Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope(July 19 - July 25)

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాకూలు - సాయిరాం ఆకుండి

మనీభావాలు

సినిమా విడుదలౌతుందంటే చాలు...
మనోభావాలు గాయపడ్డాయంటూ గగ్గోలు!

ప్రతీ పదానికీ విపరీతార్థాలు...
ఇహ మళ్ళీ మూకీ సినిమాలే మేలు మేలు!!


అనారోగ్య భారతం

పెరిగిపోతున్న డయాబెటీసు...
పరిధిదాటుతున్న కొలెస్టరాలు!

అరువు తెచ్చుకున్న జీవన శైలి...
ఆరోగ్యానికి కోరి తెచ్చుకున్న హాని!!


 

బ్లాక్ అండ్ వైట్ రెయిన్ బో

లెక్కలకందని నల్లధనం...
తెలుపుగ మార్చే తెలివితనం!

ఆర్థిక నేరాలకు అనువైన భారతం..
పట్టేవాళ్ళే లేరా ఈ నేరస్థుల భరతం!!    

మరిన్ని శీర్షికలు
Navvula Jallu by Jayadev Babu