Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with sunil

ఈ సంచికలో >> సినిమా >>

కృష్ణాష్టమి చిత్రసమీక్ష

krishnashtami movie review

చిత్రం: కృష్ణాష్టమి 
తారాగణం: సునీల్‌, నిక్కీ గాల్రాని, డింపుల్‌ చోప్డా, అశుతోష్‌ రాణా, ముఖేష్‌ రుషి, పవిత్రా లోకేష్‌, తులసి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, సప్తగిరి, పృధ్వీ, హర్ష, అజయ్‌ తదితరులు. 
సంగీతం: దినేష్‌ 
ఛాయాగ్రహణం: ఛోటా కె నాయుడు 
నిర్మాణం: వెంకటేశ్వర క్రియేషన్స్‌ 
దర్శకత్వం: వాసు వర్మ 
నిర్మాత: దిల్‌ రాజు 
విడుదల తేదీ: 19 ఫిబ్రవరి 2016

క్లుప్తంగా చెప్పాలంటే 
కృష్ణ ప్రసాద్‌ (సునీల్‌) చిన్నప్పటినుంచీ విదేశాల్లోనే ఉంటాడు. స్వదేశం మీద ప్రేమతో ఇండియాకి రావాలనుకుంటాడు. అయితే కుటుంబ సభ్యులు అతన్ని రానివ్వరు. వారికి చెప్పకుండా ఇండియాకి బయల్దేరతాడు కృష్ణప్రసాద్‌. ఈ క్రమంలో పల్లవి (నిక్కీ గల్రాని)తో ప్రేమలో పడతాడు కృష్ణ ప్రసాద్‌. అయితే ఇండియాకి రాగానే ఆయనపై ఎటాక్‌ జరుగుతుంది. ఎటాక్‌ చేసిందెవరు? కుటుంబ సభ్యులు కృష్ణ ప్రసాద్‌ని ఇండియాకి ఎందుకు రానివ్వరు? ప్రేమించిన అమ్మాయి పల్లవిని కృష్ణ ప్రసాద్‌ దక్కించుకున్నాడా? విదేశాల్లో పెరిగిన కృష్ణప్రసాద్‌పై అంత కక్ష ఎవరికి? అనేవి తెరపైనే చూసి తెలుసుకోవాల్సిన అంశాలు.

మొత్తంగా చెప్పాలంటే 
సునీల్‌ సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. తన ట్రేడ్‌ మార్క్‌ కామెడీ పండించాడు. హీరోయిజం చూపించాడు. డాన్సుల్లో సత్తా చాటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సునీల్‌, సినిమాకి అన్నీ తానే అయి సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు. హీరోయిన్లలో నిక్కీ గాల్రాని క్యూట్‌గా ఉంది. గ్లామర్‌ బాగానే పండించింది. మరో హీరోయిన్‌ డింపుల్‌ చోపాడే ఇంకా హాట్‌గా కనిపించింది. ఇద్దరూ గ్లామర్‌లో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. నటన పరంగా ఇద్దరూ ఓకే.

విలన్‌ అశుతోష్‌ రాణా మామూలే. ముఖేష్‌ రుషి బాగా చేశాడు. పోసాని, బ్రహ్మీ, సప్తగిరి తమ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. ఈ మధ్యకాలంలో చెలరేగిపోతున్న పృధ్వీ కూడా ఈ సినిమాలో ఓకే. తులసి, పవిత్ర లోకేష్‌ మామూలే. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

కథ కొత్తదేమీ కాదు. తెలిసినదే. కథనం విషయంలో కూడా మరీ కొత్తగా ఏమీ ట్రై చెయ్యలేదు. కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌, డాన్స్‌ ఇలా కమర్షియల్‌ ఫార్మాట్‌ మిస్‌ కాకుండా అన్ని అంశాలూ పొందు పర్చాడు దర్శకుడు. డైలాగ్స్‌ బాగున్నాయి. సంగీతం ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగానే ఉంది. తెరపై పాటలు చూడ్డానికీ బాగున్నాయి. సినిమాని చాలా రిచ్‌గా చూపించడం వెనుక సినిమాటోగ్రఫీ ప్రతిభను మెచ్చుకోవాలి. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి రిచ్‌నెస్‌ తెచ్చాయి. నిర్మాణపు విలువలు చాలా చాలా బాగున్నాయి. సినిమాలో ఆ రిచ్‌నెస్‌ బాగా కనిపించింది. 
ఫస్టాఫ్‌ కాస్త రొమాన్స్‌, కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలా అలా సాగిపోతుంది. సెకెండాఫ్‌ కూడా అంతే. అక్కడక్కడా ఫన్నీ థింగ్స్‌, ఎమోషన్‌ టచ్‌, యాక్షన్‌ సీన్స్‌ ఇలా కమర్షియల్‌ ఫార్మాట్‌ పరిధి దాటకుండా దర్శకుడు సినిమాని నడిపించేశాడు. సునీల్‌ డాన్సులు, హీరోయిన్ల గ్లామర్‌ మాస్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. యాక్షన్‌ హీరోగా సునీల్‌ ఇంకొంచెం కొత్తగా కనిపించాడు ఈ సినిమాలో. ఓవరాల్‌గా సినిమా జస్ట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అనిపించుకుంటుంది. నేల విడిచి సాము ఎక్కడా చెయ్యలేదు. కొత్తదనం గురించీ ఆలోచించలేదు. నిర్మాత సినిమా గురించి ముందే క్లారిటీ ఇచ్చేశార్లెండి. సునీల్‌ సినిమాకి ఉండే కామన్‌ ఆడియన్స్‌ని మెప్పించేలానే ఉందీ సినిమా.

ఒక్క మాటలో చెప్పాలంటే 
కృష్ణాష్టమి రొటీన్‌ కమర్షియల్‌ ఫార్ములా

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
charan started