Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
thulasi pooja

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఓపిక - బన్ను

patience

చాలా మందికి ఓపిక (patience) తక్కువైపోతోంది. ముఖ్యంగా యువతలో! ఇంజనీరింగో, ఎమ్.సి.ఏ నో కంప్లీట్ చేసి... హైదరాబాద్ అమీర్ పేట లో ఓ కోర్స్ లో జాయిన్ అవుతారు. అంతా తొందరగా అయిపోవాలంటారు. 'కోచింగ్ సెంటర్స్' దాన్ని క్యాష్ చేస్కుంటున్నాయి. ఉదాహరణకి 45 రోజులు పట్టే PHP కోర్సు 7 రోజుల్లో పూర్తిచేస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. 7 రోజుల్లో వాళ్ళేం చెప్తారో... వీళ్ళేం నేర్చుకుంటారో తెలీదు. కోర్సు చేస్తూనే కలలు కనేస్తారు... అర్జంటుగా ఓ MNC లో చేరి 50 వేల ఉద్యోగం కొట్టేయాలి అని...! (ట్రయినీకి 50 వేలు ఇస్తారా? అనే ప్రశ్న వాళ్ళ మైండ్ లోకే రాదు) ఆ ప్రయత్నాలతో విసిగి... ఆఖరుకి ఏ రికమండీషన్ తోనో పార్ట్ టైం లోనే జాయిన్ అవుతున్నారు.

ఐతే అక్కడ ఎలా చేరినా కృషి, పట్టుదలతో పని చేసి పైకి రావచ్చు. ఆ ఓపిక లోపిస్తుంది. జీతం మీద శ్రద్ధ తగ్గించి, పని మీద శ్రద్ధ పెడితే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. 'డెడికేటెడ్' ఉద్యోగస్తులకై ఎన్నో కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. పైకి రావాలంటే నిరూపించుకోవాలి! అందుకు కొంత వ్యవధి కావాలి. 'ఓపిక' కావాలి!! నేను చెప్పేది IT రంగం మాత్రమే కాదు. 'ఫార్మా', 'సినిమా రంగం' ఏదైనా కానివ్వండి.

ఓ ప్రముఖ వ్యక్తి 'సక్సస్' మాత్రమే కన్పిస్తుంది. కానీ దాని వెనుకున్న 'ఓపిక' ఎవరికీ కనపడదు. నా దృష్టిలో 'కృషి', 'పట్టుదల' ఎంత అవసరమో 'ఓపిక' కూడా అంతే అవసరం!

మరిన్ని శీర్షికలు
Tips for writers