాంతికి నందమూరి హీరోలు బోణీ కొట్టబోతున్నారు. అంటే సంక్రాంతికి బాబాయ్‌ అబ్బాయ్‌లదే పోటీ. ఫుల్‌ జోష్‌తో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు ఈ నందమూరి హీరోలు. 'డిక్టేటర్‌'లో అంజలితో బాలకృష్ణ జత కట్టబోతున్నాడు. 'నాన్నకు ప్రేమతో' లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 
మరిన్ని సినిమా కబుర్లు
beautiful devils on silver screen