Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tasmath jaagratha

ఈ సంచికలో >> శీర్షికలు >>

రైలు పట్టాలు - బన్ను

railway track

"వాడు రెండు చేతులా సంపాదిస్తున్నాడురా!" అంటే అవతలివాడికి అసూయకలుగుతుంది. "పాపం వాడికి ఉద్యోగం లేదట్రా...!" అంటే జాలి కలుగుతుంది. నా జీవితంలో కొందర్ని చూశాను. వాళ్ళు ఈరోజుల్లో యావరేజ్ జీతం 25 - 40 వేలు సంపాదించేవాళ్ళే. 'నీ పెళ్ళెప్పుడు మరి?" అని అడిగితే 'సెటిల్ అవ్వాలి కదా!' అంటారు. సెటిల్ మెంట్ కి పరిధి లేదు. కూలివాడు పెళ్ళి చేసుకోవటం లేదా? పిల్లల్ని కనటం లేదా? వాడు సెటిల్ మెంట్ గురించి ఆలోచిస్తున్నాడా? దానికి అర్ధం లేదనే నా అభిప్రాయం!!

కొందరు ఉద్యోగస్తులు పెళ్ళయ్యాకా సంసార భాద్యతలకి ప్రాధాన్యత నిచ్చి పని మీద అశ్రద్ధ పెడతారు. ఇంకొందరు ఉద్యోగానికి ప్రాధాన్యత నిచ్చి ఇంటిని మరిచిపోతారు. నా దృష్టిలో రెండూ తప్పే! 'సంపాదన', 'సంసారం' రెండూ రెండు పట్టాలు లాంటివి. రెండూ సరిగ్గా ఉంటేనే 'రైలు' వెళ్తుంది. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా మన 'లైఫ్ స్టయిల్' కి తగ్గట్టు 'ఫిక్స్ డు ఇన్ కమ్' వచ్చేలా చూసుకోవాలి. మీ బాస్ ని గాని, ఇంట్లో వాళ్ళని గాని నొప్పించకండి. ఇంటి గొడవలు ఇంట్లో, ఆఫీస్ టెన్షన్లు ఆఫీసులో వదిలేస్తే మన జీవితం చక్కగా సాగుతుంది. 'సంపాదన లేని భర్తని 'శవం' లా చూస్తుంది భార్య' అని ఓ పెద్దాయన చెప్పారు. అలా అని... పూర్తిగా సంపాదనలో పడిపోతే ఆమే విసుక్కుంటుంది.

నన్ను చాలామంది అడుగుతుంటారు... 'నీకింత టైమెక్కడిది?' అని! "రోజుకి 24గంటలే అనుకుంటే టైముండదు. కానీ రోజుకు 86,400 సెకండ్లు అనుకుంటే టైమున్నట్లే!!"

మరిన్ని శీర్షికలు
Vantillu - Telangana Chicken Curry